TS DMH: రాష్ట్రంలో కరోనా అదుపులో ఉంది.. భయంతో పరీక్షలు పెరిగాయి.. రాబోయే 3,4 వారాలు మరింత కీలకంః శ్రీనివాస రావు

తెలంగాణలో కరోనా వైరస్‌ వ్యాప్తిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వైరస్ నియంత్రణకు వ‌చ్చే మూడు, నాలుగు వారాలు కీల‌క‌మ‌ని తెలంగాణ ప్రజారోగ్య సంచాల‌కులు శ్రీనివాస్ రావు అన్నారు.

TS DMH: రాష్ట్రంలో కరోనా అదుపులో ఉంది.. భయంతో పరీక్షలు పెరిగాయి.. రాబోయే 3,4 వారాలు మరింత కీలకంః శ్రీనివాస రావు
Telangana Medical And Public Health Director Srinivas Rao
Follow us
Balaraju Goud

|

Updated on: Apr 28, 2021 | 4:01 PM

Telangana Coronavirus situation: తెలంగాణలో కరోనా వైరస్‌ వ్యాప్తిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వైరస్ నియంత్రణకు వ‌చ్చే మూడు, నాలుగు వారాలు కీల‌క‌మ‌ని తెలంగాణ ప్రజారోగ్య సంచాల‌కులు శ్రీనివాస్ రావు అన్నారు. ప్రజ‌లంద‌రూ మరింత అప్రమ‌త్తంగా ఉండాల‌ని ఆయన సూచించారు.క‌రోనా క‌ట్టడికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చ‌ర్యలు స‌త్ఫలితాలు ఇస్తున్నాయని ఆయన స్పష్టం చేశారు. మే నెల‌ాఖరు వ‌ర‌కు అంద‌రూ జాగ్రత్తలు పాటించాల‌న్నారు. ప్రతి ఒక్కరూ మాస్కులు త‌ప్పనిస‌రిగా ధ‌రించాల‌ని విజ్ఞప్తి చేశారు. కోఠిలోని ప‌బ్లిక్ హెల్త్ డైరెక్ట‌ర్ కార్యాల‌యంలో శ్రీనివాస్ రావు మీడియాతో మాట్లాడారు.

వ‌చ్చే పెళ్లిళ్లు, పండుగ‌ల సీజ‌న్ సందర్భంగా మ‌రింత జాగ్రత్తగా ఉండాల‌న్నారు. కరోనా విష‌యంలో ప్రజ‌ల్లో అల‌స‌త్వం ప‌నికి రాదన్న ఆయన… కోవిడ్ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలన్నారు. గ‌త వారం రోజుల నుంచి రాష్ర్టంలో ప‌రిస్థితులు మెరుగుప‌డుతున్నాయి. రాష్ర్టంలో కేసుల్లో స్థిర‌త్వం ఉంద‌న్నారు. పాజిటివ్ కేసుల్లో 80 -90 శాతం వ‌ర‌కు ఆస్పత్రిలో చేరాల్సిన అవ‌స‌రం రాదన్నారు. కేవ‌లం 10 శాతం మందికే ఆస్పత్రికి వెళ్లాల్సిన అవ‌స‌రం వ‌స్తుంద‌న్నారు. రాష్ర్టంలో ఇప్పటి వ‌ర‌కు మొత్తం 45 ల‌క్షల మందికి టీకా ఇచ్చామ‌న్నారు. విడతల వారిగా మిగితా వారికి కూడా వాక్సిన్ వేయిస్తామన్నారు. ప్రస్తుతం రాష్ర్టంలో 95 శాతం వ‌ర‌కు రిక‌వ‌రీ రేటు ఉంద‌న్నారు. మొద‌టి ద‌శ‌లో దేశంలోనే అత్యధికంగా 99.5 శాతం రిక‌వ‌రీ రేటు తెలంగాణ రాష్ట్రమని పేర్కొన్నారు.

క‌రోనా ల‌క్షణాలు లేకున్నా ప‌రీక్షల కోసం వ‌స్తున్నారని.. అలా వ‌చ్చి స‌గం మంది క‌రోనాను అంటించుకుని వెళ్తున్నారని శ్రీనివాసరావు ఆందోళన వ్యక్తం చేశారు. కొంద‌రు వారంలో రెండుసార్లు ప‌రీక్షల‌కు వ‌స్తున్నారు. ఇదే క్రమంలో నిజంగా ప‌రీక్షలు, చికిత్స కావాల్సిన వారికి అంద‌డం లేదు. క‌రోనాకు ప‌రీక్షలు, చికిత్సకు సంబంధించి ప్రజ‌ల‌కు అవ‌గాహ‌న క‌ల్పిస్తున్నామ‌ని ఆయన తెలిపారు. ల‌క్షణాలు క‌నిపించిన‌ప్పుడే ప‌రీక్షలు చేయించుకోవాల‌ని సూచించారు.

రాష్ర్టంలో కోవిడ్ పేషెంట్లకు పూర్తి స్థాయిలో వైద్యం అందించేందుకు సిద్ధంగా ఉన్నామన్న డీఎంహెచ్.. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ఆసుపత్రుల్లో 50 వేల‌కు పైగా ప‌డ‌క‌లు అందుబాటులో ఉంచామన్నారు. 18 వేల‌కు పైగా ఆక్సిజ‌న్ ప‌డ‌క‌లు, 10 వేల‌కు పైగా ఐసీయూ ప‌డ‌క‌లు ఉన్నాయ‌న్నారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో ప‌డ‌క‌లు పెంచేందుకు ప్రయ‌త్నిస్తున్నామ‌ని స్పష్టం చేశారు. ఆక్సిజ‌న్, ప‌డ‌క‌లు, ఔష‌ధాల విష‌యంలో మ‌నం మెరుగైన స్థితిలో ఉన్నామ‌ని తెలిపారు. ఏడాదిన్నర‌గా ప్రజారోగ్య సిబ్బంది అలుపెర‌గ‌ని పోరాటం చేస్తున్నారు. ఈ సంక్షోభ స‌మ‌యంలోనూ త‌మ‌ సిబ్బంది విధుల‌కు హాజ‌ర‌వుతున్నారు. కుటుంబ‌, వ్యక్తిగ‌త జీవితాన్ని త్యాగం చేసి ప్రజ‌ల‌కు సేవ చేస్తున్నారని వైద్య సిబ్బందిని ఆయన అభినందించారు.

Read Also…  Covid-19: కరోనా నిమిషంలోనే వ్యాపిస్తుంది.. రిపోర్టు నెగిటివ్ వచ్చినా.. ఏమాత్రం అశ్రద్ధ వద్దు: గులేరియా