Assam Earthquake: అస్సాంలో భారీ భూకంపం.. మూడుసార్లు ప్రకంపనలు.. వణికిపోయిన ఈశాన్య ప్రజలు

Earthquake in Assam: ఈశాన్య భారతదేశాన్ని భూకంపం తీవ్రంగా వణికించింది. అస్సాంలోని గౌహతితోపాటు.. పలు ఈశాన్య రాష్ట్రాల్లో బుధవారం

Assam Earthquake: అస్సాంలో భారీ భూకంపం.. మూడుసార్లు ప్రకంపనలు.. వణికిపోయిన ఈశాన్య ప్రజలు
Eearthquake
Follow us

|

Updated on: Apr 28, 2021 | 9:35 AM

Earthquake in Assam: ఈశాన్య భారతదేశాన్ని భూకంపం తీవ్రంగా వణికించింది. అస్సాంలోని గౌహతితోపాటు.. పలు ఈశాన్య రాష్ట్రాల్లో బుధవారం ఉదయం భారీ భూకంపం సంభవించింది. ఆ తర్వాత మరో రెండు సార్లు భూ ప్రకంపనలు సంభవించాయి. ఉదయం 7.51 గంటల ప్రాంతంలో సోనిత్‌పూర్‌లో రిక్టర్‌ స్కేల్‌పై 6.4 తీవ్రతతో భూ ప్రకంపనలు సంభవించాయని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సీస్మోలజీ తెలిపింది. ఆ తర్వాత 8.13 గంటలకు.. 08.34 గంటలకు మూడోసారి సైతం ప్రకంపనలు వచ్చాయని వెల్లడించింది. అయితే భూకంపంతో ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు ఇప్పటి వరకు ఎలాంటి నివేదికలు అందలేదని అధికారులు వెల్లడించారు. వరుసగా మూడుసార్లు ప్రకంపనలు రావడంతో స్థానికులు భయాందోళనతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.

అస్సాంతోపాటు ఉత్తర బెంగాల్‌లోనూ ప్రకంపనలు వచ్చాయి. కూచ్‌ బెహార్‌, మాల్దా, జల్పాయిగురి, సిలిగురి, ముర్షిదాబాద్‌ తదితర ప్రాంతాల్లో భూమి కంపించింది. భూపంక కేంద్రాన్ని తేజ్‌పూర్‌కు పశ్చిమ నైరుతి దిశలో 43 కిలోమీటర్ల దూరంలో గుర్తించినట్లు సెంటర్‌ ఫర్‌ సీస్మోలజీ తెలిపింది. భారీగా వచ్చిన ప్రకంపనలతో భవనాలు, గొడలు సైతం దెబ్బతిన్నాయి.

అనంతరం అస్సాం ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్ మాట్లాడారు. అస్సాంలో పెద్దస్థాయిలో భూకంపం వచ్చిందని.. అందరి శ్రేయస్సు కోసం ప్రార్థిస్తున్నానంటూ తెలిపారు. ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. దీనికి సంబంధించి అన్ని జిల్లాల నుంచి నివేదికలు తీసుకుంటున్నామని.. జాగ్రత్తగా ఉండాలని సర్బానంద సోనోవాల్ సూచించారు.

Also Read:

Covid-19 Drugs: చిక్కుల్లో గౌతం గంభీర్.. కోవిడ్-19 డ్రగ్స్‌ పంచేందుకు లైసెన్స్ ఉందా.. ఢిల్లీ హైకోర్టు ప్రశ్నలు

Medical Oxygen crisis: దేశవ్యాప్తంగా వేధిస్తున్న ఆక్సిజన్ కొరత.. సవాల్‌గా మారిన ప్రాణ వాయువు సరఫరా

ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ