Medical Oxygen crisis: దేశవ్యాప్తంగా వేధిస్తున్న ఆక్సిజన్ కొరత.. సవాల్‌గా మారిన ప్రాణ వాయువు సరఫరా

ఆక్సిజన్‌.. నిండుగా ఉన్నా... నిండుకుంటోంది.. ఏ ఆసుపత్రికి వెళ్లినా ప్రాణవాయువు దొరకడం లేదు. ఎక్కడికి వెళ్లినా ఖాళీ సిలెండర్లే కనిపిస్తున్నాయి. ఊపిరాడని పేషెంట్లు ఆక్సిజన్‌ కోసం వెంపర్లాడుతున్నారు.

Medical Oxygen crisis: దేశవ్యాప్తంగా వేధిస్తున్న ఆక్సిజన్ కొరత.. సవాల్‌గా మారిన ప్రాణ వాయువు సరఫరా
Medical Oxygen Crisis In India

Oxygen crisis in India: ఆక్సిజన్‌.. నిండుగా ఉన్నా… నిండుకుంటోంది.. ఏ ఆసుపత్రికి వెళ్లినా ప్రాణవాయువు దొరకడం లేదు. ఎక్కడికి వెళ్లినా ఖాళీ సిలెండర్లే కనిపిస్తున్నాయి. ఊపిరాడని పేషెంట్లు ఆక్సిజన్‌ కోసం వెంపర్లాడుతున్నారు. అడిగినంత డబ్బు ఇస్తామని, ఎలాగైనా ఆక్సిజన్‌ సిలిండర్లు సమకూర్చాలని డీలర్లను బతిమిలాడుతున్నారు. సరిపడా ఆక్సిజన్ లేక డాక్టర్లు చేతులు ఎత్తేస్తున్నారు. ఎప్పుడేం జరుగుతుందో అని కరోనా బాధితులు టెన్షన్‌ పడుతున్నారు..ఇందులో భాగంగానే ఆక్సిజన్‌ తయారీ పరిశ్రమలు, ఉత్పత్తిపై కేంద్ర కేబినెట్‌ ఏం చర్చించబోతుంది. ఈ కష్ట్రాన్ని గట్టెక్కించే క్విక్‌ యాక్షన్‌ ప్లాన్‌ ఎలా ఉండబోతుందనేదీ ఆసక్తికరంగా మారింది.

కరోనా వైరస్ సెకండ్ వేవ్ వ్యాప్తి కారణంగా దేశం.. కనీవినీ ఎరుగని సంక్షోభ సమయాన్ని ఎదుర్కొంటోంది. ప్రాణవాయువు అందక..ఎన్నో ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. అనేక రాష్ట్రాల్లో ఆరోగ్య వ్యవస్థ వెంటిలేటర్‌ మీద ఉంది. కరోనా విలయ తాండవం చేస్తున్న ఈ ఎమర్జెన్సీ సమయంలో..అందరి లక్ష్యం ఒక్కటే, కరోనా రోగులను కాపాడటం.. దేశంలో ఎన్నడూ లేనివిధంగా ఆక్సిజన్ ట్యాంకర్ల కోసం రాష్ట్రాలు పోటీపడుతున్నాయి. దేశవ్యాప్తంగా ఆక్సిజన్‌ కొరత తీవ్రంగా వేదిస్తోంది..అనేక మరణాలకు ఇదే కారణంగా నిలుస్తోంది..దీంతో ఆక్సిజన్​ కొరతపై దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. ఆక్సిజన్​ కొరతపై ఆలస్యంగా మేల్కొన్న ప్రభుత్వం కొరత తీర్చేందుకు చర్యలు ముమ్మరం చేసింది..

అయితే, ప్రభుత్వం ఇన్ని చర్యలు తీసుకుంటున్నా, వాస్తవంలో మాత్రం అది కనిపించడం లేదు. చాలా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆక్సిజన్​ కొరత వేధిస్తోంది దేశంలోని వివిధ ఆసుపత్రుల్లో ఆక్సిజన్ లభించకపోవడం వల్ల మరణిస్తున్న రోగుల సంఖ్య కూడా పెరుగుతోంది.. అయితే అన్ని రాష్ట్రాలకు పుష్కలంగా ఆక్సిజన్‌ను పంపించేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టింది. మరికొన్ని రోజులు ‘ఆక్సిజన్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్ల’ను నడపనున్నట్లు రైల్వేశాఖ వెల్లడించింది. రోజుకు 7,500 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ ఉత్పత్తి అవుతుండగా, అందులో 6,600 మెట్రిక్‌ టన్నులను వివిధ రాష్ట్రాల ఆరోగ్య అవసరాల కోసం కేటాయించినట్టు వెల్లడించింది. మరోవైపు విదేశాల నుంచి 50వేల మెట్రిక్‌ టన్నుల మెడికల్‌ ఆక్సిజన్‌ దిగుమతి చేసుకునేందుకు కేంద్రం సన్నాహాలు మొదలుపెట్టింది..

కరోనా ఫస్ట్‌వేవ్​గత సంవత్సరం ఫిబ్రవరిలో ప్రారంభమైంది. సగటున 1,000 నుండి -1,200 మెట్రిక్ టన్నుల మెడికల్ గ్రేడ్ ఆక్సిజన్ అవసరం ఏర్పడింది. ఈ కొరతను దేశంలోని స్థానిక ఆక్సిజన్​ ప్లాంట్ల ద్వారా తీర్చగలిగారు. అయితే, 2020 ఏప్రిల్ నాటికి, కరోనా కేసులు పెరగడం ప్రారంభించాయి, కాని ఇప్పటికీ ఆక్సిజన్ డిమాండ్ 1,500MT స్థాయిని దాటలేదు. అయితే, సెప్టెంబర్ నాటికి, కరోనా కేసులు తగ్గడం ప్రారంభించాయి. దీంతో ఆక్సిజన్ డిమాండ్ భారీగా తగ్గిపోయింది. దీంతో అప్పుడు ఆక్సిజన్​కొరత ఏర్పడలేదు.

కరోనా వైరస్ సెకండ్​వేవ్​ఇంతలా విజృంభిస్తుందని ప్రభుత్వాలు, పాలకులు ఊహించలేదు. దీంతో అనేక రాష్ట్రాల్లో స్థానిక ఎన్నికలు నిర్వహించారు. కరోనా అంతమైందనే భావనలో ప్రభుత్వాలు, ప్రజలు కరోనా మార్గదర్శకాలను పట్టించుకోలేదు. దీని పర్యవసానాలు ఇప్పుడు అనుభవవించాల్సి వస్తోంది..

వైద్య అవసరాలకు పారిశ్రామిక ఉపయోగం కోసం ఉపయోగించే లిక్విడ్ ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేసే కోల్‌కతాకు చెందిన లిండే ఇండియా, ముంబైకి చెందిన ఐనాక్స్ ఎయిర్ వంటి ప్రత్యేక తయారీదారులే కాకుండా, ఉక్కు పరిశ్రమ, చమురు శుద్ధి కర్మాగారాలు తమ ఫ్లాంట్ల ద్వారా ఆక్సిజన్ ఉత్పత్తి చేస్తూ గణనీయంగా దోహదం చేస్తున్నాయి. అయితే, ఆక్సిజన్ సరఫరా చేయడానికి తగినంత ట్యాంకర్లు లేవు. చాలా ఫ్లాంట్లు తూర్పు భారతదేశంలో ఉన్నాయి. పశ్చిమాన ఒక ఆక్సిజన్ ఫ్లాంట్ కూడా లేదు. తగినంత ఆక్సిజన్ లభ్యత ఉన్నప్పటికీ, రవాణా ఒక పెద్ద సవాలుగా మిగిలిపోయింది. ఇక, ఏ సమయంలోనైనా 3,500-4,000 మెట్రిక్ టన్నుల డిమాండ్‌ను తీర్చడానికి 200 ట్యాంకర్లు మాత్రమే రవాణాలో ఉన్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు.

అదే సమయంలో, సంక్షోభాన్ని పరిష్కరించడానికి కేంద్ర ప్రభుత్వం అనేక ఇతర చర్యలను తీసుకుంటోంది. ఏ పరిశ్రమలోనైనా లిక్విడ్ ఆక్సిజన్ వాడకాన్ని అనుమతించవద్దని ఆదేశించింది. ఔషధ, రక్షణను మినహాయించి మరే ఇతర పరిశ్రమలు వినియోగంచకూడదని పేర్కొంది. ఆక్సిజన్ తీసుకువెళ్లే వాహనాలపై లొకేషన్ ట్రాకింగ్ పరికరాలను ఏర్పాటు చేయాలని సూచించింది. ఆక్సిజన్ అత్యవసరమైన రాష్ట్రాలకు వెంటనే అందించేందుకు ఆక్సిజన్ వనరులను మ్యాపింగ్ చేస్తుంది.

Read Also…  కొత్త గైడ్ లెన్స్, వ్యాక్సిన్లు తీసుకున్న అమెరికన్లు మాస్కులు ధరించవలసిన అవసరం లేదట !