Covid-19: రెమిడెసివిర్ ఇప్పించండి.. సీఎంఓ కాళ్లపై పడ్డ మహిళలు.. హెచ్చరించిన అధికారులు.. వీడియో..

Covid-19 patients families: దేశంలో కరోనా విలయతాండవం చేస్తోంది. దేశవ్యాప్తంగా నిత్యం కేసులు, మరణాలు భారీగా నమోదవుతున్నాయి. దీంతో పెద్దసంఖ్యలో

Covid-19: రెమిడెసివిర్ ఇప్పించండి.. సీఎంఓ కాళ్లపై పడ్డ మహిళలు.. హెచ్చరించిన అధికారులు.. వీడియో..
Covid 19 Patients Families
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Apr 28, 2021 | 11:34 AM

Covid-19 patients families: దేశంలో కరోనా విలయతాండవం చేస్తోంది. దేశవ్యాప్తంగా నిత్యం కేసులు, మరణాలు భారీగా నమోదవుతున్నాయి. దీంతో పెద్దసంఖ్యలో కరోనా బాధితులు ఆసుపత్రులకు పరుగులు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో కరోనా బాధితులకు అత్యవసర చికిత్సలో ఇచ్చే రెమిడెసివిర్‌ ఇంజెక్షన్‌కు తీవ్రంగా కొరత ఏర్పడింది. దీంతోపాటు ఆక్సిజన్ లభించక వందలాది మంది రోగులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ క్రమంలో.. కరోనా సోకి ఆపదలో ఉన్న తమవాళ్లకు రెమిడెసివిర్‌ ఇంజెక్షన్‌ ఇప్పించాలని వారి కుటుంబ సభ్యులు వైద్యులను వేడుకుంటున్నారు. అంతేకాకుండా బ్లాక్ మార్కెట్‌లో సైతం ఔషధాన్ని కొనుగోలు చేసి తమ వాళ్లను బతికించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్‌లోని నోయిడా పట్టణంలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ.. ప్రాణాపాయ స్థితిలో ఉన్న తమవారికి ఈ రెమిడెసివిర్ వైరల్‌ ఇంజెక్షన్‌ ఇప్పించాలని ఓ కుటుంబం చీఫ్‌ మెడికల్‌ ఆఫీసర్‌ (సీఎంవో) దీపక్‌ ఓహ్రీ కాళ్లపై పడి వేడుకుంది. తమవాళ్లు ప్రాణాపాయంలో ఉన్నారని.. ఎలాగైనా బతికించాలంటూ సీఎంవో ఎదుట ఆ కుటుంబం వేడుకుంది. ఈ హృదయ విదారక వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

వీడియో..

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో ముగ్గురు మహిళలు సీఎంవోకు దండం పెడుతూ రెమిడెసివిర్ ఇజక్షన్ ఇప్పించాలని కోరుతున్నారు. అంతేకాకుండా కాళ్లు పట్టుకోని ప్రాధేయపడ్డారు. అనంతరం ఓ మహిళ మీడియాతో మాట్లాడుతూ.. తాము రెమిడెసివిర్ ఇంజెక్షన్ కోసం ఇక్కడకు వచ్చామమని.. కానీ అందుబాటులో ఉన్నప్పుడు ఇస్తామని అధికారులు తెలిపారని పేర్కొంది. మళ్లీ నేను ఇక్కడకు వస్తానని అనగానే.. ఈ సారి వస్తే జైలుకు పంపుతామని అధికారులు హెచ్చరించారని మహిల పేర్కొంది. దీనికి సంబంధించి అధికారుల నుంచి వివరణ రావాల్సి ఉంది.

Also Read:

India Coronavirus: కరోనా అల్లకల్లోలం.. రికార్డు స్థాయిలో కేసులు, మరణాలు.. మొదటిసారిగా 3 వేల మార్క్ దాటిన మృతుల సంఖ్య

Happy Birthday Samantha: పెళ్లి తర్వాత కూడా తగ్గని అక్కినేని కోడలు హావా… బర్త్ డే గర్ల్ బ్యూటిఫుల్ పిక్స్..