AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రక్తమోడిన రహదారులు.. తెలుగురాష్ట్రాల్లో 10మంది మృతి.. తమిళనాటలో ముగ్గురు మృతి..

దేశంలో పలు రహదారులు రక్తమోడాయి. గడిచిన 24 గంటల్లో జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో 23 మంది మృతి చెందారు. 

రక్తమోడిన రహదారులు.. తెలుగురాష్ట్రాల్లో 10మంది మృతి.. తమిళనాటలో ముగ్గురు మృతి..
Rajitha Chanti
|

Updated on: Dec 13, 2020 | 10:13 AM

Share

దేశంలో పలు రహదారులు రక్తమోడాయి. గడిచిన 24 గంటల్లో జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో 23 మంది మృతి చెందారు.

తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం..

తమిళనాడులోని ధర్మపురి జిల్లాలో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ధర్మపురి-సేలం రహదారిపై తోప్పుర్ వద్ద సిమెంట్ ట్రైలర్ వాహనం కంటైనర్‏ను ఢీకొట్టింది. దీంతో వాటి వెనక వస్తున్న 8 వాహనాలు అదుపుతప్పి ఒకదానినొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడిక్కడే మరణించగా.. మరో పది మంది తీవ్రగాయాల పాలయ్యారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపడుతున్నారు. కాగా ఈ ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.

రాజస్థాన్‏లో ఘోర రోడ్డు ప్రమాదం..

రాజస్థాన్‏లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చిత్తోర్‏గడ్ జిల్లాలో శనివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో 10 మంది మృతిచెందారు. ఉదయ్‏పూర్-నింబహేరా రహదారిపై సాదుల్కేర్ సమీపంలో ప్రయాణికులతో కలిసి వెళ్తున్న తుఫాన్ వాహనాన్ని ట్రైలర్ ట్రక్కు ఢీకొట్టింది. ఈ ఘటనలో 10 మంది మృతిచెందగా, మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు.

తెలుగు రాష్ట్రాల్లో రక్తమోడిన రహదారులు..

హైదరాబాద్: గచ్చిబౌలిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం తెల్లవారుజామున గచ్చిబౌలిలోని విప్రో సర్కిల్ వద్ద టిప్పర్ లారీ ఓ కారును వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందగా.. తీవ్రగాయలైన మరో యువకుడిని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పరిశీలిస్తున్నారు. మృతదేహాలను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.

హైదరాబాదులో వరుస రోడ్డు ప్రమాదాలు..

కూకట్‏పల్లిలోని పిల్లర్ నెంబర్ A-836 వద్ద ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ప్రకాశ్ అనే యువకుడు మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని ఉస్మానియా హాస్పిటల్‏కు తరలించారు.

అటు పటార్ చెరులో టిప్పర్ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

నెల్లూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం..

నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నాయుడుపేట సమీపంలోని స్వర్ణముఖి నదిపై ఉన్న కాజ్‎వే వద్ద శనివారం రాత్రి జరిగిన ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతిచెందగా, మరో బాలిక స్వర్ణముఖి నదిలో గల్లంతైంది. మరో ముగ్గురికి గాయాలయ్యాయి.

శ్రీకాకుళంలో రోడ్డు ప్రమాదం..

శ్రీకాకుళం: నాలుగు రోజుల్లో కుమార్తె వివాహం. స్నేహితులు, బంధువులను ఆ వేడుకకు ఆహ్వానించడానికి వెళ్తున్న ఆ ఇంటి ఇల్లాలిని మృత్యువు రోడ్డు ప్రమాదం రూపంలో కాటేసింది. సంతకవిటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సీహెచ్‏వోగా విధులు నిర్వర్తిస్తున్న కె.సరోజిని (55).. భర్త ప్రదీప్‏తో కలిసి ద్విచక్ర వాహనంపై పెళ్ళి పిలుపుకు సంతకవిటి నుంచి రాజాం బయల్దేరారు. గుళ్ళసీతారాంపురం సమీపంలోని మలుపు వద్ద బైక్ రోడ్డు అంచుకు తగిలి అదుపు తప్పింది. వెంటనే బైక్ పై ఉన్న సరోజిని జారిపడిపోవడంతో తలకు బలమైన గాయమై అక్కడికక్కడే మృతి చెందారు.

పర్వతం అంచున భీముని రాయి.. గాలికి కదులుతున్నా పడిపోని అద్భుతం..
పర్వతం అంచున భీముని రాయి.. గాలికి కదులుతున్నా పడిపోని అద్భుతం..
నారింజ తొక్కల వలన కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే!
నారింజ తొక్కల వలన కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే!
ప్రతి రోజూ ఉదయాన్నే దానిమ్మ జ్యూస్‌ తాగితే ఇన్ని లాభాలా..?
ప్రతి రోజూ ఉదయాన్నే దానిమ్మ జ్యూస్‌ తాగితే ఇన్ని లాభాలా..?
సమంతతో పాటు రెండో పెళ్లి చేసుకున్న తెలుగు హీరోయిన్స్ వీరే!
సమంతతో పాటు రెండో పెళ్లి చేసుకున్న తెలుగు హీరోయిన్స్ వీరే!
అయ్యగారి కోసం రంగంలోకి పాన్ ఇండియా డైరెక్టర్..
అయ్యగారి కోసం రంగంలోకి పాన్ ఇండియా డైరెక్టర్..
చికెన్ Vs మటన్: ప్రోటీన్ ఎందులో ఎక్కువ ఉంటుంది.. ఆరోగ్యానికి..
చికెన్ Vs మటన్: ప్రోటీన్ ఎందులో ఎక్కువ ఉంటుంది.. ఆరోగ్యానికి..
పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!
పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!