AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana Government: తెలంగాణ ప్రజలకు గుడ్‌న్యూస్.. అందరికీ రూ.1.50 లక్షల వరకు సాయం.. త్వరలో కొత్త పథకం

తెలంగాణలోని ప్రజలకు ప్రభుత్వం శుభవార్త అందించింది. త్వరలో రూ.1.50 లక్షల క్యాష్‌లెస్ ట్రీట్‌మెంట్ రోడ్డు ప్రమాద బాధితులకు అందుబాటులోకి తీసుకురానుంది. ఇందుకోసం ఆరోగ్యశ్రీ ట్రస్టు సన్నాహాలు చేస్తోంది. నెట్‌వర్క్ ఆస్పత్రులతో సంప్రదింపులు జరుపుతోంది. కేంద్ర ప్రభుత్వ పథకంతో కలిపి ఈ స్కీమ్ అమలు చేయనుంది.

Telangana Government: తెలంగాణ ప్రజలకు గుడ్‌న్యూస్.. అందరికీ రూ.1.50 లక్షల వరకు సాయం.. త్వరలో కొత్త పథకం
Telangana
Ashok Bheemanapalli
| Edited By: |

Updated on: Jan 27, 2026 | 9:09 PM

Share

తెలంగాణలోని ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. ప్రజలకు మెరుగైన విద్య సౌకర్యాలు కల్పించేందుకు సిద్దమవుతున్న ప్రభుత్వం.. ఆరోగ్య సేవలను మరింత విస్తరించేందుకు రెడీ అవుతోంది. అందులో భాగంగా రోడ్డు ప్రమాదంలో గాయపడిన రైతులకు లబ్ది చేకూర్చేలా కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో రోడ్డు ప్రమాదాలు నానాటికి పెరుగుతూనే ఉన్నాయి. ఈ ప్రమాదాల్లో వేల మంది గాయాలపాలవుతుండగా.. మరణాలు కూడా ఎక్కువ సంభవిస్తున్నాయి. రోడ్డు ప్రమాదాల్లో క్షతగాత్రులకు వైద్య సహాయం అందించేందుకు రూ.1.50 లక్షల వరకు ఉచిత క్యాష్ లెస్ ట్రీట్‌మెంట్ సౌకర్యం కల్పించనుంది. కేంద్ర ప్రభుత్వ తీసుకొచ్చిన ఈ పథకాన్ని తెలంగాణలోనూ అమలు చేయాలని నిర్ణయించింది.

రూ.1.50 లక్షల వరకు క్యాష్ లెస్ ట్రీట్‌మెంట్

కేంద్ర ప్రభుత్వం రోడ్డు ప్రమాదాల్లో గాయపడినవారి చికిత్సకు సాయం అందించేందుకు రూ.1.50 లక్షల ఉచిత వైద్య చికిత్స పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకం ద్వారా దేశంలో ఎక్కడైనా రోడ్డు ప్రమాదానికి గురై ఆ లిమిట్ వరకు ఉచిత క్యాష్ లెస్ ట్రీట్‌మెంట్ పొందవచ్చు. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్, అస్సాం, చండీఘడ్, పంజాబ్ వంటి రాష్ట్రాల్లో ఈ స్కీమ్ అమలవుతోంది. ఇప్పుడు తెలంగాణలో కూడా ఈ పథకాన్ని ఆరోగ్యశ్రీ ట్రస్టు ద్వారా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం నెట్ వర్క్ ఆస్పత్రులను గుర్తిస్తోంది. ఇప్పటికే ఆరోగ్యశ్రీ పథకంతో కనెక్ట్ అయి ఉన్న నెట్‌వర్క్ ఆస్పత్రుల్లో ఈ స్కీమ్ అమలు చేయనుంది. ప్రస్తుతం 500 ఆస్పత్రులు ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ పరిధిలో ఉన్నాయి. ఆ తర్వాత మిగిలిన హాస్పిటల్స్‌కు కూడా విస్తరించనుంది. దీని ద్వారా ప్రజలు రోడ్డు ప్రమాదానికి గురైనప్పుడు అత్యవసర వైద్య చికిత్స అందుతుంది.  ఆరోగ్య శ్రీ, ఆయుష్మాన్ భారత్ పరిధిలో లేనివారికి కూడా ఈ ట్రీట్‌మెంట్ సౌకర్యం అందిస్తారు.

రవాణాశాఖ చర్చలు

ఈ పథకం అమలు, విధివిధానాలపై ఆరోగ్యశ్రీ ట్రస్టుతో రవాణాశాఖ చర్యలు జరుపుతోంది. ఇప్పటికే పాలీట్రామా సేవలు అందించే ఆస్పత్రుల వివరాలను ఆరోగ్యశ్రీ ట్రస్టు సేకరించింది. ఈ ఆస్పత్రుల్లో కూడా క్యాష్ లెస్ ట్రీట్ మెంట్ సౌకర్యం అందుబాటులోకి రానుంది. ఇది అమల్లోకి వస్తే రోడ్డు ప్రమాద బాధితులకు మెరుగైన వైద్య చికిత్స అందించవచ్చు. మరణాలను కూడా నివారించవచ్చు. అలాగే ప్రజలకు ఆర్ధిక ఇబ్బందుల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఆస్పత్రి ఖర్చులు ప్రజలకు ఆదా అవుతాయి.  ఈ పథకం అమలు కోసం రవాణాశాఖ, ఆరోగ్య శ్రీ ట్రస్టు, పోలీస్ శాఖ కలిసి పని చేయాల్సి ఉంటుంది. ఇక రాష్ట్రంలో ప్రతీ 35 కిలోమీటర్లకు ఒక ట్రమా కేంద్రాన్ని ప్రపంబ్యాంకు నిధులతో అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం ఆరోగ్యశాఖ చేస్తోంది. ఇందుకోసం రూ.వెయ్యి కోట్లు ఖర్చు చేయనుందని తెలుస్తోంది.

Follow Us
రూపాయికి 3 రూపాయలు.. మార్కెట్‌లోకి నయాదందా! నమ్మారంటే ఇక అంతే!
రూపాయికి 3 రూపాయలు.. మార్కెట్‌లోకి నయాదందా! నమ్మారంటే ఇక అంతే!
ఒకప్పుడు నాగ్ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్.. ఇప్పుడు టాప్ హీరో
ఒకప్పుడు నాగ్ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్.. ఇప్పుడు టాప్ హీరో
నేటి మ్యాచ్‌లో ఇద్దరు స్టార్ ప్లేయర్లకు ఛాన్స్
నేటి మ్యాచ్‌లో ఇద్దరు స్టార్ ప్లేయర్లకు ఛాన్స్
అవినీతిలో నెం1 ఆఫీసర్.. నరహరి చిట్టా తెలిస్తే అవాక్కవ్వాల్సిందే
అవినీతిలో నెం1 ఆఫీసర్.. నరహరి చిట్టా తెలిస్తే అవాక్కవ్వాల్సిందే
రైతుల భరోసా విడుదలకు ముహూర్తం ఫిక్స్.. అకౌంట్లోకి అప్పుడే..
రైతుల భరోసా విడుదలకు ముహూర్తం ఫిక్స్.. అకౌంట్లోకి అప్పుడే..
IAF అధికారి భార్యపై అత్యాచారం, బ్లాక్‌మెయిల్‌.. చివరకు మతమార్పిడి
IAF అధికారి భార్యపై అత్యాచారం, బ్లాక్‌మెయిల్‌.. చివరకు మతమార్పిడి
విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. తల్లికి వందనం డబ్బులు పడేది అప్పుడే
విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. తల్లికి వందనం డబ్బులు పడేది అప్పుడే
అత్యంత తక్కవ ధరకే విమాన ప్రయాణం చేయవచ్చు..
అత్యంత తక్కవ ధరకే విమాన ప్రయాణం చేయవచ్చు..
ఐర్లాండ్ పర్యటనలో ఈ నలుగురు కేవలం నీళ్లందించేందుకే.. ఎందుకంటే?
ఐర్లాండ్ పర్యటనలో ఈ నలుగురు కేవలం నీళ్లందించేందుకే.. ఎందుకంటే?
సరదా కోసం వెళ్లి.. అమెరికా విమాన ప్రమాదంలో కర్నూలు వాసి మృతి
సరదా కోసం వెళ్లి.. అమెరికా విమాన ప్రమాదంలో కర్నూలు వాసి మృతి