అధికారులు ఆదుకోకుంటే.. ఆత్మహత్యలే శరణ్యం అంటున్న అన్నదాతలు .. కంట కన్నీరు పెట్టిస్తున్న కూరగాయల ధరలు
కూరగాయల ధరలు రైతుల కంట కన్నీరు పెట్టిస్తున్నాయి... నిన్నమొన్నటి వరకూ కిలోకు నలభై నుండి యాభై రూపాయలు ఉన్న కూరగాయల రేట్లు ఒక్కసారిగా అమాంతం పడిపోయాయి.
పెద్దపల్లి మార్కెట్లో బెండకాయ కి పూర్తిగా ధర పడిపోవడంతో వచ్చిన కస్టమర్లకు ఫ్రీగానే పంపిణీ చేశారు రైతులు. అయితే కూరగాయల రేట్లు అమాంతం పడిపోవడానికి కారణం ఎక్కువమంది రైతులు కూరగాయల సాగు విస్తీర్ణం పెరగడంతోనే ఇటువంటి పరిస్థితి నెలకొందని కూరగాయల రైతులు అంటున్నారు.
Follow us
కూరగాయల ధరలు రైతుల కంట కన్నీరు పెట్టిస్తున్నాయి… నిన్నమొన్నటి వరకూ కిలోకు నలభై నుండి యాభై రూపాయలు ఉన్న కూరగాయల రేట్లు ఒక్కసారిగా అమాంతం పడిపోయాయి.
దీంతో కూరగాయల రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఏం చేయాలో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు కూరగాయల రైతులు.
పెద్దపల్లి మార్కెట్లో బెండకాయ కి పూర్తిగా ధర పడిపోవడంతో వచ్చిన కస్టమర్లకు ఫ్రీగానే పంపిణీ చేశారు రైతులు. అయితే కూరగాయల రేట్లు అమాంతం పడిపోవడానికి కారణం ఎక్కువమంది రైతులు కూరగాయల సాగు విస్తీర్ణం పెరగడంతోనే ఇటువంటి పరిస్థితి నెలకొందని కూరగాయల రైతులు అంటున్నారు.
ఉద్యానవన శాఖ అధికారులు గానీ, ప్రభుత్వం గానీ ధాన్యానికి ఏవిధంగానైతే మద్దతు ధర ఉంటుందో అదే విధంగా కూరగాయల కూడా ధర ప్రకటిస్తే బాగుంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
కూరగాయల పంటను మార్కెట్కు తీసుకెళ్తే కిలో ఐదు నుంచి పది రూపాయల లోపే ఉండటంతో కనీసం కూలీ ఖర్చులు, ట్రాన్స్పోర్టు ఛార్జీలు కూడా రావడం లేదని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు రైతులు.
ఇప్పటికైనా కూరగాయల సాగు చేసి నష్టపోయిన రైతుల కూరగాయల పంటలను సర్వే చేసి ప్రభుత్వం ఆదుకోవాలని లేకపోతే ఆత్మహత్యలే శరణ్యమని బాధిత రైతులు డిమాండ్ చేస్తున్నారు.