AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: తెలంగాణ రైతులకు శుభవార్త చెప్పిన సీఎం కేసీఆర్.. హర్షం వ్యక్తం చేస్తున్న రైతన్నలు..

Telangana: తెలంగాణ రైతాంగానికి ఇది నిజంగా శుభవార్తే అని చెప్పాలి. ముఖ్యంగా పాడి రైతులకు పండుగలాంటి వార్త. అవును, పాడిరైతుల నెత్తిన..

Telangana: తెలంగాణ రైతులకు శుభవార్త చెప్పిన సీఎం కేసీఆర్.. హర్షం వ్యక్తం చేస్తున్న రైతన్నలు..
Dairy Farmers
Shiva Prajapati
|

Updated on: Aug 29, 2022 | 6:03 PM

Share

Telangana: తెలంగాణ రైతాంగానికి ఇది నిజంగా శుభవార్తే అని చెప్పాలి. ముఖ్యంగా పాడి రైతులకు పండుగలాంటి వార్త. అవును, పాడిరైతుల నెత్తిన పాలుపోశారు మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌. రైతుల నుంచి సేకరిస్తోన్న పాల ధరలను పెంచుతున్నట్లు మంత్రి ప్రకటించారు. రాజేంద్ర నగర్ లోని కో ఆపరేటివ్ మేనేజ్మెంట్ ఇనిస్టిట్యూట్ లో నిర్వహించిన పాడి రైతుల అవగాహన సదస్సులో పాల్గొన్న మంత్రి.. విజయ డైరీ రైతులకు ఈ శుభవార్త తెలిపారు. సీఎం కేసీఆర్ నిర్ణయం మేరకు పాల ధరలు పెంచుతున్నట్లు ప్రకటించారు.

రైతుల నుండి సేకరిస్తున్న గేదె పాల ధరను లీటరు 46.69 రూపాయల నుంచి 49.40 రూపాయలకు పెంచుతున్నట్టు వెల్లడించారు. అలాగే ఆవుపాల ధరను సైతం 33.75 రూపాయల నుంచి, 38.75 రూపాయలకు పెంచుతున్నట్టు ప్రకటించారు. పాడి రైతులకు ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందన్నారు మంత్రి తల్లసాని. కాగా, ఒకప్పుడు నష్టాల్లో ఉన్న విజయాడైరీ తెలంగాణ ఆవిర్భావం తరువాత లాభాల బాటపట్టిందన్నారు. సీఎం కేసీఆర్ దూరదృష్టితోనే విజయాడైరి నేడు ఈ స్థాయిలో నిలిచిందన్నారు. కాగా, ప్రభుత్వ నిర్ణయం పట్ల పాడి రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..