AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మే 2 తర్వాత కరోనాపై కేంద్రం కఠిన నిర్ణయం తీసుకునే అవకాశం

ఇప్పుడు దేశ ప్రజల దృష్టంతా మే 2 తేదీపైన ఉంది.. ఆ రోజు దేశ భవిష్యత్తు ఎలా ఉండబోతున్నదో ఇదమిత్థంగా తెలిసే రోజు కాబట్టే అంత ఆసక్తి.. అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో పాటు, దేశంలో వివిధ ప్రాంతాలలో జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు వచ్చే రోజు అదే!

మే 2 తర్వాత కరోనాపై కేంద్రం కఠిన నిర్ణయం తీసుకునే అవకాశం
Central Govt Impose Complete Lock Down From May 2nd
Balu
| Edited By: Phani CH|

Updated on: Apr 28, 2021 | 2:12 PM

Share

ఇప్పుడు దేశ ప్రజల దృష్టంతా మే 2 తేదీపైన ఉంది.. ఆ రోజు దేశ భవిష్యత్తు ఎలా ఉండబోతున్నదో ఇదమిత్థంగా తెలిసే రోజు కాబట్టే అంత ఆసక్తి.. అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో పాటు, దేశంలో వివిధ ప్రాంతాలలో జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు వచ్చే రోజు అదే! ముఖ్యంగా బెంగాల్‌ అసెంబ్లీ ఫలితాలపై ఎడతెగని ఉత్కంఠ. అక్కడ భారతీయ జనతా పార్టీ పాగా వేస్తుందా? వేస్తే దేశంలో మిగతా చోట్ల దాని పర్యవసానాలు ఎలా ఉంటాయన్నది ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. ఈ ఎన్నికల ఫలితాలతో పాటే దేశంలో విజృంభిస్తున్న కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి ఆ రోజున కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నదోనన్న ఆతృత. ఎందుకంటే ఎన్నికల ఫలితాల తర్వాతే కరోనాపై కేంద్రం ఓ నిర్ణయం తీసుకోవచ్చన్నది ఇన్‌సైడ్‌ టాక్‌! రోజుకు మూడు లక్షలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. దానికి తోడు మరణాల సంఖ్య కూడా అంతే తీవ్రస్థాయిలో ఉంటున్నది. హాస్పిటల్స్‌లో బెడ్స్‌ దొరకడం లేదు.. అవసరానికి ఆక్సిజన్‌ అందుబాటులో ఉండటం లేదు. ఎక్కడ చూసినా మరణరోదనలే వినిపిస్తున్నాయి. అంత్యక్రియలకు కూడా అవస్థలు పడాల్సిన దిక్కమాలిన రోజులు వచ్చాయి.. ఇంత జరుగుతున్నా కేంద్ర ప్రభుత్వం కరోనాను అరికట్టడానికి పటిష్టమైన చర్యలు తీసుకోవడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హెల్త్‌ ఎమర్జెన్సీ విధించే అవకాశం ఉన్నప్పటికీ ప్రభుత్వం ఆ ఊసే ఎత్తడం లేదు. కేంద్రం కఠిన నిర్ణయం తీసుకోకపోవడానికి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలేనని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.

కరోనా సెకండ్‌వేవ్‌ తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్న వేళ అటు కేంద్రం కానీ, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు కానీ అప్రమత్తం కాలేదు. ఆరంభంలోనే కొన్ని కఠిన చర్యలు తీసుకుని ఉంటే పరిస్థితి ఇంత వరకు వచ్చేది కాదన్నది మెజారిటీ ప్రజల అభిమతం. ఎన్నికలు కరోనా వ్యాప్తికి కారణమన్నది నిర్వివాదాంశం. మద్రాస్‌ హైకోర్టు కూడా ఇదే మాట చెప్పింది. కరోనా విజృంభణకు ఎన్నికలే కారణమని న్యాయస్థానం విమర్శించింది. సభలు సమావేశాలతో కరోనా అడ్డూ అదుపూ లేకుండా విస్తరించింది. ఇది వాస్తవం.. ఇదే వాస్తవం. తెలంగాణ ముఖ్యమంత్రికి కరోనా సోకడానికి కూడా ఎన్నికల సభనే కారణం. బెంగాల్‌, కేరళ, తమిళనాడు, అసోంలలో కేసులు పెరగడానికి కారణం ఎన్నికలే! బెంగాల్‌లో ఇంకో దశ ఎన్నికలు జరగాల్సి ఉంది. అది కూడా పూర్తయ్యాక కేంద్రం ఓ నిర్ణయానికి రావచ్చు. కేంద్ర ప్రభుత్వ వర్గాలు కూడా ఇదే మాట చెబుతున్నాయి. అసెంబ్లీ ఫలితాలను బేరీజు వేసుకున్న తర్వాతే కేంద్రం ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మళ్లీ లాక్‌డౌన్‌ విధించాలా? లేక కఠిన ఆంక్షలు అమలు చేస్తే సరిపోతుందా? అన్నది అప్పుడు తేలుతుంది. అందుకే దేశ ప్రజలు మే 2వ తేదీ కోసం ఎదురుచూస్తున్నారు.

మరిన్ని ఇక్కడ చూడండి: మే 1 నుంచి 18 ఏళ్లు దాటిన యువతకు టీకా..! ఇవాటి నుంచి కోవిన్ యాప్‌లో రిజిస్ట్రేషన్.. ఎలాగో తెలుసుకోండి..

ఏసీలు ఆఫ్ చేసి… కిటికీలు, తలుపులు తెరిస్తే కరోనాను కట్టడి చేయవచ్చా ? .. అధ్యాయనాల్లో బయటపడిన ఆసక్తికర విషయాలు..