Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Actress Saranya: ఘనంగా జరిగిన నటి శరణ్య పెద్దకూతురు ప్రియదర్శిని రిసెప్షన్ వేడుక .. హాజరైన సీఎం స్టాలిన్ దంపతులు

Actress Saranya: దర్శకుడు ఎ.బి.రాజ్ కుమార్తె అయిన శరణ్య హీరోయిన్ గా మణిరత్నం దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా తెరకెక్కిన నాయుకుడు తో ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాతోనే నటిగా ఆకట్టుకుంది...

Actress Saranya: ఘనంగా జరిగిన నటి శరణ్య పెద్దకూతురు ప్రియదర్శిని రిసెప్షన్ వేడుక .. హాజరైన సీఎం స్టాలిన్ దంపతులు
Saranya Daughter
Follow us
Surya Kala

|

Updated on: Jul 07, 2021 | 4:13 PM

Actress Saranya: దర్శకుడు ఎ.బి.రాజ్ కుమార్తె అయిన శరణ్య హీరోయిన్ గా మణిరత్నం దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా తెరకెక్కిన నాయుకుడు తో ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాతోనే నటిగా ఆకట్టుకుంది. తెలుగు లో నీరాజనం సినిమాతో అడుగు పెట్టింది. అనంతరం సాహసం సినిమాలో మాత్రమే హీరోయిన్ గా నటించింది శరణ్య. పెళ్లి తర్వాత గ్యాప్ తీసుకున్న కెరీర్‌లో సెకండ్ ఇన్నింగ్స్‌లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా మంచి పాత్రల్లో నటిస్తూ ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. రాఖీ, జగడం, రెడీ, వేదం, కొమరం పులి, మనం, బ్రహ్మోత్సవం వంటి అనేక సినిమాల్లో మంచి పాత్రల్లో నటించింది శరణ్య. చివరగా నాని సినిమా ‘గ్యాంగ్ లీడర్‌’లో కనిపించింది. కాగా,శరణ్య తమిళ క్యారెక్టర్ ఆర్టిస్ట్, డైరెక్టర్‌ పొన్‌వణ్ణన్‌ను రెండో వివాహం 1995లో చేసుకున్నారు. ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలు. ప్రియదర్శిని, చాందిని. . తాజాగా పెద్ద కుమార్తె వివాహం ఘనంగా జరిగింది. చెన్నైలో ప్రియదర్శిని వివాహ రిసెప్షన్త వేడుకక్కి తమిళనాడు సీఎం స్టాలిన్ దీనికి హాజరయ్యారు. నూతన దంపతులను ఆశీర్వదించారు.

వివాహానంతరం చెన్నైలోని మనప్పాక్కమ్‌లో జరిగిన రిసెప్షన్ వేడుకక్కి సీఎం స్టాలిన్‌ దంపతులు. ఉదయనిధి స్టాలిన్‌, ఎంపీ కనిమోళి తదితరులు హాజరయ్యారు. నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపి, వారిని ఆశీర్వదించారు. స్టాలిన్ నూతన దంపతులకు మొక్కలతో కూడిన గ్రీన్ బాస్కెట్లను గిఫ్ట్ గా ఇచ్చారు.. ఈ వేడుకక్కి నటి దేవదర్శినితో పాటు, శరణ్యతో గ్యాంగ్ లీడర్‌లో నటించిన హీరోయిన్ ప్రియాంక అరుళ్‌మోహన్ కూడా హాజరయ్యారు.

.

Also Read: పవన్ కళ్యాణ్ కూతురు ఆద్య చేసిన ఐస్ క్రీమ్ కోసం ఎదురు చూస్తున్నా అంటూ అడవి శేషు ఆసక్తికరమైన కోరిక