AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Covid-19: ఆ మందులతో కరోనా మరింత తీవ్రం.. అలాంటి రోగులందరూ జాగ్రత్తగా ఉండాల్సిందే.. ఐసీఎంఆర్ హెచ్చరిక

Painkillers Drugs - Coronavirus: దేశంలో కరోనా సెకండ్‌ వేవ్‌ విస్తృతంగా వ్యాప్తి చెందుతోంది. నిత్యం లక్షలాది కేసులు, వేలాది మరణాలు సంభవిస్తున్నాయి. ఈ క్రమంలో ఆరోగ్య పరిస్థితి మరింతగా దిగజారి ఆసుపత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య క్రమంగా

Covid-19: ఆ మందులతో కరోనా మరింత తీవ్రం.. అలాంటి రోగులందరూ జాగ్రత్తగా ఉండాల్సిందే.. ఐసీఎంఆర్ హెచ్చరిక
Medicine Tablets
Shaik Madar Saheb
|

Updated on: Apr 28, 2021 | 8:17 AM

Share

Painkillers Drugs – Coronavirus: దేశంలో కరోనా సెకండ్‌ వేవ్‌ విస్తృతంగా వ్యాప్తి చెందుతోంది. నిత్యం లక్షలాది కేసులు, వేలాది మరణాలు సంభవిస్తున్నాయి. ఈ క్రమంలో ఆరోగ్య పరిస్థితి మరింతగా దిగజారి ఆసుపత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఆసుపత్రుల్లో బెడ్లు లేక రోగులు నిరీక్షిస్తున్నారు. ఒకవేళ ఆసుపత్రుల్లో బెడ్లు దొరికినా.. ఆక్సిజన్ కొరత వేధిస్తోంది. ఈ నేపథ్యంలో చాలా మంది సొంత వైద్యానికే మొగ్గు చూపుతున్నారు. సోషల్‌ మీడియా, ప్రసార మాధ్యమాల్లో వచ్చే ప్రకటనలు చూసి యథేచ్ఛగా మెడికల్‌ షాపుల్లో మందులు కొనుగోలు చేసి వినియోగిస్తున్నారు. కరోనా భయంతో ఇష్టానుసారంగా మందులు తీసుకుంటున్నారు. ఇలాంటి మందులు ఏ మాత్రం మంచిది కాదని, అవసరం లేని మందులు వేసుకుంటే అనారోగ్యం బారిన పడే అవకాశం మరింత ఉందని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. భవిష్యత్‌లో సైడ్‌ ఎఫెక్ట్స్‌ వచ్చే అవకాశంతో కరోనా ప్రమాదం మరింత తీవ్రమవుతుందని పేర్కొంటున్నారు. వైద్యుల ప్రిస్క్రిప్షన్‌ లేకుండానే పెయిన్ కిల్లర్స్, యాంటిబయాటిక్స్‌తో పాటు ఇతర మందులు విక్రయించి వేసుకోవడం వల్ల ఇంకా కరోనా ప్రమాదం పెరుగుతుందని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) హెచ్చరించింది. ఈ మేరకు ప్రకటనను విడుదల చేసింది.

ఐబూప్రొఫెన్‌ వంటి నొప్పి తగ్గించే మాత్రలు (పెయిన్‌కిల్లర్స్‌) కరోనాను మరింత తీవ్రం చేస్తాయని ఐసీఎంఆర్‌ హెచ్చరించింది. ఇటువంటి పెయిన్‌కిల్లర్స్‌ వేసుకోవడం గుండె, రక్తపోటు సమస్య ఉన్న బాధితులకు మరింత ప్రమాదకరమని, మూత్రపిండాలను దెబ్బతీసే ముప్పు ఉంటుందని గతంలోనూ వైద్య నిపుణులు హెచ్చిరించిన సంగతి తెలిసిందే. కరోనా రోగులు నాన్‌-స్టెరాయిడల్‌, యాంటీ-ఇన్‌ఫ్లేమేటరీ మందులను (ఎన్‌ఎస్‌ఏఐడీలు) వాడొద్దని, అవసరమైతే పారాసిటమాల్‌ వేసుకోవాలంటూ ఐసీఎంఆర్ సూచించింది.

డయాబెటిస్ ఉన్న రోగులు జాగ్రత్తగా ఉండాలని.. వారికి కరోనా ఇన్ఫెక్షన్లు సోకే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని పేర్కొంది. అయితే ఒకసారి వ్యాధి సోకితే ప్రమాద తీవ్రత పెరుగుతుందని.. కావున మంచి ఆహారం తీసుకుంటూ జాగ్రత్తగా ఉండాలని సూచించింది. దీంతోపాటు మాస్కును వాడాలని.. చేతులను శుభ్రంగా కడుక్కోవాలని.. భౌతిక దూరం పాటించాలని ఐసీఎంఆర్ కోరింది.

Also Read:

Hospital Fire: థానేలోని ప్రైవేట్ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం.. నలుగురు రోగుల సజీవ దహనం.. పలువురికి తీవ్ర గాయాలు

మహారాష్ట్రలో మళ్ళీ పెరిగిన కోవిడ్ కేసులు, ముంబై, థానే నగరాల్లోనూ అదే విలయం