Attacked for Wearing Mask: మాస్క్ పెట్టుకోమన్నందుకు ఐకేపీ అధికారిపై దాడి.. ముక్కుకు తీవ్ర గాయంతో ఆసుపత్రిపాలు..!

ప్రతి ఒక్కరు భౌతిక దూరం పాటించి, మాస్క్ ధరించాలని సూచిస్తున్నారు. ఇదే క్రమంలో మాస్క్ పెట్టుకుని మాట్లాడమన్నందుకు అధికారిపై ఓ వ్యక్తి దాడి చేశాడు.

Attacked for Wearing Mask: మాస్క్ పెట్టుకోమన్నందుకు ఐకేపీ అధికారిపై దాడి.. ముక్కుకు తీవ్ర గాయంతో ఆసుపత్రిపాలు..!
Ikp Officer Attacked For Wearing Mask
Follow us
Balaraju Goud

|

Updated on: May 22, 2021 | 8:47 PM

Officer Attacked for Wearing Mask: మాస్కు పెట్టుకుని మాట్లాడమన్నందుకు అధికారి ముక్కు పగలగొట్టిన ఘటన జగిత్యాల జిల్లాలో జరిగింది. అసలే కరోనా మహమ్మారి విరుచుకుపడుతోంది. నిత్యం జిల్లావ్యాప్తంగా వందల కేసులు నమోదవుతున్నాయి. ప్రభుత్వం ఓ వైపు కోవిడ్ నిబంధనలు కఠినతరం చేస్తోంది. ప్రతి ఒక్కరు భౌతిక దూరం పాటించి, మాస్క్ ధరించాలని సూచిస్తున్నారు. ఇదే క్రమంలో మాస్క్ పెట్టుకుని మాట్లాడమన్నందుకు అధికారిపై ఓ వ్యక్తి దాడి చేశాడు. దీంతో ముక్కు పగిలడంతో ఆసుపత్రికి తరలించారు.

జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలం వెల్లుల్ల గ్రామంలోని వరి ధాన్యం కొనుగోలు సెంటర్‌లో వీడీసీ ఆధ్వర్యంలో బుక్ కీపర్‌గా పనిచేస్తున్నారు శ్యామ్ కుమార్. అయితే ప్యాడి క్లినింగ్ కోసం వచ్చిన గొర్ల చిన్న ఆశాలు అనే రైతు సీరియల్ నంబర్ తప్పావని శ్యామ్ కుమార్‌తో వాగ్వాదానికి దిగాడు. అయితే, అదే సమయంలో ఐకేపీ సెంటర్‌ను తనిఖీ చేసేందుకు వచ్చిన క్లస్టర్ కోఆర్డినేటర్ అశోక్ ఇద్దరి సముదాయించేందుకు ప్రయత్నించారు.

ఇదే క్రమంలో చిన్న ఆశాలు మాస్కు పెట్టుకుని మాట్లాడాలని అశోక్ సూచించాడు. దీంతో క్షణికావేశానికి లోనై చిన్న ఆశాలు ఒక్కసారిగా అశోక్ ముఖంపై కొట్టగా ముక్కు పగిలి తీవ్రంగా రక్తస్రావం అయ్యింది. దీంతో అక్కడే ఉన్న మిగతా రైతుల సహాయంతో అశోక్‌ను మెట్‌పల్లిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులకు పిర్యాదు చేసినట్టు బాధితుడు అశోక్ తెలిపారు. కాగా, కేసు నమోదు చేసుకున్న మెట్‌పల్లి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Read Also…  COVID Has Orphaned Children : కరోనా మహమ్మారి కాటుతో తల్లిదండ్రులను కోల్పోయి తెలుగు రాష్ట్రాల్లో అనాధలౌతున్న పిల్లలు

మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
వెలగ పండుతో అద్భుతాలే.. సంతానలేమి సమస్యలు మాయం!
వెలగ పండుతో అద్భుతాలే.. సంతానలేమి సమస్యలు మాయం!
ఐటీ చెల్లింపుదారులకు పండగే.. వచ్చే బడ్జెట్‌లో ట్యాక్స్ తగ్గింపు.?
ఐటీ చెల్లింపుదారులకు పండగే.. వచ్చే బడ్జెట్‌లో ట్యాక్స్ తగ్గింపు.?
ఇలాంటి వాళ్లను ఏం చేయాలి? రేణూ దేశాయ్ సంచలన పోస్ట్.. ఏమైందంటే?
ఇలాంటి వాళ్లను ఏం చేయాలి? రేణూ దేశాయ్ సంచలన పోస్ట్.. ఏమైందంటే?
17 ఏళ్లకే క్రేజీ హీరోయిన్.. రహస్యంగా పెళ్లి, 9 నెలలకే విడాకులు..
17 ఏళ్లకే క్రేజీ హీరోయిన్.. రహస్యంగా పెళ్లి, 9 నెలలకే విడాకులు..
ఐఆర్‌సీటీసీ సైట్‌ డౌన్‌ అయితే రైలు టికెట్లను బుక్‌ చేసుకోవడం ఎలా?
ఐఆర్‌సీటీసీ సైట్‌ డౌన్‌ అయితే రైలు టికెట్లను బుక్‌ చేసుకోవడం ఎలా?
కొత్త ఫీచర్లతో హోండా యూనికార్న్.. అప్‌డేట్ మోడల్ విడుదల
కొత్త ఫీచర్లతో హోండా యూనికార్న్.. అప్‌డేట్ మోడల్ విడుదల
బిచ్చగత్తె చేతిలో అనుమానాస్పద ప్లాస్టిక్ బ్యాగ్.. తెరిచి చూడగా
బిచ్చగత్తె చేతిలో అనుమానాస్పద ప్లాస్టిక్ బ్యాగ్.. తెరిచి చూడగా
హైడ్రాకు ఇప్పటివరకు ఎన్ని ఫిర్యాదులు వచ్చాయో తెలుసా..?
హైడ్రాకు ఇప్పటివరకు ఎన్ని ఫిర్యాదులు వచ్చాయో తెలుసా..?
బక్కగా ఉన్నవారు బరువు పెరగాలంటే ఇలా చేయండి..
బక్కగా ఉన్నవారు బరువు పెరగాలంటే ఇలా చేయండి..