No Mask Rs1000 Fine: తెలంగాణలో మాస్క్ ధరించకుంటే రూ.1,000 ఫైన్.. కీలక నిర్ణయం తీసుకున్న సర్కార్

తెలంగాణలో కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తోంది. సెకండ్ వేవ్ భయం పరుగులు పెట్టిస్తోంది. కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. అందుకే తెలంగాణ ప్రభుత్వం సీరియస్‌గా రియాక్ట్ అవుతోంది. ఆంక్షల డోస్ పెంచింది. మాస్క్ కచ్చితంగా ఉండాలని

No Mask Rs1000 Fine: తెలంగాణలో మాస్క్ ధరించకుంటే రూ.1,000 ఫైన్.. కీలక నిర్ణయం తీసుకున్న సర్కార్
ప్రతీకాత్మక చిత్రం
Follow us

|

Updated on: Apr 12, 2021 | 1:30 AM

తెలంగాణలో కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తోంది. సెకండ్ వేవ్ భయం పరుగులు పెట్టిస్తోంది. కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. అందుకే తెలంగాణ ప్రభుత్వం సీరియస్‌గా రియాక్ట్ అవుతోంది. ఆంక్షల డోస్ పెంచింది. మాస్క్ కచ్చితంగా ఉండాలని, భౌతిక దూరం పాటించాలని వార్న్ చేస్తోంది. మాస్క్ ధరించకుంటే రూ. 1,000 ఫైన్ వేయాలని ఆదేశించారు. అన్ని జిల్లా కలెక్టర్లకు ఉత్తర్వులను పంపించారు. బహిరంగ ప్రదేశాలు, ప్రయాణాలు, పనిచేసే ప్రాంతాల్లో మాస్క్ తప్పనిసరి చేసింది.

రాష్ట్రంలో మాస్క్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు అధికారులు. మాస్క్‌లు ధరించని షాపుల యజమానులకు కౌన్సెలింగ్‌ ఇస్తున్నారు. మాస్క్‌ ధరించని వారి వివరాలు, ఫొటోలు సేకరిస్తున్నారు. మరోసారి మాస్క్‌లు వేసుకోకుంటే షాపులు సీజ్‌ చేస్తామని హెచ్చరించారు అధికారులు. ఇది గత పది రోజు క్రితం అయితే ఇప్పుడు మరింత నిర్లక్ష్యం కనిపిస్తోంది.

తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతున్న వేళ, ప్రజలు అశ్రద్ధ చూపుతుంటే, పోలీసులు కఠిన చర్యలకు ఉపక్రమిస్తున్నారు. మాస్క్ ధరించాలని, భౌతిక దూరం పాటిస్తేనే మహమ్మరాని అడ్డుకోగలమని ఇప్పటికే వారం రోజుల పాటు ప్రచారం చేసిన హైదరాబాద్ పోలీసులు, ఇప్పుడిక మాస్క ధరించకుండా కనిపిస్తే, రూ. 1000 జరిమానాగా విధిస్తున్నారు. నిత్యమూ ఒక్కో పోలీసు స్టేషన్ పరిధిలో రెండు వేర్వేరు ప్రాంతాల్లో స్పెషల్ డ్రైవ్ లు నిర్వహిస్తూ, మాస్క్ లు ధరించని వారికి జరిమానాలు విధిస్తున్నట్టు ఉన్నతాధికారులు తెలిపారు.

no mask Rs 1000 fine in telangana

no mask Rs 1000 fine in telangana

మాస్క్ లేకుండా తిరిగేవారి చిత్రాలను సేకరిస్తూ, వారికి ఆన్ లైన్ మాధ్యమంగా జరిమానా రసీదును ఇవ్వనున్నారు. జరిమానా చెల్లించకుంటే..డిజాస్టర్ మేనేజ్ మెంట్ చట్టం కింద వారిని కోర్టులో హాజరు పరుస్తారు. వారిపై వారెంట్లు జారీ చేస్తారు. విపత్తు నిర్వహణ చట్టం, 2005 లోని సెక్షన్ 51 నుండి 60 కింద ప్రాసిక్యూషన్‌ చేయనున్నారు.

ఆరోగ్య శాఖ అధికారులు ఎంతగా హెచ్చరిస్తున్నా, ప్రజలు లెక్క చేయడం లేదని తమ తనిఖీల్లో తేలిందని అంటున్నారు పోలీసులు. వాహనాలపై వెళుతున్న వారు కూడా మాస్క్ లను ధరించడం లేదని తెలిపారు. ప్రజలు తగు జాగ్రత్తలతో ఉంటేనే కరోనాను కట్టడి చేయడం సాధ్యం అవుతుందని ప్రభుత్వం అంటోంది. ప్రజలు సహకరించాలని కోరింది.

ఇవి కూడా చదవండి : Railway BLW Recruitment: ఇండియన్‌ రైల్వే అప్రెంటిస్‌ పోస్టుల ఫలితాలు వచ్చేశాయ్‌.. ఇలా చెక్‌ చేసుకోండి..

Symptoms of coronavirus: వాసన రాకపోవడం, రుచి తెలియకపోవడమే కాదు.. ఇవీ కూడా కరోనా వ్యాధి లక్షణాలే..

చంద్రబాబు, లోకేష్‌పై కేసు నమోదు చేసిన సైబర్‌ క్రైమ్‌ పోలీసులు.. కారణమేంటంటే..