చెన్నైలో దారుణం.. బస్టాండ్ లో మహిళకు నిప్పు పెట్టి తానూ అంటించుకున్న వ్యక్తి.. ఇద్దరూ దుర్మరణం!

చెన్నైలో ఘోరం చోటుచేసుకుంది. బస్టాండ్ లో ఒక మహిళను సజీవదహనం చేశాడు ఒక వ్యక్తి. తరువాత అతనూ ఆత్మహత్య చేసుకున్నాడు.

  • KVD Varma
  • Publish Date - 4:01 pm, Sun, 11 April 21
చెన్నైలో దారుణం.. బస్టాండ్ లో మహిళకు నిప్పు పెట్టి తానూ అంటించుకున్న వ్యక్తి.. ఇద్దరూ దుర్మరణం!
Tamilnadu

చెన్నైలో ఘోరం చోటుచేసుకుంది. బస్టాండ్ లో ఒక మహిళను సజీవదహనం చేశాడు ఒక వ్యక్తి. తరువాత అతనూ ఆత్మహత్య చేసుకున్నాడు. సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. చెన్నైలో రోజువారీ కార్మికుడిగా పనిచేస్తున్న ముత్తు.. శాంతి అనే మహిళతో సహజీవనం చేస్తున్నాడు. వీరిద్దరూ అక్కడి బస్టాండ్ ప్లాటుఫామ్ పైనే జీవిస్తున్నారు. ఈ క్రమంలో శాంతి కోయంబేడు మార్కెట్ లో పనిచేసే మరో వ్యక్తితో ఇటీవల సన్నిహితంగా ఉంటోంది. ఇది నచ్చని ముత్తు.. ఆ వ్యక్తితో తెగదెంపులు చేసుకోవాలని శాంతిని పలుమార్లు హెచ్చరించాడు. అయినా, ఆమె వినలేదు. దీంతో ఆమెపై కక్ష పెంచుకున్నాడు ముత్తు. శనివారం రాత్రి శాంతి నిద్రపోతున్న సమయంలో పెట్రోల్ పోసి ఆమెకు నిప్పంటించాడు. అనంతరం ముత్తుకూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రయాణీకులు, స్థానికులు ఆ మంటలను ఆర్పివేసి సమాచారం ఇచ్చారు. పోలీసులు ఆ ఇరువురిని అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే వారు ఇద్దరూ మృతి చెందినట్లు డాక్టర్లు ధృవీకరించారు.

Also read: Fire Accident In Delhi: దేశరాజధానిలో ఘోర అగ్ని ప్రమాదం.. 250 దుకాణాలకు వ్యాపించిన మంటలు..

Encounter: జమ్మూ కాశ్మీర్‌లో ముగ్గురు ఉగ్రవాదుల హతం.. కొనసాగుతున్న ఆపరేషన్..