Taapsee Pannu: తెలుగులో చాలా కాలం తర్వాత తిరిగి సినిమా చేస్తున్న బ్యూటీ..

ఝుమ్మంది నాదం సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది ముద్దుగుమ్మ  తాప్సీ. ఆతర్వాత తెలుగులో వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోయింది ఈ చిన్నది.

Taapsee Pannu: తెలుగులో చాలా కాలం తర్వాత తిరిగి సినిమా చేస్తున్న బ్యూటీ..
Taapsee Pannu
Follow us
Rajeev Rayala

|

Updated on: Jul 06, 2021 | 8:41 PM

Taapsee Pannu: ఝుమ్మంది నాదం సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది ముద్దుగుమ్మ  తాప్సీ. ఆతర్వాత తెలుగులో వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోయింది ఈ చిన్నది. తెలుగులో స్టార్ హీరోలతో జతకట్టిన తాప్సీ… ఆ తరువాత వరుసగా కొన్ని సినిమాలు  ఫ్లాప్ కావడంతో.. ఈ అమ్మడికి ఇక్కడ అవకాశాలు తగ్గుతూ వచ్చాయి. ఆ తర్వాత బాలీవుడ్ లో అడుగు పెట్టింది. అక్కడ వరుస అవకాశాలను అందుకుంటూ స్టార్ హీరోయిన్స్ ను సైతం వెనక్కినెట్టేస్తుంది. లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో తాప్సీ మంచి గుర్తిపు తెచ్చుకుంది. చివరగా ‘గేమ్ ఓవర్’ అనే హిందీ తెలుగు బైలింగ్విల్ లో కనిపించిన తాప్సీ.. మళ్ళీ టాలీవుడ్ కి రావడానికి మంచి స్టోరీ కోసం ఎదురుచూసింది. ఇక ఇప్పుడు తాప్సీ తెలుగులో ఒక సినిమా చేస్తోంది .. దాని పేరే ‘మిషన్ ఇంపాజిబుల్. ‘ఏజెంట్ సాయిశ్రీనివాస ఆత్రేయ’ సినిమాతో ప్రేక్షకులను నాన్ స్టాప్ గా నవ్వించిన, స్వరూప్ ఈ సినిమాకి దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు.

మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిరంజన్ రెడ్డి – అన్వేష్ రెడ్డి లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో తాప్సీ ప్రధాన పాత్ర పోషిస్తోంది. ఈ సినిమా లేడీ ఓరియెంటెడ్ అని సమాచారం. తెలుగులోకి తిరిగి రావడానికి ఇదే సరైన స్క్రిప్ట్ అని భావించిన ఈ బ్యూటీ.. తాజాగా షూటింగ్ లో జాయిన్ అయ్యారు.సినిమాకు సంబంధించిన వర్కింగ్ పోస్టర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ఈ పోస్టర్ లో  తాప్సీ చేతికి కట్టుకట్టుకొని లాప్ టాప్ ముందు కూర్చొని ఏదో ఆతృతగా చూస్తూ ఉంది. ఈ సినిమా తిరుపతికి దగ్గరలోని ఓ గ్రామంలో జరిగే హంటింగ్ ఫిల్మ్ అని తెలుస్తోంది.

మరిన్ని ఇక్కడ చదవండి : భర్త బర్త్ డే రోజున ఫన్నీ వీడియోతో విషెస్ చెప్పిన స్టార్ హీరోయిన్.. వైరల్ అవుతున్న వీడియో..

Tamannaah New Photos : మిల్క్ బ్యూటీ తమన్నా భాటియా లేటెస్ట్ గ్లామరస్ ఫొటోస్.. వరుస సినిమాలలో బిజీగా అమ్మడు..

Kajal Aggarwal : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమాలో చందమామ కాజల్.. ఏ మూవీ కోసమంటే

పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..