High Court: తెలంగాణ హైకోర్టు వెబ్‌సైట్ హ్యాక్!
తెలంగాణలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. రాష్ట్ర హైకోర్టు వెబ్‌సైట్ హ్యాకింగ్‌కు గురైంది. కోర్టు వెబ్‌సైట్ నుంచి ఆర్డర్ కాపీలు డౌన్‌లోడ్ చేస్తుండగా అంతరాయం ఏర్పడింది. అదే సమయంలో హైకోర్టు వెబ్‌సైట్‌లో బెట్టింగ్ సైట్ ప్రత్యక్షమైంది. ఇది చూసిన అధికారులు షాక్ అయ్యారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. హైకోర్టు రిజిస్ట్రార్ ఫిర్యాదుతో ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

తెలంగాణ హైకోర్టు వెబ్సైటు మొత్తాన్ని బిఆర్కే భవన్ లో ఉన్న నేషనల్ ఇన్ఫర్మేటివ్ సెంటర్ నడిపిస్తుంది. NIC ద్వారానే తెలంగాణ హైకోర్టు వెబ్సైట్ కార్యకలాపాలు చూసుకుంటుంది. ఈ తరుణంలో కాస్ లిస్టు తో పాటు ఆర్డర్ కాపీలు సంబంధిత డాక్యుమెంట్లను పిడిఎఫ్ ఫార్మాట్లో వెబ్సైట్లో అప్లోడ్ చేస్తారు. ఇలా అప్లోడ్ చేసిన ఫైల్స్ ను డౌన్లోడ్ చేసే క్రమంలో కొంతమంది యూజర్లకు పిడిఎఫ్ ఫైల్ కు బదులుగా ఆన్లైన్ బెట్టింగ్ సైట్ ఓపెన్ అయింది.
దీని గమనించిన యూజర్లు వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. ప్రతిష్టాత్మకంగా ఉండే హైకోర్టు వెబ్సైటును ఎవరో హ్యాక్ చేసినట్లు ఐటి రిజిస్టర్ గుర్తించారు. వెంటనే NIC సర్వర్ ప్రతినిధులకు ఈ విషయాన్ని చేరవేశారు. వారు సైతం దీనిపై విచారణ చేపడుతున్నారు. మరోవైపు జరిగిన ఉదాంతం పై తెలంగాణ రాష్ట్ర డిజిపి కి హైకోర్టు ఐటి రిజిస్టర్ ఫిర్యాదు చేశారు. డిజిపి సిఫార్సుతో హైదరాబాద్ ఛాబర్ క్రైమ్ పోలీసులు దీనిమీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తెలంగాణ హైకోర్టు వెబ్సైటును న్యాయవాదులతో పాటు అనేకమంది ప్రజలు సైతం దీనిని ఉపయోగిస్తుంటారు. వారి కేసులకు సంబంధించిన విషయాలు ఆర్డర్ కాపీలు డౌన్లోడ్ చేసుకోవడానికి తెలంగాణ హైకోర్టు వెబ్సైట్ TSHC కి వెళ్లి ఫైల్స్ డౌన్లోడ్ చేస్తుంటారు. ఈ క్రమంలో నే ఆన్లైన్ బెట్టింగ్ సైట్ ప్రత్యక్షమవడంతో అవాకైనా యూజర్లు అధికారులను అలర్ట్ చేశారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




