Road Accident: ఒకే డ్రైవర్.. అదే టిప్పర్.. పన్నెండు రోజులు..రెండు యాక్సిడెంట్లు..ఇద్దరి మృతి!
ట్రాఫిక్ రూల్స్ ఎన్ని ఉన్నా కొందరు డ్రైవర్లకు పట్టవు. వాహనం స్టీరింగ్ ముందు కూచున్నారంటే పూనకం వచ్చేస్తుంది. వారిష్టం వచ్చినట్టు వారు వాహనాలు నడిపిస్తారు. వారు బాగానే ఉంటారు.
Road Accident: ట్రాఫిక్ రూల్స్ ఎన్ని ఉన్నా కొందరు డ్రైవర్లకు పట్టవు. వాహనం స్టీరింగ్ ముందు కూచున్నారంటే పూనకం వచ్చేస్తుంది. వారిష్టం వచ్చినట్టు వారు వాహనాలు నడిపిస్తారు. వారు బాగానే ఉంటారు.. కానీ, రోడ్డు మీద వెళ్లే మిగిలిన ప్రజలే..బలైపోతారు. ఇదిగో ఈ ప్రమాదం అంతే.. ఇక్కడ చెప్పుకోవలసింది ఏమిటంటే.. ఒకే డ్రైవర్.. ఒకే టిప్పర్ తో రెండుసార్లు యాక్సిడెంట్లు చేశాడు. అదే 12 రోజుల వ్యవధిలో. రెండు నిండు ప్రాణాలు ఎగిరిపోయాయి ఈ ప్రమాదాల్లో. వివరాలు ఇలా ఉన్నాయి.
గతనెల 30 వ తేదీన నిజామాబాద్ జిల్లా మల్లారం గ్రామ కార్యదర్శి ఉమాకాంత్ ను టిప్పర్ ఢీ కొట్టడంతో ప్రాణాలు కోల్పోయారు. వెంటనే ఆ టిప్పర్ ను సీజ్ చేసిన పోలీసులు.. డ్రైవర్ గంగాధర్ ను అరెస్ట్ చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలో గంగాధర్ అరెస్టయిన రోజే బెయిల్ పై విడుదల అయ్యాడు. మూడురోజుల క్రితం టిప్పర్ ను పోలీసులు అప్పగించారు. తాజాగా శనివారం నిజామాబాద్ నగరం ఇంద్రాపూర్ సమీపంలో సైకిల్ పై వెళుతున్న నక్క కృష్ణ(46)ను టిప్పర్ ఢీ కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందారు. ఈ యాక్సిడెంట్ చేసింది గంగాధర్.. ప్రమాదానికి కారణమైన టిప్పర్ కూడా అదే. దీంతో గంగాధర్ పై కేసు నమోదు చేసిన నిజామాబాద్ ఐదో పట్టణ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. పన్నెండు రోజుల వ్యవధిలో రెండు ప్రమాదాలకు కారణం అయి, ఇద్దర్ని పొట్టనపెట్టుకున్న టిప్పర్ డ్రైవర్ లైసెన్సును రద్దు చేయాలని రవాణా శాఖ అధికారులకు రికమెండ్ చేయనున్నట్టు కేసు దర్యాప్తు చేస్తున్న ఎస్సై జాన్ రెడ్డి తెలిపారు.