Vaccination: ఇకపై వారంలో ఐదు రోజులు మాత్రమే వ్యాక్సిన్.. తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ నిర్ణయం.

Vaccination: ఇకపై వారంలో ఐదు రోజులు మాత్రమే వ్యాక్సిన్.. తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ నిర్ణయం.
Vaccination Telangana

Vaccination: కరోనాను అడ్డుకునేందుకు ప్రస్తుతం మనదగ్గర ఉన్న ఏకైక అస్త్రం వ్యాక్సినేషన్‌. కరోనా వ్యాప్తిని అడ్డుకోవడంలో వ్యాక్సిన్‌ ముఖ్యపాత్ర పోషిస్తోంది. ఇప్పటి వరకు నమోదవుతోన్న గణంకాలు కూడా ఇదే విషయాన్ని చెబుతున్నాయి. ఇక కరోనా...

Narender Vaitla

|

Jul 06, 2021 | 9:17 PM

Vaccination: కరోనాను అడ్డుకునేందుకు ప్రస్తుతం మనదగ్గర ఉన్న ఏకైక అస్త్రం వ్యాక్సినేషన్‌. కరోనా వ్యాప్తిని అడ్డుకోవడంలో వ్యాక్సిన్‌ ముఖ్యపాత్ర పోషిస్తోంది. ఇప్పటి వరకు నమోదవుతోన్న గణంకాలు కూడా ఇదే విషయాన్ని చెబుతున్నాయి. ఇక కరోనా థార్డ్‌ వేవ్‌ పొంచి ఉందని ప్రచారం జరుగుతోన్న వేళ వ్యాక్సినేషన్‌ ప్రక్రియను మరింత వేగవంతం చేయాల్సిన అవసరం ఉంది. అయితే తెలంగాణ ప్రభుత్వం మాత్రం దీనికి వ్యతిరేకంగా వ్యహరిస్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో ఇకపై వారానికి ఐదు రోజులు మాత్రమే వ్యాక్సిన్‌ ఇవ్వాలని తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ నిర్ణయించింది. రాష్ట్రంలో బుధ, ఆదివారాల్లో కరోనా వ్యాక్సినేషన్‌ ఉండబోదని అధికారులు ప్రకటించారు.

వ్యాక్సినేషన్‌ ప్రక్రియను మరింత వేగవంతం చేయాల్సిన ఇలాంటి సమయంలో వేగాన్ని తగ్గించడం పట్ల అందిరలోనూ ఆందోళనలు నెలకొంటున్నాయి. తెలంగాణలో ఇంకా సుమారు కోటిన్నరకు పైగా వ్యాక్సిన్‌ ఇవ్వాల్సి ఉండగా.. రెండు రోజులు వ్యాక్సిన్‌ ప్రక్రియను ఆపేయడం వల్ల అందరికీ వ్యాక్సిన్‌ వేయాలంటే ఇంకా ఎన్ని రోజులు పడుతుందన్న దానిపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇదిలా ఉంటే రాష్ట్రంలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ చాలా నెమ్మదిగా సాగుతోంది. ప్రస్తుతం రోజుకు 2 లక్షల మందికి మాత్రమే వ్యాక్సిన్ వేస్తున్నారు. 18 ఏళ్లు దాటినవాళ్లు రెండు లక్షలకు పైగా ఉన్నారు. ఇందులో 31శాతం వరకు సింగిల్ డోసు వ్యాక్సిన్ మత్రమే తీసుకున్నారు. 6 శాతం మందికి మాత్రమే రెండు డోసుల వ్యాక్సినేషన్ పూర్తయింది. మొత్తంగా 38 శాతం మంది వ్యాక్సిన్ తీసుకోగా, కనీసం ఒక్క డోసు కూడా అందనివాళ్లు 62 శాతం మంది ఉన్నారు. అర్బన్ ఏరియాల్లో కొంత స్పీడ్‌‌గా వ్యాక్సినేషన్ జరుగుతుండగా, గ్రామీణ జిల్లాల్లో చాలా తక్కువగా జరుగుతోంది. ఇక తాజాగా వారంలో రెండు రోజులు కరోనా వాక్సినేషన్ నిలిపివేస్తున్నట్టు చెబుతుండడం పట్ల వ్యతిరేకత వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో మరోసారి కరోనా కేసులు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్రంలోని ఆరు, ఏడు జిల్లాల్లో కేసుల సంఖ్య పెరుగుతోంది. హాస్పిటళ్లకు వచ్చే పేషెంట్ల సంఖ్య కూడా పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోందని డాక్టర్లు చెబుతున్నారు.

ఎలెందర్‌

టీవీ9 తెలుగు రిపోర్టర్,  హైదరాబాద్. 

Also Read: భర్త బర్త్ డే రోజున ఫన్నీ వీడియోతో విషెస్ చెప్పిన స్టార్ హీరోయిన్.. వైరల్ అవుతున్న వీడియో..

TGWDCW Recruitment 2021: పదవ తరగతి పాసై.. వివాహమైన మహిళలకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్

TS High Court: ఫీజు చెల్లించలేదని ఆన్‌లైన్‌ తరగతులను ఆపుతారా.? హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూల్‌ను ప్రశ్నించిన హైకోర్టు.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu