ముగ్గురు పోలీస్ ఉన్నతాధికారులకు డిప్యూటేషన్.. జేపీ నడ్డా కారుపై దాడి ఘటనే కారణమా..?

పశ్చిమబెంగాల్‌ పోలీసులపై కేంద్ర ప్రభుత్వం కొరడా ఝులిపిస్తోంది. కోల్‌కతాలో ఓ బహిరంగ సభకు హాజరుకావడానికి

ముగ్గురు పోలీస్ ఉన్నతాధికారులకు డిప్యూటేషన్.. జేపీ నడ్డా కారుపై దాడి ఘటనే కారణమా..?
Follow us
uppula Raju

|

Updated on: Dec 13, 2020 | 8:18 AM

పశ్చిమబెంగాల్‌ పోలీసులపై కేంద్ర ప్రభుత్వం కొరడా ఝులిపిస్తోంది. కోల్‌కతాలో ఓ బహిరంగ సభకు హాజరుకావడానికి వెళ్లిన బీజేపీ జాతీయ అధ్యక్షుడ జేపీ నడ్డా కాన్వాయ్‌పై దాడి జరిగిన సంగతి తెలిసిందే. దీనిపై విచారణ చేయడానికి ఆ రాష్ట్ర సీఎస్, డీజీపీలను కేంద్ర హోం శాఖ సమావేశాలకు రావాలని సమన్లు జారీ చేసింది. కానీ వారు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆదేశాల మేరకు దాడికి సంబంధించి వివరణ రాసి పంపించారు. దీంతో కేంద్ర హోం శాఖ పశ్చిమబెంగాల్ పోలీస్ శాఖపై సీరియస్‌గా ఉంది. వెంటనే ముగ్గురు అధికారులను డిప్యూటేషన్‌పై సెంట్రల్‌కు రావాలని ఆదేశాలు జారీ చేసింది.

జేపీ నడ్డా పర్యటనకు సంబంధించి భద్రత కల్పించడంలో విఫలమైనందుకు పశ్చిమబెంగాల్ క్యాడర్‌లో విధులు నిర్వహిస్తున్న డైమండ్ హార్బర్ ఎస్పీ భోల్‌నాథ్ పాండే, ప్రెసిడెన్సీ రేంజ్ డీఐజీ ప్రవీణ్ త్రిపాఠి, దక్షణ బెంగాల్ అదనపు డీజీ రాజీవ్ మిశ్రాలను కేంద్రంలో పనిచేయాలని డిప్యూటేషన్ జారీ చేసింది. నిబంధనల ప్రకారమే అధికారులను కేంద్రానికి బదిలీ చేశామని కేంద్ర హోం శాఖ అధికారులు చెబుతున్నారు. కానీ అఖిల భారత సర్వీసు అధికారులను కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకున్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వాల అభిప్రాయాలను కూడా పరిగణలోకి తీసుకుంటారు. అయితే ఇక్కడ కేంద్ర ప్రభుత్వం కావాలని రాష్ట్ర ప్రభుత్వ అనుమతులు లేకుండా అధికారులను డిప్యూటేషన్ చేశారు. దీంతో హోం శాఖ ఆదేశాలను పశ్చిమబెంగాల్‌ రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. అంతేకాకుండా రాష్ట్రంలో అత్యవసర పరిస్థితి విధించాలని హోం మంత్రి అమిత్‌ షా ప్రయత్నిస్తున్నారని సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు.

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!