Covid Tablets: కరోనా వ్యాక్సిన్‌కు బదులు టాబ్లెట్​.. ప్రయోగాలు ప్రారంభం.. ఎప్పుడు మార్కెట్లోకి వస్తుందంటే..

Covid Tablets: దేశంలో కరోనా సెకండ్‌వేవ్‌ తీవ్ర స్థాయిలో వ్యాప్తి చెందుతోంది. జనాలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. కరోనా అంటేనే గజగజ వణికిపోతున్నారు. దేశం..

Covid Tablets: కరోనా వ్యాక్సిన్‌కు బదులు టాబ్లెట్​.. ప్రయోగాలు ప్రారంభం.. ఎప్పుడు మార్కెట్లోకి వస్తుందంటే..
Covid Tablets
Follow us

|

Updated on: Apr 28, 2021 | 2:30 PM

Covid Tablets: దేశంలో కరోనా సెకండ్‌వేవ్‌ తీవ్ర స్థాయిలో వ్యాప్తి చెందుతోంది. జనాలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. కరోనా అంటేనే గజగజ వణికిపోతున్నారు. దేశంలో ప్రతి రోజు లక్షల్లో పాజిటివ్‌ కేసులు, వేలల్లో మరణాలు నమోదు అవుతున్నాయి. ఈ నేపథ్యంలో కరోనా కట్టడికి ఏకైక మార్గం వ్యాక్సిన్‌. ప్రస్తుతం దేశంలో కరోనా వ్యాక్సినేషన్‌ వేగంగా కొనసాగుతోంది. అయితే మన దేశంలో ప్రస్తుతం కోవాగ్జిన్‌, కోవిషీల్డ్‌ రెండు వ్యాక్సిన్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఈ రెండింటి ఉత్పత్తి సామర్థ్యం తక్కువ ఉండటం వల్ల వ్యాక్సినేషన్‌ ప్రక్రియ నెమ్మదిస్తోంది. దీంతో విదేశీ వ్యాక్సిన్లను దిగుమతి చేసుకోవాలని కేంద్రం నిర్ణయించింది. అయితే ప్రస్తుతం దేశ వ్యాప్తంగా అన్ని రకాల కోవిడ్ వ్యాక్సిన్లు ఇంజెక్షన్ రూపంలోనే అందుబాటులో ఉన్నాయి. అతి త్వరలోనే దీన్ని ట్యాబ్లెట్ల రూపంలో అందుబాటులోకి తెస్తామని అమెరికాకు చెందిన ఫార్మా దిగ్గజం ఫైజర్ ప్రకటించింది. ఇందుకు సంబంధించిన మొదటి పిల్​ను మనుషులపై పరీక్షించేందుకు సిద్ధమవుతోంది.

ఫైజర్‌ సంస్థ ఈ ప్రయోగాలను అమెరికా, బెల్జియంలోని తన ఫార్మా ల్యాబ్‌లలో ప్రారంభించింది. అమెరికాలో మొదటిసారిగా కరోనా టీకాను అందుబాటులోకి తెచ్చింది ఫైజర్​ సంస్థ. అన్ని ట్రయల్​ టెస్ట్​లలో ఈ టీకా సామర్థ్యం నిరూపితమైనందున వ్యాక్సిన్ వినియోగానికి అనుమతులు లభించాయి. అటువంటి సంస్థ ఇప్పడు కోవిడ్​ హోమ్​ క్యూర్​ పిల్స్​ రూపొందించే పనిలో పడింది. కరోనా రోగి లక్షణాలను అభివృద్ధి చేసినప్పుడు ఈ పిల్స్​ను తీసుకుంటే యాంటీవైరల్​గా పనిచేసి శరీరంలో వైరస్​ను నిర్మూలిస్తుందని ఫైజర్ సంస్థ చెబుతోంది. ఇది యాంటీవైరల్ ట్రీట్​మెంట్​గా పనిచేస్తుందని, కరోనా వైరస్ కట్టడికి పిల్​ రూపొందించడం ఇదే ప్రథమం అని ఫైజర్​ పేర్కొంది.

కాగా, ఫైబర్​ పిల్స్ ప్రస్తుతం టెస్టింగ్ దశలోనే ఉన్నాయి. వీటిని 18 నుంచి 60 సంవత్సరాల మధ్య వయసు ఉన్న 60 మంది ఆరోగ్యవంతులపై ప్రయోగిస్తున్నారు. ఈ ప్రక్రియను మూడు దశలుగా విభజించారు. ఈ టెస్టింగ్​ ప్రక్రియ 145 రోజుల పాటు కొనసాగనుంది. దీని తర్వాత “స్క్రీనింగ్, డోసింగ్” కోసం మరో మరో 28 రోజులు సమయం పట్టనుంది. మొదటి దశలో పిల్​ ఇచ్చి దాని సైడ్​ ఎఫెక్ట్స్​ను అంచనా వేస్తారు. అంతేకాక ఈ పిల్​ తీసుకున్న వారి శరీరంలో ఎటువంటి మార్పులు వచ్చాయి.. ఏమైన సమస్యలు తలెత్తుతాయా..? అనే విషయంపై అధ్యయనం చేస్తారు. ఇక రెండో దశ సరిగ్గా మొదటి దశ మాదిరిగానే ఉంటుంది. కాకపోతే దీంట్లో రెండు డోసులు అందించి పరీక్షిస్తారు. మూడో దశ టాబ్లెట్‌ ద్రవ రూపంలో ఇచ్చి పరీక్షలు నిర్వహిస్తారు.

ఇప్పటి వరకు ఈ పిల్‌ను మనుషులపై ప్రయోగించలేదు. ప్రస్తుతానికి దీనిని జంతువులపై ప్రయోగం చేస్తున్నట్లు వెల్లడించింది. ఈ పరీక్ష విజయవంతమైతే త్వరలో మనుషులపై ప్రయోగించనున్నారు. ఈ యాంటీ వైరల్ పిల్​పై కరోనా ప్రారంభం నుంచి ప్రయోగాలు చేస్తున్నామని, ఈ పిల్​ 2021 చివరి నాటికి అందుబాటులోకి వస్తుందని ఫైజర్​ మెడికల్​ కెమిస్ట్రీ డైరెక్టర్ డాఫిడ్ ఓవెన్ వెల్లడించారు.

ఇవీ చదవండి:

Covid-19: ఆ మందులతో కరోనా మరింత తీవ్రం.. అలాంటి రోగులందరూ జాగ్రత్తగా ఉండాల్సిందే.. ఐసీఎంఆర్ హెచ్చరిక

విశాఖలో విషాదం.. కరోనాతో ఏడాదిన్నర చిన్నారి మృతి.. ఆస్పత్రిలో లక్షకుపైగా ఖర్చు.. వేరే ఆస్పత్రిలో అడ్మిషన్‌ ఇచ్చేలోగా..