Covid-19: కరోనా నిమిషంలోనే వ్యాపిస్తుంది.. రిపోర్టు నెగిటివ్ వచ్చినా.. ఏమాత్రం అశ్రద్ధ వద్దు: గులేరియా

AIIMS Director Randeep Guleria: దేశంలో కరోనావైరస్ విలయతాండవం చేస్తోంది. ప్రతిరోజూ లక్షలాది కేసులు, వేలాది మరణాలు సంభవిస్తున్నాయి. సామాన్య ప్రజల

Covid-19: కరోనా నిమిషంలోనే వ్యాపిస్తుంది.. రిపోర్టు నెగిటివ్ వచ్చినా.. ఏమాత్రం అశ్రద్ధ వద్దు: గులేరియా
Dr Randeep Guleria
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Apr 28, 2021 | 3:26 PM

AIIMS Director Randeep Guleria: దేశంలో కరోనావైరస్ విలయతాండవం చేస్తోంది. ప్రతిరోజూ లక్షలాది కేసులు, వేలాది మరణాలు సంభవిస్తున్నాయి. సామాన్య ప్రజల నుంచి ప్రముఖుల వరకూ అందరూ కరోనా బారినపడి మృత్యువాతపడుతున్నారు. ఈ క్రమంలో చాలామందిలో ఎన్నో సందేహాలు నెలకొన్నాయి. ర్యాపిడ్ టెస్టులో కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయితే.. ఆర్టీపీసీఆర్ టెస్టులో నెగిటివ్ వస్తోంది. అయితే ఆర్టీపీసీఆర్ పరీక్షే ప్రమాణికమని వైద్యులు సూచిస్తున్న తరుణంలో ఢిల్లీ ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ గులేరియా కీలక సూచనలు చేశారు. ఆర్టీ పీసీఆర్ ప‌రీక్ష‌ల్లో నెగెటివ్ వ‌చ్చినా క‌రోనా రావచ్చని ర‌ణ‌దీప్ గులేరియా పేర్కొన్నారు. కొన్ని ర‌కాల కార‌కాలు, లక్షణాలు క‌నిపించాయంటే త‌ప్ప‌నిస‌రిగా కొవిడ్ అని భావించి సెల్ఫ్ ఐసోలేష‌న్‌లో ఉండాలని ఆయ‌న సూచించారు. కరోనావైరస్ కొత్త మ్యూటేషన్లు ఆర్టీ పీసీఆర్‌ పరీక్షల్లో కూడా నిర్ధారణ కావడం లేదని విచారం వ్య‌క్తం చేశారు. చాలా మందిలో కరోనా లక్షణాలు ఉన్నప్పటికీ, వారి రిపోర్టు నెగెటివ్‌గా ఉంటుందంటే.. క‌రోనా నిర్ధారణ కానట్టుగా భావించొద్ద‌ని ఆయ‌న సూచించారు.

ఆర్టీ పీసీఆర్‌ పరీక్ష రిపోర్టు నెగెటివ్‌గా ఉన్నప్పటికీ.. కరోనా లక్షణాలు ఉంటే.. దాని ప్రకారమే చికిత్స అందించాల్సిన అవ‌స‌రం ఉందని డాక్ట‌ర్ గులేరియా వెల్లడించారు. కరోనావైరస్ కొత్త మ్యూటేషన్ చాలా తొందరగా వ్యాపిస్తుందని.. కరోనా సోకిన రోగి నుంచి ఒక నిమిషంలోనే మరొక వ్యక్తికి సోకుతుందని డాక్ట‌ర్ గులేరియా పేర్కొన్నారు. కరోనా కేసులు పెరుగుతున్నందున రిపోర్టు రావ‌డానికి చాలా రోజులు ఆలస్యం అవుతుందని గులేరియా పేర్కొన్నారు. ఇలాంటి సందర్భంగా క్లినికో-రేడియోలాజికల్, సీటీ స్కాన్ చేసి కరోనా లక్షణాలను గుర్తిస్తే.. వైద్యులు వెంటనే చికిత్స ప్రారంభించాల‌ని సూచించారు.

ఈ ల‌క్ష‌ణాలు క‌నిపిస్తే.. కరోనానే.. వాస‌న లేకనపోవడం, జ్వ‌రం, చ‌లిగా ఉండ‌టం, ఆయాసంగా ఉండ‌టం, నీరసంగా ఉండ‌టం, గొంతులో నొప్పి, క‌డుపులో నొప్పి, ఎసిడిటీ, గ్యాస్ స‌మ‌స్య వంటి ల‌క్ష‌ణాలు ఏవీ క‌నిపించినా క‌రోనాగా భావించి చికిత్స తీసుకోవాల‌ని డాక్ట‌ర్ గులేరియా సూచించారు. అయితే.. ఇబ్బందిక‌రంగా ఉన్న‌ప్పుడే మాత్రమే ఆసుపత్రులకు రావాల‌ని గులేరియా సూచించారు.

Also Read:

Covid Vaccine: రెండ్రోజుల్లో అతిపెద్ద వ్యాక్సిన్ వార్.. డిమాండ్‌కు అనుగుణంగా పంపిణీ సాధ్యమేనా?

మే 2 తర్వాత కరోనాపై కేంద్రం కఠిన నిర్ణయం తీసుకునే అవకాశం

కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!