LRTS: హైదరాబాద్‎లో మరో కొత్త ప్రాజెక్టు.. లైట్‌ రైల్‌ ట్రాన్సిట్‌ సిస్టమ్‌ ఏర్పాటుకు ప్రతిపాదనలు..!

ప్రజా రవాణా వ్యవస్థను మరింత పటిష్టంగా మర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది.  తెలంగాణ రాజధాని హైదరాబాద్‎లో మరో కొత్త ప్రాజెక్టు లైట్‌ రైల్‌ ట్రాన్సిట్‌ సిస్టమ్‌ (ఎల్‌ఆర్‌టీఎస్‌)ను చేపట్టేందు ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది...

LRTS: హైదరాబాద్‎లో మరో కొత్త ప్రాజెక్టు.. లైట్‌ రైల్‌ ట్రాన్సిట్‌ సిస్టమ్‌ ఏర్పాటుకు ప్రతిపాదనలు..!
Lrts
Follow us
Srinivas Chekkilla

|

Updated on: Nov 16, 2021 | 2:07 PM

ప్రజా రవాణా వ్యవస్థను మరింత పటిష్టంగా మర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది.  తెలంగాణ రాజధాని హైదరాబాద్‎లో మరో కొత్త ప్రాజెక్టు లైట్‌ రైల్‌ ట్రాన్సిట్‌ సిస్టమ్‌ (ఎల్‌ఆర్‌టీఎస్‌)ను చేపట్టేందు ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే భాగ్యనగరంలో మల్టీ మోడల్‌ ట్రాన్స్‌పోర్ట్‌ సిస్టమ్‌ (ఎంఎంటీఎస్‌), హైదరాబాద్‌ మెట్రోరైల్‌ (హెచ్‌ఎంఆర్‌) ఉన్నాయి. వీటికి తోడు లైట్‌ రైల్‌ ట్రాన్సిట్‌ సిస్టమ్‌ ఉంటే ప్రజలకు సౌకర్యంగా ఉంటుందిని సర్కార్ భావిస్తోంది. ఈ ప్రాజెక్టుపై ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయని రాష్ట్ర అధికార వర్గాలు చెబుతున్నాయి. ఈ ప్రాజెక్టును ముందుగా ఎంఎన్‎సీ కంపెనీలు ఉన్న చోట చేపట్టాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది.

హైదరాబాద్‎లో గచ్చిబౌలి, రాయదుర్గం, హైటెక్‌ సిటీ, ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌, కోకాపేట ప్రాంతాల్లో చాలా వరకు బహుళజాతి కంపెనీలు ఉన్నాయి. మరిన్ని కంపెనీలు ఆ ఏరియాలో ఏర్పాటు కాబోతున్నాయి. ఇక్కడ లక్షల మంది ఉద్యోగులు నిత్యం పని చేస్తూ ఉంటారు. భవిష్యత్తులో వీరంతా కార్యాలయాలకు వచ్చి వెళ్లేందుకు ఇబ్బంది లేకుండా ఉండేందుకు మల్టీ మోడల్‌ ట్రాన్స్‌పోర్ట్‌ సిస్టమ్‌ ప్రాజెక్టు చేపట్టాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది. అయితే అతి పెద్ద హౌజింగ్‌ బోర్డుల్లో ఒకటిగా ఉన్న కూకట్‌పల్లి హౌజింగ్ బోర్డు నుంచి కోకాపేట లైట్‌ రైల్‌ ట్రాన్సిట్‌ సిస్టమ్‌ ప్రాజెక్టు చేపడితే ఎలా ఉంటుందని హైదరాబాద్‌ యునిఫైడ్‌ మెట్రోపాలిటన్‌ ట్రాన్‌పోర్ట్‌ అథారిటీ (హెచ్‌యూఎంటీఏ)లు సమగ్ర ప్రాజెక్టు రిపోర్టును తయారు చేస్తున్నట్లు తెలుస్తుంది.

ప్రతిపాదనల ప్రకారం కూకట్‌పల్లి హౌజింగ్ బోర్డు నుంచి కోకాపేట వరకు మొత్తం 24.50 కిలోమీటర్ల మేర లైట్‌ రైల్‌ ట్రాన్సిట్‌ సిస్టమ్‌ ప్రాజెక్టు చేపట్టాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈ మార్గంలో కేపీహెచ్‌బీ, రాయదుర్గం మెట్రోస్టేషన్లు, హైటెక్‌ సిటీ ఎంఎంటీఎస్‌ స్టేషన్‌ అనుసంధానం అవనున్నాయి. నార్సింగి దగ్గర మెట్రో ఫేట్‌ 2 లైన్‌ కూడా అనుసంధానం అయ్యే అకాశం ఉంది.

Read Also.. KCR on MLC Elections: ఎమ్మెల్సీ బరిలో అనుహ్యంగా కొత్త వ్యక్తులు.. అభ్యర్థుల ఎంపికలో తనదైన మార్క్‌ చూపించిన కేసీఆర్