Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మధ్యప్రదేశ్ లో కోవిడ్ -19 తో నెలలో లక్ష మంది మృతి, కాంగ్రెస్ సీనియర్ నేత కమల్ నాథ్ వెల్లడి, బీజేపీ తప్పుడు లెక్కలు చెబుతోందని ఆరోపణ

మధ్యప్రదేశ్ లో కేవలం నెల రోజుల కాలంలో లక్షమందికి పైగా కోవిద్ రోగులు మరణించారని కాంగ్రెస్ సీనియర్ నేత కమల్ నాథ్ తెలిపారు.

మధ్యప్రదేశ్ లో కోవిడ్ -19 తో నెలలో లక్ష మంది మృతి,  కాంగ్రెస్ సీనియర్ నేత కమల్ నాథ్ వెల్లడి, బీజేపీ తప్పుడు లెక్కలు చెబుతోందని ఆరోపణ
Kamal Nath
Follow us
Umakanth Rao

| Edited By: Phani CH

Updated on: May 22, 2021 | 8:53 PM

మధ్యప్రదేశ్ లో కేవలం నెల రోజుల కాలంలో లక్షమందికి పైగా కోవిద్ రోగులు మరణించారని కాంగ్రెస్ సీనియర్ నేత కమల్ నాథ్ తెలిపారు. తన వద్ద ఇందుకు సంబంధించి పక్కా సమాచారం ఉందని ఆయన చెప్పారు. బీజేపీ కోవిద్ 19 తో కాకుండా క్రిటిసిజం తో పోరాడుతోందని ఆయన ఎద్దేవా చేశారు. కేంద్రంలోని ఈ పార్టీ ప్రభుత్వం..పోరాడుతున్నది కోవిద్-19 మేనేజ్ మెంట్ తో కాదు..ఇమేజ్ మేనేజ్ మెంట్ తో చాలా బిజీగా ఉంది అని అయన వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ఎన్ని కోవిద్ డెడ్ బాడీలకు అంత్యక్రియలు జరిగాయో 26 జిల్లాలనుంచి తాను సమాచారం తెప్పించుకున్నానని, మార్చి-ఏప్రిల్ మధ్య కాలంలో లక్షా 27 వేల మృతదేహాలు శ్మశానవాటికలకు తరలినట్టు తెలిసిందని ఆయన చెప్పారు. వీటిలో 80 శాతం పైగా కోవిద్ రోగులవే అని అయన తెలిపారు. అయితే కేంద్రం మాత్రం ప్రపంచానికి తమ దేశంలో కోవిద్ మరణాలు తక్కువేనని చాటుకుంటోందని కమల్ నాథ్ ఆరోపించారు. ఇది తప్పుడు సమాచారం కాక మరేమిటన్నారు. విదేశీయులెవరైనా మన ఇండియాకు వచ్చి ఇక్కడి పరిస్థితిని మదింపు చేసుకోవచ్చు అన్నారాయన. ఇది ఇక్కడి ప్రజలను కూడా మోసగించడం కాదా అని వ్యాఖ్యానించారు.

ఇలా ఉండగా రాష్ట్రంలో ఈ నెలాఖరువరకు లాక్ డౌన్ పొడిగిస్తునట్టు సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. 24 గంటల్లో సుమారు 5 వేల కోవిద్ కేసులు నమోదయ్యాయని, 79 మంది రోగులు మరణించారని ఆయన చెప్పారు. జూన్ మొదటివారంలో ఆంక్షలను చాలావరకు తగ్గించే అవకాశం ఉందని ఆయన చెప్పారు.

మరిన్ని ఇక్కడ చూడండి: Attacked for Wearing Mask: మాస్క్ పెట్టుకోమన్నందుకు ఐకేపీ అధికారిపై దాడి.. ముక్కుకు తీవ్ర గాయంతో ఆసుపత్రిపాలు..!

Samantha Akkineni: ఫైర్ బ్రాండ్ ఇమేజ్ కోసం తాపత్రయ పడిన స‌మంత‌కు లేనిపోని త‌ల‌నొప్పులు…!