Telangana: వాహనదారులకు గుడ్ న్యూస్.. పెండింగ్ చలాన్ల రాయితీ గడుపు పెంపు..

ట్రాఫిక్ చలానాల రాయితీల విషయంలో తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. మరో 15 రోజుల పాటు పెండింగ్ చలాన్ల చెల్లింపుల గడువు పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. అయితే తాజా ఆదేశాల ప్రకారం ఫిబ్రవరి 15 వరకు వాహనదారులు తమ పెండింగ్ చలాన్లను ఆన్లైన్లో చెల్లించునే వెసులుబాటు కల్పించింది.

Telangana: వాహనదారులకు గుడ్ న్యూస్.. పెండింగ్ చలాన్ల రాయితీ గడుపు పెంపు..
Traffic Challan
Follow us
Srikar T

|

Updated on: Jan 31, 2024 | 5:07 PM

హైదరాబాద్, జనవరి 31:  ట్రాఫిక్ చలానాల రాయితీల విషయంలో తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. మరో 15 రోజుల పాటు పెండింగ్ చలాన్ల చెల్లింపుల గడువు పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. గతంలో ఇచ్చిన ఈ గడువు జనవరి 31 తో ముగియనుంది. అయితే తాజా ఆదేశాల ప్రకారం ఫిబ్రవరి 15 వరకు వాహనదారులు తమ పెండింగ్ చలాన్లను ఆన్లైన్లో చెల్లించునే వెసులుబాటు కల్పించింది. గతంలో లాగానే ఆర్టీసీ బస్సులకు 90శాతం, ద్విచక్ర వాహనాలు, కార్లకు 80శాతం, భారీ వాహనాలకు 60శాతం రాయితీతో చెల్లించవచ్చు. దీనికి సంబంధించిన ఉత్తర్వులను పోలీసు శాఖకు, రోడ్డు రవాణా శాఖ ఉన్నతాధికారులకు పంపించారు ముఖ్య కార్యదర్శి శాంతికుమారి.

రాష్ట్రవ్యాప్తంగా 3 కోట్ల 59 లక్షల పెండింగ్‌ చలానాలు ఉండగా.. ఆఫర్ ప్రకటించినప్పటి నుంచి ఇప్పటివరకు కోటీ ఐదు లక్షల మంది చలాన్లు కట్టినట్టు అధికారులు తెలిపారు. దీని ద్వారా మొత్తం 107 కోట్ల ఆదాయం ప్రభుత్వానికి చేకూరినట్టు పేర్కొన్నారు. ఇవి డిసెంబరు 25 వరకు ఉన్న లెక్కలు మాత్రమే. తాజాగా పూర్తి వివరాలు ప్రభుత్వం ప్రకటించాల్సి ఉంది. మొదటి రోజు నుంచి విశేష స్పందన లభించింది. పెద్ద ఎత్తున వాహనదారులు చలాన్లు కట్టటంతో.. సర్వర్ హ్యాంగ్ అయ్యింది. దీంతో.. చాలా మంది వాహనదారులు చలాన్లు కట్టలేకపోయారు. దీన్ని పరిగణలోకి తీసుకున్న ప్రభుత్వం ఈ రాయితీకి ఫిబ్రవరి 15 వరకు పొడిగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..