Universities Vice Chancellors: తెలంగాణలో యూనివర్సిటీల కొత్త వీసీల నియమాకం.. ఆమోదం తెలిపిన రాష్ట్ర గవర్నర్

రాష్ట్రం లోని పది విశ్వవిద్యాలయాలకు వైస్ ఛాన్సలర్లను తెలంగాణ ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు వీసీల జాబితాపై గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్‌ శుక్రవారం ఆమోదముద్ర వేశారు.

Universities Vice Chancellors: తెలంగాణలో యూనివర్సిటీల కొత్త వీసీల నియమాకం.. ఆమోదం తెలిపిన రాష్ట్ర గవర్నర్
Telangana Universities Vice Chancellors
Follow us
Balaraju Goud

|

Updated on: May 22, 2021 | 7:59 PM

Telangana Universities Vice Chancellors: రాష్ట్రం లోని పది విశ్వవిద్యాలయాలకు వైస్ ఛాన్సలర్లను తెలంగాణ ప్రభుత్వం నియమించింది. ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన సెర్చ్ కమిటీలు, యుజిసి నిబంధనలకు అనుగుణంగా, రాష్ట్రంలోని యూనివర్సిటీలకు వైస్ ఛాన్సలర్ల నియామక ప్రక్రియను చేపట్టి కొందరి పేర్లను సూచించింది. దాదాపు రెండున్నరేళ్ల తర్వాత 10 యూనివర్సిటీలకు వీసీలను ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసిన వీసీల జాబితాపై గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్‌ శుక్రవారం ఆమోదముద్ర వేశారు. జాబితాను ప్రభుత్వం శుక్రవారం విడుదల చేస్తుందని భావించగా.. సాధ్యపడలేదు. దీంతో శనివారం ప్రకటించారు.

ప్రభుత్వం నియమించిన వైస్ ఛాన్సలర్లు వీరే..

ఉస్మానియా యూనివర్సిటీ, (హైదరబాద్) వీసీః ప్రొ. డి. రవీందర్ యాదవ్ (బీసీ)

కాకతీయ యూనివర్సిటీ (వరంగల్) వీసీః ప్రొ. టి.రమేష్ (బీసీ)

తెలంగాణ యూనివర్సిటీ, (నిజామాబాద్) వీసీః ప్రో. డి. రవీందర్ (వైశ్య)

డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ (హైదరబాద్) వీసీః ప్రొ. సీతారామారావు (ఓసి, బ్రాహ్మణ)

పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ(హైదరబాద్) వీసీః ప్రొ. టి.కిషన్ రావు ( ఓసి వెలమ)

పాలమూరు యూనివర్సిటీ, (మహబూబ్ నగర్) వీసీః ప్రొ. లక్ష్మీకాంత్ రాథోడ్( ఎస్టీ)

మహాత్మాగాంధీ యూనివర్సిటీ, (నల్గొండ ) వీసీ గా ప్రొ. సిహెచ్ గోపాల్ రెడ్డి

జవహర్ లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ (హైదరబాద్) వీసీః ప్రొ. కట్టా నర్సింహా రెడ్డి (ఓసి)

శాతవాహన యూనివర్సిటీ, (కరీంనగర్)వీసీః ప్రొ. మల్లేశం (ఎస్సీ మాల)

జవహర్ లాల్ నెహ్రు ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ(హైదరాబాద్) వీసీః కవిత దర్యాని (ఓసి, సింధి)

Read Also… Black Fungus: దేశవ్యాప్తంగా పెరుగుతున్న బ్లాక్ ఫంగస్.. ఇప్పటి వరకు 8,800 కేసులు.. గుజరాత్‌లోనే అధికం.. !