తెలంగాణ హెడ్ కానిస్టేబుల్‌‌కు అరుదైన గౌరవం.. యాదయ్యకు రాష్ట్రపతి గ్యాలంటరీ పతకం

తెలంగాణకు చెందిన హెడ్ కానిస్టేబుల్ చదువు యాదయ్యకు అరుదైన గౌరవం దక్కింది. అత్యంత ప్రతిష్టాత్మక రాష్ట్రపతి గ్యాలంటరీ పోలీసు పతకాన్ని ఆయన దక్కించుకున్నారు. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర హోం శాఖ వివిధ పోలీసు పతకాలను ప్రకటించింది. మొత్తం 1037 మంది పోలీసులకు పతకాలు ప్రకటించగా..

తెలంగాణ హెడ్ కానిస్టేబుల్‌‌కు అరుదైన గౌరవం.. యాదయ్యకు రాష్ట్రపతి గ్యాలంటరీ పతకం
Chaduvula Yadayya
Follow us
Janardhan Veluru

|

Updated on: Aug 14, 2024 | 5:48 PM

తెలంగాణకు చెందిన హెడ్ కానిస్టేబుల్ చదువు యాదయ్యకు అరుదైన గౌరవం దక్కింది. అత్యంత ప్రతిష్టాత్మక రాష్ట్రపతి గ్యాలంటరీ పోలీసు పతకాన్ని ఆయన దక్కించుకున్నారు. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర హోం శాఖ వివిధ పోలీసు పతకాలను ప్రకటించింది. మొత్తం 1037 మంది పోలీసులకు పతకాలు ప్రకటించగా.. ఇందులో రాష్ట్రపతి గ్యాలంటరీ పతకం అత్యున్నతమైనది. తెలంగాణ పోలీసు శాఖకు చెందిన హెడ్ కానిస్టేబుల్ యాదయ్యను ఈ పతకం వరించడం విశేషం.

2022 సంవత్సరంలో ఓ చోరీ కేసులో తెలంగాణ పోలీసు శాఖలో పనిచేస్తున్న హెడ్ కానిస్టేబుల్ యాదయ్య అత్యంత ధైర్య సాహసాలను ప్రదర్శించారు. ఇద్దరు దుండగులు ఇషాన్ నిరంజన్, రాహుల్‌ను ప్రాణాలకు తెగించి మరీ సాహసోపేతంగా పట్టుకున్నారు. దుండగులు కత్తితో విచక్షణారహితంగా యాదయ్య.. వీరోచితంగా వారితో పోరాడారు. తీవ్ర రక్తస్రావమైనా వారిని పట్టుకున్నారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన యాదయ్య.. 17 రోజుల పాటు ఆస్పత్రిలో చికిత్స అనంతరం కోలుకున్నారు. తన ప్రాణాలను లెక్క చేయకుండా దుండగులతో వీరోచితంగా పోరాడి వారిని పట్టుకున్న యాదయ్య ధైర్యసాహసాలకు గుర్తింపుగా 2024 సంవత్సరానికి ఆయన రాష్ట్రపతి గ్యాలంటరీ పతకానికి ఎంపికయ్యారు.

రాష్ట్రపతి గ్యాలంటరీ పతకానికి ఎంపికైన సందర్భంగా హెడ్ కానిస్టేబుల్ యాదయ్యను తెలంగాణ డీజీపీ జితేందర్ ప్రత్యేకంగా సన్మానించారు. ఒక నేరస్థుణ్ణి పట్టుకునేప్పుడు ఏడుసార్లు కత్తిపోట్లకు గురైనా, రక్తమోడుతున్నా ధైర్యసాహసాలు ప్రదర్శించి రాష్ట్రపతి శౌర్య పురస్కారానికి ఎంపికైన ఏకైక పోలీస్ అధికారిగా నిలిచి తెలంగాణకు గర్వకారణమంటూ కొనియాడారు.

యాదయ్యను అభినందించిన తెలంగాణ డీజీపీ

మరిన్ని తెలంగాణ వార్తలు చదవండి..