Telangana Corona: తెలంగాణ కరోనా కేసులపై హోంశాఖ మంత్రి సమీక్ష.. కరోనా కట్టడికి మరిన్ని చర్యలు
Telangana Corona: తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో వ్యాపిస్తోంది. రోజురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతోంది. ఇక దేశ వ్యాప్తంగా కూడా కరోనా కేసులు..
Telangana Corona: తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో వ్యాపిస్తోంది. రోజురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతోంది. ఇక కరోనా కేసులు పెరుగుతుండటంతో ఆందోళన వ్యక్తం అవుతోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ హోంశాఖ మంత్రి మహమూద్ ఆలీ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో లాక్‌డౌన్ పెట్టడం కేసీఆర్‌కు ఇష్టం లేదని, లాక్‌డౌన్‌పై ముఖ్యమంత్రి తుది నిర్ణయం తీసుకుంటారని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలో కరోనా వ్యాప్తి తీవ్ర స్థాయిలో ఉన్నందున పోలీసు ఉన్నతాధికారులతో చర్చించినట్లు తెలిపారు. త్వరలో రాష్ట్రంలో పరిస్థితులపై కేసీఆర్ సమీక్ష నిర్వహిస్తారని పేర్కొన్నారు.
అయితే ప్రస్తుతం కరోనాపై మరిన్ని చర్యలు చేపడుతన్నట్లు తెలిపారు. రాష్ట్రంలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయని, మరణాలు కూడా పెరుగుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా కేసులను అసరాగా చేసుకుని బ్లాక్ మార్కెట్ దందా విలచ్చలవిడిగా కొనసాగుతుందని, ఆక్సిజన్ నుంచి రెమిడిసివర్ ఇంజక్షన్ వరకూ బ్లాక్ మార్కెట్ దందా జరుగుతుందని తెలిపారు. బ్లాక్ మార్కెట్ దందాను అరికట్టేలా చర్యలు తీసుకోవాలని ఆయన పోలీసులను ఆదేశించారు.