Kajal Aggarwal : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమాలో చందమామ కాజల్.. ఏ మూవీ కోసమంటే

టాలీవుడ్ లో టాప్ హీరోయిన్స్ లో అందాల చందమామ కాజల్ అగర్వాల్ ఒకరు. ఈ ముద్దుగుమ్మ పెళ్లిపీటలెక్కిన తర్వాత నుంచి ఆచి తూచి సినిమాలను ఎంచుకుంటుంది.

Kajal Aggarwal : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమాలో చందమామ కాజల్.. ఏ మూవీ కోసమంటే
Kajal
Follow us

|

Updated on: Jul 06, 2021 | 7:09 PM

Kajal Aggarwal : టాలీవుడ్ లో టాప్ హీరోయిన్స్ లో అందాల చందమామ కాజల్ అగర్వాల్ ఒకరు. ఈ ముద్దుగుమ్మ పెళ్లిపీటలెక్కిన తర్వాత నుంచి ఆచి తూచి సినిమాలను ఎంచుకుంటుంది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ మెగాస్టార్ చిరంజీవి సరసన ఆచార్య సినిమా చేస్తుంది. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మరో హీరోగా రామ్ చరణ్ నటిస్తున్నారు. ఈ సినిమా తర్వాత కాజల్ శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ నటిస్తున్న ఇండియన్ 2 సినిమాలో చేస్తుంది. వీటితో పాటు బాలీవుడ్ లో ఉమా అనే లేడీ ఓరియెంటెడ్ సినిమా కూడా చేస్తుంది. ఇలా వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉన్న కాజల్ ఇప్పుడు మరో  స్టార్ హీరో సినిమాలో నటిస్తుందని తెలుస్తుంది.

అయితే ఈ అమ్మడు మరోసారి స్పెషల్ సాంగ్ లో మెరవబోతుందని తెలుస్తుంది. గతంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన జనతా గ్యారేజ్ సినిమాలో స్పెషల్ సాంగ్ లో ఆకట్టుకుంది కాజల్. పక్కలోకల్ అంటూ ప్రేక్షకులను పిచ్చేక్కించింది ఈ ముద్దుగుమ్మ. ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ చేయబోతోందని తెలుస్తుంది. ప్రభాస్ ప్రస్తుతం వరుసగా భారీ బడ్జెట్ సినిమాలు చేస్తున్నాడు. వాటిలో ప్రశాంత్ నీల్ డైరెక్షన్ చేస్తున్న సలార్ సినిమా ఒకటి. ఈ సినిమాలో హీరోయిన్ గా శ్రుతిహాసన్ నటిస్తుంది. భువన్‌గౌడతో రవి బస్రూర్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి :

Singer Sunitha: మధురమైన గాత్రం.. చూడచక్కని రూపం.. వైరల్ అవుతున్న సింగర్ సునీత పోస్ట్..

Pawan Kalyan : పవన్ కాన్వాయ్ ను ఛేజ్ చేసిన ఫ్యాన్స్.. ఆ తర్వాత పవర్ స్టార్ట్ ఏం చేశాడో తెలుసా..

Chiranjeevi: ఆచార్య షూటింగ్ రీస్టార్ట్ .. చకచకా షూటింగ్ కంప్లీట్ చేయనున్న మెగాస్టార్..

Ariana Funny Dance Video: పిట్ట కొంచెం.. అందం అమోఘం.. మరి డ్యాన్స్‌ వేస్తేనో..?డాన్స్ వీడియోతో ఆకట్టుకుంటున్న అరియనా.