భర్త బర్త్ డే రోజున ఫన్నీ వీడియోతో విషెస్ చెప్పిన స్టార్ హీరోయిన్.. వైరల్ అవుతున్న వీడియో..

భర్త బర్త్ డే రోజున ఫన్నీ వీడియోతో విషెస్ చెప్పిన స్టార్ హీరోయిన్.. వైరల్ అవుతున్న వీడియో..
Ranveer Singh Deepika Paduk

బాలీవుడ్ స్టార్ కపుల్ రణవీర్ సింగ్ దీపికా పదుకునే గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ జంట ఎప్పుడు అక్కడ హాట్ టాపికే....

Rajeev Rayala

|

Jul 06, 2021 | 7:44 PM

ranveer singh deepika padukone: బాలీవుడ్ స్టార్ కపుల్ రణవీర్ సింగ్ -దీపికా పదుకునే గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ జంట ఎప్పుడు అక్కడ హాట్ టాపికే.. ఈ ఇద్దరూ ఏం చేసిన అది సంచలనమే. డిఫరెంట్ లుక్స్ తో రణవీర్ ఫొటో షూట్స్ చేస్తూ ఆకట్టుకుంటుంటే.. ఆయన సతీమణి దీపికా భర్త ఫోటోలను ఫన్నీ వీడియోలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. నేడు రణవీర్ సింగ్ పుట్టిన రోజు సందర్భంగా దీపికా పోస్ట్ చేసిన ఓ వీడియో నెట్టింట నవ్వులు పూయిస్తుంది.భర్త రణవీర్ తో కలిసి ఈ వీడియోలో డాన్స్ చేస్తూ కనిపించింది దీపికా. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ సాంగ్ కు ఈ ఇద్దరు డాన్స్ చేస్తూ ఆకట్టుకున్నారు.

“త్వడా కుత్తా టామీ మరియు సడ్డా కుత్తా కుత్తా” అనే పాటకు దీపికా రణవీర్ డ్యాన్స్ చేస్తూ కనిపించరు. దీనితోపాటు రణవీర్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు కూడా తెలిపారు దీపికా. ” హ్యాపీ బర్త్ డే మై ఫేవరేట్ పర్సన్ అంటూ భర్త కు బర్త్ డే విషెస్ తెలిపింది ఈ స్టార్ హీరోయిన్.  హిందీ బిగ్ బాస్ 13 లో పాల్గొన్న షెహ్నాజ్ గిల్ అనే కంటెస్టెంట్ “క్యా కరుమ్  మైనే  మార్ జామ్… తడ్వా కుత్తా టామీ. సడ్డా కుత్తా కుత్తా ” అనే డైలాగ్ చెప్పడంతో ఒక్క సారిగా పాపులర్ అయ్యింది. ఆతర్వాత అది పాట రూపంలో మార్చి తెగ ట్రోల్స్ చేశారు నెటిజన్లు. అలా పాపులర్ అయిన ఈ పాటకు ఈ స్టార్ కపుల్ డాన్స్ చేయడం ఇప్పుడు అందరిని ఆకట్టుకుంటుంది.

మరిన్ని ఇక్కడ చదవండి :

Tamannaah New Photos : మిల్క్ బ్యూటీ తమన్నా భాటియా లేటెస్ట్ గ్లామరస్ ఫొటోస్.. వరుస సినిమాలలో బిజీగా అమ్మడు..

Kajal Aggarwal : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమాలో చందమామ కాజల్.. ఏ మూవీ కోసమంటే

కరణ్ డైరెక్షన్లో మరో అందమైన ప్రేమ కథ.. రణవీర్ అలియా జంటగా రానున్న సినిమా..

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu