AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Assam Earthquake: అస్సాంలో భారీ నష్టాన్ని మిగిల్చిన భూకంపం.. ఇంటిపై ఒరిగిన మరో ఇల్లు.. షాకింగ్ వీడియో..

Earthquake in Assam: ఈశాన్య భారతదేశంలో బుధవారం ఉదయం భారీ భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. అస్సాంలోని గౌహతితోపాటు.. పలు ఈశాన్య రాష్ట్రాల్లో

Assam Earthquake: అస్సాంలో భారీ నష్టాన్ని మిగిల్చిన భూకంపం.. ఇంటిపై ఒరిగిన మరో ఇల్లు.. షాకింగ్ వీడియో..
Earthquake In Assam
Shaik Madar Saheb
|

Updated on: Apr 28, 2021 | 12:02 PM

Share

Earthquake in Assam: ఈశాన్య భారతదేశంలో బుధవారం ఉదయం భారీ భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. అస్సాంలోని గౌహతితోపాటు.. పలు ఈశాన్య రాష్ట్రాల్లో బుధవారం ఉదయం భారీ భూప్రకంపనలు రావడంతో.. తీవ్ర నష్టం వాటిల్లింది. ఈ భూకంప ధాటికి ఇళ్లు, రోడ్లు ధ్వంసమయ్యాయి. ఉదయం 7.51 గంటలకు సోనిత్‌పూర్‌లో భూమి కంపించింది. రిక్టర్‌స్కేలుపై దీని తీవ్రత 6.4గా నమోదయ్యింది. ఈ భూకంప తీవ్రతతో నగౌన్‌లోని పక్కపక్కనే ఉన్న రెండు బిల్డింగ్‌లు కదిలాయి. ఒక ఇల్లు మరో ఇంటిపైకి ఒరిగిపోయింది. దీంతోపాటు వందలాది ఇళ్లు, గొడలు దెబ్బతిన్నాయి. రోడ్లు కూడా ధ్వంసమయ్యాయి. అయితే భూప్రకంపనలు ప్రారంభంకాగానే ఇళ్లలోని జనాలు బయటకు పరుగులు తీశారు. వెంటవెంటనే మూడు సార్లు ప్రకంపనలు రావడంతో భయంతో వణికిపోయారు.

అస్సాంతోపాటు ఉత్తర బెంగాల్‌లోనూ ప్రకంపనలు వచ్చాయి. కూచ్‌ బెహార్‌, మాల్దా, జల్పాయిగురి, సిలిగురి, ముర్షిదాబాద్‌ తదితర ప్రాంతాల్లో కూడా భూమి కంపించింది. భూపంక కేంద్రాన్ని తేజ్‌పూర్‌కు పశ్చిమ నైరుతి దిశలో 43 కిలోమీటర్ల దూరంలో గుర్తించినట్లు సెంటర్‌ ఫర్‌ సీస్మోలజీ తెలిపింది. దీనిపై అస్సాం ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్ మాట్లాడుతూ.. అస్సాంలో పెద్దస్థాయిలో భూకంపం వచ్చిందని.. అందరి శ్రేయస్సు కోసం ప్రార్థిస్తున్నానంటూ తెలిపారు. ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.

ప్రకంపనల అనంతరం ప్రధానమంత్రి నరేంద్రమోదీ, హోంమంత్రి అమిత్ షా అస్సాం ముఖ్యమంత్రితో మాట్లాడారు. కేంద్రం నుంచి సాయం అందించడానికి సిద్దంగా ఉన్నామంటూ భరోసానిచ్చారు.

Also Read:

Assam Earthquake: అస్సాంలో భారీ భూకంపం.. మూడుసార్లు ప్రకంపనలు.. వణికిపోయిన ఈశాన్య ప్రజలు