CM KCR: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మరోసారి కరోనా పరీక్షలు.. నెగెటివ్‌ నిర్ధారణ.. వైద్యుల వెల్లడి

Telangana CM K Chandrashekhar Rao: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కరోనా నెగెటివ్‌ నిర్ధారణ అయ్యింది. కేసీఆర్‌కు బుధవారం రాపిడ్‌ యాంటిజెన్‌, ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు..

CM KCR: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మరోసారి కరోనా పరీక్షలు.. నెగెటివ్‌ నిర్ధారణ.. వైద్యుల వెల్లడి
Cm Kcr
Follow us

|

Updated on: Apr 28, 2021 | 7:48 PM

Telangana CM K Chandrashekhar Rao: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కరోనా నెగెటివ్‌ నిర్ధారణ అయ్యింది. కేసీఆర్‌కు బుధవారం రాపిడ్‌ యాంటిజెన్‌, ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు నిర్వహించారు. రాపిడ్‌ పరీక్షల్లో నెగెటివ్‌ వచ్చినట్లు వైద్యులు తెలిపారు. అలాగే ఆర్టీపీసీఆర్‌ పరీక్ష ఫలితాలు రేపు రానున్నాయి. స్వల్ప లక్షణాలతో ఈనెల 19న కోవిడ్‌ పరీక్షలు చేయించుకోగా, పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. వైద్యుల సూచన మేరకు అప్పటి నుంచి ఎర్రవల్లిలోని ఆయన వ్యవసాయ క్షేత్రంలో ఐసోలేషన్‌లో ఉన్నారు. సీఎం వ్యక్తిగత వైద్యుడు ఎంవీ రావు నేతృత్వంలోని వైద్యుల బృందం కేసీఆర్‌ ఆరోగ్యాన్ని పరీక్షిస్తోంది. ఈ నెల 21న సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో సిటీ స్కాన్‌ సహా ఇతర పరీక్షలు నిర్వహించారు. ఛాతీలో ఎలాంటి ఇన్‌ఫెక్షన్‌ లేదని సిటీ స్కాన్‌లో తేలినట్లు వైద్యులు వెల్లడించారు. తాజాగా ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మరోసారి పరీక్షలు నిర్వహించగా, యాంటీజెన్‌ టెస్టులో నెగెటివ్‌ తేలింది.

కాగా, ఈనెల 21న కేసీఆర్‌కు సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో సిటి స్కాన్ మరియు సాధారణ ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ వ్యక్తిగత వైద్యులు ఎం. వి. రావు ఆధ్వర్యంలో ఈ పరీక్షలను నిర్వహించారు. కేసీఆర్‌ ఊపిరితిత్తులు సాధారణంగా ఉన్నాయని, ఎటువంటి ఇన్పెక్షన్ లేదని డాక్టర్లు తెలిపారు. సాధారణంగా నిర్వహించే రక్త పరీక్షల నిమిత్తం కొన్ని రక్త నమూనాలను సేకరించారు. అయితే ఈ రోజు దాదాపు 40 నిమిషాల పాటు వివిధ పరీక్షలు నిర్వహించారు.

ఇవీ చదవండి:

Maruti Suzuki: ఆక్సిజన్‌ పొదుపు కోసం మారుతి సుజుకీ కీలక నిర్ణయం.. కర్మాగారాలు మూసివేస్తున్నట్లు ప్రకటన

పీఎం కేర్స్ ఫండ్ నుంచి లక్ష పోర్టబుల్ కాన్సెంట్రేటర్లు, 500 ఆక్సిజన్ ప్లాంట్లు, ప్రధాని మోదీ వెల్లడి

మామిడి సీజన్‌లో చల్లగా ఇలా మ్యాంగో లస్సీ చేసుకోండి.. ఆహా అంటారు!
మామిడి సీజన్‌లో చల్లగా ఇలా మ్యాంగో లస్సీ చేసుకోండి.. ఆహా అంటారు!
వేసవి కాలంలో వచ్చే ఒళ్లు నొప్పులు ఇలా తగ్గించుకోండి..
వేసవి కాలంలో వచ్చే ఒళ్లు నొప్పులు ఇలా తగ్గించుకోండి..
బేకరీ డెజర్ట్స్ ను ఎక్కువగా తింటున్నారా.. పేగుల ఆరోగ్యం జాగ్రత్త
బేకరీ డెజర్ట్స్ ను ఎక్కువగా తింటున్నారా.. పేగుల ఆరోగ్యం జాగ్రత్త
తాజాగా వెలుగు చూసిన మాజీ ప్రధాని మన్మోహన్‌ వీడియో.!
తాజాగా వెలుగు చూసిన మాజీ ప్రధాని మన్మోహన్‌ వీడియో.!
డీజే టిల్లు సాంగ్‌కు కోహ్లీ హుషారైన స్టెప్పులు.. వీడియో చూశారా?
డీజే టిల్లు సాంగ్‌కు కోహ్లీ హుషారైన స్టెప్పులు.. వీడియో చూశారా?
ఏపీలో పొన్నవోలు వర్సెస్ వైఎస్ షర్మిల..
ఏపీలో పొన్నవోలు వర్సెస్ వైఎస్ షర్మిల..
ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో చిటికెడు ఉప్పు వేసుకుని తాగితే..
ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో చిటికెడు ఉప్పు వేసుకుని తాగితే..
జాతకంలో శని దోషమా, ఏలినాటి శని ప్రభావమా.. రెమిడీస్ మీ కోసం
జాతకంలో శని దోషమా, ఏలినాటి శని ప్రభావమా.. రెమిడీస్ మీ కోసం
చిక్కుల్లో ప్రముఖ నిర్మాత.. ఆత్మహత్యాయత్నం చేసిన పనిమనిషి..
చిక్కుల్లో ప్రముఖ నిర్మాత.. ఆత్మహత్యాయత్నం చేసిన పనిమనిషి..
చింతపండుతో ఆరోగ్యమే కాదు.. ఇంటికి అందం కూడా.. ! ఎన్ని లాభాలా?
చింతపండుతో ఆరోగ్యమే కాదు.. ఇంటికి అందం కూడా.. ! ఎన్ని లాభాలా?