బీటలు వారిన గోడలు, రెండుగా చీలిపోయిన రోడ్లు, అస్సాం, బెంగాల్ రాష్ట్రాల్లో భూకంప విలయం

అస్సాం, బెంగాల్ రాష్ట్రాల్లో బుధవారం  సంభవించిన భూకంపంలో ప్రాణ నష్టం జరగకపోయినా.. ఆస్థి నష్టం  భారీగా  సంభవించింది.రిక్టర్ స్కేలుపై  దీని  తీవ్రత   6.4 గా నమోదయింది. ముఖ్యంగా అస్సాంలోని సోనిత్ పూర్ జిల్లాలో ఉదయం 7.50 గంటల  ప్రాంతంలో   భూప్రకంపనలు మొదలయ్యాయి.

బీటలు వారిన గోడలు, రెండుగా చీలిపోయిన రోడ్లు,  అస్సాం, బెంగాల్ రాష్ట్రాల్లో భూకంప విలయం
Earhquake In Assam

అస్సాం, బెంగాల్ రాష్ట్రాల్లో బుధవారం  సంభవించిన భూకంపంలో ప్రాణ నష్టం జరగకపోయినా.. ఆస్థి నష్టం  భారీగా  సంభవించింది.రిక్టర్ స్కేలుపై  దీని  తీవ్రత   6.4 గా నమోదయింది. ముఖ్యంగా అస్సాంలోని సోనిత్ పూర్ జిల్లాలో ఉదయం 7.50 గంటల  ప్రాంతంలో   భూప్రకంపనలు మొదలయ్యాయి. అదే సమయంలో మేఘాలయ లోను,   బెంగాల్ లోని కొన్ని ప్రాంతాలలోను దీని ప్రభావం కనిపించింది. అస్సాంలో   చోట్ల ఇళ్లు, భవనాలు  దెబ్బ  తిన్నాయి.రోడ్లు రెండుగా చీలిపోయాయి. అయితే ఎవరూ గాయపడలేదని అధికారులు తెలిపారు. ఈ  రాష్ట్రం లోని భైరవ్ మండ్ హిల్స్ లో భూకంప ప్రభావం తీవ్రంగా  ఉంది. ధికన్ జౌళి లోని నారాయణ్ పూర్ ప్రాంతంలో భూకంప కేంద్రం నమోదయింది.  ఇక్కడ ఒక్కసారిగా నీరు నేలపై నుంచి పైకి  వచ్చింది. ఈ భూకంపం కారణంగా అస్సాంలో సంభవించిన నష్టం తాలూకు  ఫోటోలు, వీడియోలు  సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఈ భూకంప సమాచారం తెలిసిన వెంటనే ప్రధాని  మోదీ  అస్సాం   సీఎంకి ఫోన్  చేసి కేంద్రం నుంచి ఎలాంటి సాయం అవసరమైనా చేస్తామని హామీ ఇఛ్చారు. అటు గౌహతి లో    ఫైవ్ స్టార్ హోటల్,   మరి కొన్ని భవనాలు దెబ్బతిన్నాయి. నాగౌన్, తేజ్ పూర్ జిల్లాల్లో కూడా ఇదే పరిస్థితి కనిపించింది. హోమ్ మంత్రి అమిత్ షా కూడా సీఎం సర్బానంద సోనోవాల్ తో ఫోన్ లో మాట్లాడి తాజా పరిస్థితి గురించి తెలుసుకున్నారు.  మేఘాలయ లో సైతం భూకంప  ప్రభావం కనిపించింది. ఈ రాష్ట్రంలోనూ పలు చోట్ల ఇళ్ల గోడలు బీటలు వారినట్టు అధికారులు తెలిపారు. షిలాంగ్ లో భవనాలు కొన్ని దెబ్బ తిన్నాయి.

 

మరిన్ని ఇక్కడ చూడండి: ఆకస్మాత్తుగా నీరసంగా, అలసటగా ఉంటున్నారా ? అయితే నిర్లక్ష్యం చేయకండి.. కోవిడ్ లక్షణాలు కూడా కావచ్చు ?

Assam Earthquake: అస్సాంలో భారీ నష్టాన్ని మిగిల్చిన భూకంపం.. ఇంటిపై ఒరిగిన మరో ఇల్లు.. షాకింగ్ వీడియో..

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Telugu