Maruti Suzuki: ఆక్సిజన్‌ పొదుపు కోసం మారుతి సుజుకీ కీలక నిర్ణయం.. కర్మాగారాలు మూసివేస్తున్నట్లు ప్రకటన

Maruti Suzuki: దేశంలో కరోనా మహమ్మారి కొరలు చాస్తోంది. పాజిటివ్‌ కేసులు పెరిగిన కొద్ది దేశంలో ఆస్పత్రుల్లో బెడ్స్‌తో పాటు ఆక్సిజన్‌ కొరత ఎక్కువైపోతోంది. ఈ నేపథ్యంలో..

Subhash Goud

|

Updated on: Apr 28, 2021 | 7:26 PM

దేశంలో కరోనా మహమ్మారి కొరలు చాస్తోంది. పాజిటివ్‌ కేసులు పెరిగిన కొద్ది దేశంలో ఆస్పత్రుల్లో బెడ్స్‌తో పాటు ఆక్సిజన్‌ కొరత ఎక్కువైపోతోంది. ఈ నేపథ్యంలో ఆక్సిజన్‌ పొదుపు కోసం ప్రముఖ కార్ల తయారీ కంపెనీ మారుతీ సుజుకీ కీలక నిర్ణయం తీసుకుంది. ఆస్పత్రుల్లో వైద్య అవసరాలకు సరిపడ ఆక్సిజన్‌ అందుబాటులో ఉంచడం కోసం హర్యానాలోని తమ కర్మాగారాలు అన్నింటినీ మూసివేస్తున్నట్లు మారుతి సుజుకీ ప్రకటించింది. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది.

1 / 4
అయితే వాస్తవానికి మారుతి సుజుకీ కంపెనీ ప్రతి రెండేళ్లకోసారి మెయింటెనెన్స్‌ షట్‌డౌన్‌ విధిస్తుంటుంది. అయితే జూన్‌లో మెయింటెనెన్స్‌ షట్‌డౌన్‌ విధించాలని కంపెనీ నిర్ణయించింది. కానీ ప్రస్తుత కరోనా విపత్కర పరిస్థితుల్లో ఆక్సిజన్‌ కొరత కారణంగా తమ మెయింటెనెన్స్‌ షట్‌డౌన్‌ మే 1వ తేదీ నుంచి 9వ తేదీ వరకు అమలు చేయాలని నిర్ణయించినట్లు వెల్లడించింది.

2 / 4
తొమ్మిది రోజుల పాటు తన కర్మాగారాల్లో మాన్యుఫాక్చరింగ్‌ నిలిపివేయడం వల్ల ఆక్సిజన్‌ వినియోగం ఉండదు. దాని వల్ల ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఎందరో కరోనా రోగులకు మేలు జరుగుతుందని సంస్థ భావించామని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.

3 / 4
గుజరాత్‌లోని సుజుకీ మోటార్‌ కంపెనీ కూడా ఇదే నిర్ణయం తీసుకుందని సంస్థ వెల్లడించింది. ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న కరోనా రోగుల కోసం కర్మాగారాల్లోని ఆక్సిజన్‌ను ఆస్పత్రులకు మళ్లించడంతో ప్రభుత్వానికి మద్దతుగా తాము ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించింది.

4 / 4
Follow us
జామ ఆకే కదా అని తీసిపారేయకండి.. అది చేసే మేలు అంతా ఇంతా కాదు.!

పూనకాలు లోడింగ్.. పుష్ప వైల్డ్ ఫైర్ ఈవెంట్ మామూలుగా ఉండదు మరి..

చెర్రీ,వెంకీ,బాలయ్య ఎవరిది ఈ సంక్రాంతి.? అగ్ర తాంబూలం ఆ హీరోకేనా?

ఓటీటీ ఫీల్డ్‌లో.. కింగ్ మాదిరిగా మారిన ఐకాన్ స్టార్.! దద్దరిల్లిన

కిస్సిక్ అదిరింది.! ఇక బాడీలు ఊగడమే తరువాయి | చెర్రీ నయా రికార్డ్

పుష్ప దెబ్బతో టూరిస్ట్‌ స్పాట్‌గా మారిన ఆ గ్రామం.! వీడియో..

గుర్తు పట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరోయిన్.ఇలా మారిపోయింది ఏంటి

పుష్ప2 పై తప్పుడు ప్రచారం.. అవేమీ నమ్మకండి.! మూవీ టీం క్లారిటీ..

టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న స్టార్ క్రికెటర్ భార్య.

దిమ్మ తిరిగి బొమ్మ కనిపించిందట.! SJ సూర్య మాటలు వింటే గూస్బంప్స్.