AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రైతులకు గుడ్ న్యూస్..! సబ్సిడీపై 10 హెచ్‌పి సోలార్ పంపు మోటార్.. ఎలా దరఖాస్తు చేసుకోవాలో తెలుసా..?

PM-Kusum Scheme :రాబోయే కాలంలో సౌర నీటి పంపు వినియోగం పెరుగుతుంది. దీంతో సోలార్ వాటర్ పంపులను తయారుచేసే సంస్థలు కూడా మార్కెట్లోకి

రైతులకు గుడ్ న్యూస్..! సబ్సిడీపై 10 హెచ్‌పి సోలార్ పంపు మోటార్.. ఎలా దరఖాస్తు చేసుకోవాలో తెలుసా..?
Solar Power
uppula Raju
|

Updated on: Apr 28, 2021 | 3:40 PM

Share

PM-Kusum Scheme :రాబోయే కాలంలో సౌర నీటి పంపు వినియోగం పెరుగుతుంది. దీంతో సోలార్ వాటర్ పంపులను తయారుచేసే సంస్థలు కూడా మార్కెట్లోకి ప్రవేశిస్తాయి. దీనికి రెండు ప్రధాన కారణాలున్నాయి. మొదట, పెరుగుతున్న డీజిల్ ధరలు ప్రజలను ప్రత్యామ్నాయ మార్గాల వైపు వెళ్లేలా చేస్తున్నాయి. అందుకోసం సౌర పంపు మంచి సాధనం ఎందుకంటే అందులో చమురు వినియోగం లేదు. రెండోది సౌర నీటి పంపుకు కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోంది. పీఎం-కుసుం పథకంలో భాగంగా ప్రచారం చేస్తోంది.

ఈ దృష్ట్యా రాబోయే కాలంలో సౌర నీటి పంపు వ్యాపారం బాగా పెరుగుతుంది. సౌర శక్తి విషయంలో భారతదేశం ప్రపంచంలోనే అత్యంత అనువైనదిగా గుర్తింపు పొందింది. దీంతో రైతులు సోలార్ ప్యానల్‌తో మోటారును నడపడం ద్వారా పొలాలకు నీరందించవచ్చు. చాలా కంపెనీలు ఈ సాంకేతిక పరిజ్ఞానంలోకి వచ్చాయి.దీంతో మార్కెట్లో పోటీ కనిపిస్తోంది రాబోయే కాలంలో సోలార్ పంపుల ధరలు బాగా పడిపోవడాన్ని మనం చూడవచ్చు.

కిర్లోస్కర్ సంస్థ సోలార్ ప్యానెల్ వాటర్ పంపులను తయారు చేస్తోంది. ఇందులో సౌర ఫలకం ఉంటుంది. దానిపై పడిన సూర్యకాంతి DC గా మార్చబడుతుంది. ఆ DC పంపును నడపడానికి కావలసిన AC శక్తిగా మారుతుంది. కిర్లోస్కర్ సంస్థ 1 హెచ్‌పి నుంచి 100 హెచ్‌పి వరకు పంపులను తయారు చేస్తోంది. రైతు తన బోర్ బావి ప్రకారం పంపును ఎన్నుకోవాలని కంపెనీ సలహా ఇస్తోంది. పంపు నుంచి ఎంత దూరం నీరు తీసుకోవాలి దాని గురించి కూడా జాగ్రత్త అవసరం.

సోలార్ ప్యానల్‌తో సహా మోటారు పూర్తి వ్యవస్థను సంస్థ అందిస్తుంది. ఖర్చు గురించి మాట్లాడుతూ.. కిర్లోస్కర్‌లో 1 హెచ్‌పి పంప్ ధర రూ.1.5 లక్షల వరకు ఉంది. సోలార్ ప్యానెల్, మోటారు, పంప్ సంస్థాపన మొదలైన వాటికి పూర్తి ఖర్చు ఇందులోనే ఉంటుంది. 3 హెచ్‌పీ పంపు ధర రూ .2.50 లక్షలు. అదే 2 హెచ్‌పి పంపు ధర రూ .1.80 లక్షలు. 10 హెచ్‌పి సోలార్ వాటర్ పంప్ ధర 6 లక్షల రూపాయలుగా నిర్ణయించారు.

ఈ మొత్తం రైతులకు పెద్ద అమౌంట్ కనుక వారికి సహాయం చేయడానికి ప్రభుత్వం సబ్సిడీ ఇస్తోంది. సోలార్ మోటారుపై సబ్సిడీ పొందడానికి రైతులు మొదటగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. చాలామంది ప్రజలు నమోదు చేసుకుంటారు కనుక ప్రతి ఒక్కరికి సబ్సిడీ లభించదని గుర్తుంచుకోవాలి. 10 లక్షల మంది ఫారమ్‌ను నింపితే ప్రభుత్వం10 వేలకు మాత్రమే సబ్సిడీ ఇస్తుంది.

ప్రధాన మంత్రి కిసాన్ ఎనర్జీ సెక్యూరిటీ అండ్ అప్లిఫ్మెంట్ మహాబియాన్ అంటే పిఎం-కుసుమ్ యోజన కింద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సౌర పంపుపై రాయితీ ఇస్తున్నాయి. ఈ పథకాన్ని 2019 ఫిబ్రవరిలో ప్రారంభించారు. ఇందుకోసం ప్రభుత్వం టెండర్లు తీసుకుంటుంది. 2019 లో ఈ పథకం కింద మొత్తం దేశంలో 50 వేల సోలార్ వాటర్ పంపులను ఏర్పాటు చేశారు. దీని లక్ష్యాన్ని 2020-21లో 1 లక్షగా నిర్ణయించారు. వచ్చే ఏడాది వరకు సంవత్సరంలో 4 లక్షల సోలార్ పంపులను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

Kidney disease: ఊర్లకు ఊర్లనే మింగేస్తున్న మహమ్మారి.. ఏ ఇంటిని కదిలించిన రక్తకన్నీరే.. 13 మండలాలను వణికిస్తున్న భూతం..!

Covid-19: కరోనా నిమిషంలోనే వ్యాపిస్తుంది.. రిపోర్టు నెగిటివ్ వచ్చినా.. ఏమాత్రం అశ్రద్ధ వద్దు: గులేరియా