AP-Telangana Borders: ఉద‌యం 6నుంచి 10 లోపు తెలంగాణలోకి వెళ్లాల‌న్నా ఈ-పాస్ కావాల్సిందే.. ఆంక్షలు మ‌రింత‌ కఠినతరం..

తెలంగాణ- ఆంద్రా సరిహద్దుల వద్ద ఆంక్షలు కఠినతరం తెలంగాణ పోలీసులు. ఈ పాస్ ఉంటేనే తెలంగాణలోకి అనుమతిస్తున్నారు. గరికపాడు-రామాపురం క్రాస్ చెక్ పోస్ట్...

AP-Telangana Borders: ఉద‌యం 6నుంచి 10 లోపు తెలంగాణలోకి వెళ్లాల‌న్నా ఈ-పాస్ కావాల్సిందే..  ఆంక్షలు మ‌రింత‌ కఠినతరం..
Ap Telangana Borders
Follow us

|

Updated on: May 22, 2021 | 7:58 PM

తెలంగాణ- ఆంద్రా సరిహద్దుల వద్ద ఆంక్షలు కఠినతరం తెలంగాణ పోలీసులు. ఈ పాస్ ఉంటేనే తెలంగాణలోకి అనుమతిస్తున్నారు. గరికపాడు-రామాపురం క్రాస్ చెక్ పోస్ట్ వద్ద ఈ పాస్ లు తప్పనిసరి చేశారు. ఆరు గంటల నుండి పది గంటలలోపు వచ్చే వారికి కూడా ఈ పాస్ మ‌స్ట్ అని చెబుతున్నారు. అత్యవసర సేవలు అందించే ఆంబులెన్స్ లకు అనుమతి ఎప్ప‌ట్లాగే ఉంద‌ని వెల్ల‌డించారు. ఇప్పటి వరకు ఆరు గంటల నుండి పది గంటల వరకు తెలంగాణాలోకి వ‌చ్చేందుకు పోలీసులు ఎటువంటి డాక్యుమెంట్స్ అడ‌గ‌లేదు. కానీ ఇకపై ఆరుగంటల నుండి పది గంటల లోపు వెళ్ళాలి అన్నా ఈ పాస్ తప్పనిసరి అని పేర్కొన్నారు. ఈ పాస్ ఉంటే రామాపురం క్రాస్ చెక్ పోస్ట్ వద్ద మాత్రమే తెలంగాణలోకి అనుమతిస్తున్నారు.

హైద‌రాబాద్ లో ఆంక్ష‌లు మరింత‌ క‌ఠిన‌త‌రం…

ఉదయం 10 గంటల తర్వాత అనవసరంగా ఎవరూ రోడ్లపైకి రాకూడదని డీజీపీ మహేందర్‌రెడ్డి హెచ్చరించారు. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ అమలు తీరును డీజీపీ స్వయంగా పరిశీలించారు. కుషాయిగూడ, కూకట్‌పల్లితోపాటు పలు ప్రాంతాల్లో పోలీస్‌ చెక్‌పోస్టులను పోలీస్ బాస్‌ పరిశీలించారు. సీజ్‌ చేసిన వాహనాలను లాక్‌డౌన్‌ తర్వాతే అప్పగిస్తామని తెలిపారు. ఎమ‌ర్జెన్సీ అయితే పాస్‌లు ఉన్నవారే బయటకు రావాలని.. నకిలీపాస్‌లతో పట్టుబడితే చ‌ర్య‌లు క‌ఠినంగా ఉంటాయ‌న్నారు. రాత్రి 9 నుంచి ఉదయం 8 గంటల వరకే సరకు రవాణా వాహనాలకు అనుమతి ఉందని చెప్పారు. ఏ పనైనా ఉదయం 6 నుంచి 10 మధ్యే చేసుకోవాలన్నారు. ఉదయం 6 నుంచి 10 వరకే ఈ-కామర్స్ సేవలకు ప‌ర్మిష‌న్ ఉంటుందని చెప్పారు.

Also Read: ఉత్తర, దక్షిణ కోస్తాంధ్రా, యానాం ప్రాంత ప్రజలకు రాగల మూడు రోజుల వరకూ వాతావరణ సూచనలు

తెలంగాణ‌లో కొత్తగా 3,308 కరోనా కేసులు.. మరణాలు, యాక్టివ్ కేసుల వివ‌రాలు ఇలా ఉన్నాయి..