Hyderabad – BJP: రాజ్‌భవన్‌లో ఆసక్తికర సన్నివేశం.. ఈటలకు ప్రత్యేక అభినందనలు తెలిపిన గవర్నర్.. !
Hyderabad - BJP: రాజ్ భవన్‌లో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. బీజేపీ నేతలతో కలిసి ఈటల రాజేందర్ రాజ్‌భవన్‌కు వెళ్లారు.
Hyderabad – BJP: రాజ్ భవన్‌లో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. బీజేపీ నేతలతో కలిసి ఈటల రాజేందర్ రాజ్‌భవన్‌కు వెళ్లారు. అయితే, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో గెలిచిన నేపథ్యంలో ఈటల రాజేందర్‌కు గర్నవర్ తమిళిసై శుభాకాంక్షలు తెలిపారు. ఈటలను ప్రత్యేకంగా పిలిచి ఎన్నికల్లో బాగా కష్టపడి గెలిచారని భుజం తట్టి అభినందించారు. ప్రజలకోసం పని చేయాలని సూచించారు. కాగా, గవర్నర్ ప్రశంసలకు స్పందించిన ఈటల రాజేందర్.. హుజూరాబాద్ ప్రజల రుణం తీర్చుకోలేనిదని వ్యాఖ్యానించారు. నియోజకవర్గం ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటానని, వారికి సేవ చేస్తానని అన్నారు.
కాగా, మంగళవారం నాడు రాజ్ భవన్‌లో గవర్నర్ తమిళి సై తో తెలంగాణ బీజేపీ నేతల బృందం భేటీ అయ్యింది. ఈ బృందంలో ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, రఘునందనరావు, రాజాసింగ్, ఇతర ముఖ్య నేతలు డీకే అరుణ, లక్ష్మణ్, గరికపాటి మోహనరావు, విజయరామారావు, పొంగులేటి సుధాకర్ రెడ్డి ఉన్నారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌పై దాడి, పోలీసుల వ్యవహార శైలిపై గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. వానాకాలం పంటలను కొనకుండా రైతులను ప్రభుత్వం ఇబ్బంది పెడుతోందని, దీనిపై తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని గవర్నర్ తమిళిసై ని బీజేపీ బృందం కోరింది.
Also read:
Samantha: బలమైనవారు మన ముందు బలాన్ని చూపించరు.. మై మామ్ సెడ్ అంటున్న సమంత..