Samantha Akkineni: ఫైర్ బ్రాండ్ ఇమేజ్ కోసం తాపత్రయ పడిన స‌మంత‌కు లేనిపోని త‌ల‌నొప్పులు…!

సెకండ్ ఇన్నింగ్స్ లో సమంత ఎలా ఉండబోతున్నారు? సెన్సేషనలిజాన్ని కోరుకుంటున్నారా? రామలక్ష్మి అనే సాఫ్ట్ అండ్ స్వీట్ కార్నర్స్ నుంచి సైడ్ ఇచ్చుకుని..

Samantha Akkineni: ఫైర్ బ్రాండ్ ఇమేజ్ కోసం తాపత్రయ పడిన స‌మంత‌కు లేనిపోని త‌ల‌నొప్పులు...!
Samantha
Follow us
Ram Naramaneni

|

Updated on: May 22, 2021 | 8:37 PM

సెకండ్ ఇన్నింగ్స్ లో సమంత ఎలా ఉండబోతున్నారు? సెన్సేషనలిజాన్ని కోరుకుంటున్నారా? రామలక్ష్మి అనే సాఫ్ట్ అండ్ స్వీట్ కార్నర్స్ నుంచి సైడ్ ఇచ్చుకుని.. ఇకనుంచి ఫైర్ బ్రాండ్ ఇమేజ్ కోసం తాపత్రయ పడుతున్నారా? ఆమె తీసుకుంటున్న స్టెప్స్ అన్నీ అటువంటి అనుమానాలనే పుట్టిస్తున్నాయి. ఇంక్లూడింగ్ దిస్ ఫ్యామిలీ మాన్ వెబ్ సిరీస్…! తన సొంత గడ్డ తమిళనాడే తనను ఇలా తన్ని తరిమేసేదాకా తెగిస్తుందని సమంత ఊహించారో లేదో..! కానీ.. ఈ తెలుగింటి కోడలికి ఆరవ నేల మీద అటువంటి మర్యాదలే దక్కుతున్నాయిప్పుడు. ఫ్యామిలీ మాన్ వెబ్ సిరీస్ ట్రైలర్ చూసిన తమిళ నెటిజనం తన మీద కత్తిదూయ్యడాన్ని సీరియస్ గానే తీసుకున్నారామె. కామ్ గా వుండండి… నా మీద విశ్వాసం ఉంచండి అంటూ సింగిల్ లైనర్ తో రియాక్ట్ అయ్యారు.

తమిళమ్మాయిలంటే తీవ్రవాదుల్లాగా కనిపిస్తున్నారా .. నువ్వు కూడా చెన్నై అమ్మాయివేగా.. అంటూ రివర్స్ ఎటాక్ షురూ అయిందక్కడ. పైగా.. నీ మీద విశ్వాసం ఉంచాలా? నిన్ను కొట్టకుండా వదిలిపెడుతున్నాం.. దానికి సంతోషించు అని చీదరించుకునే దాకా వెళ్ళింది వ్యవహారం. నిజానికి తమిళ్ సినిమానే సమంత ఎక్కువగా ప్రేమిస్తారు. అక్కడ ఆమె చేసిన రోల్సే ఇందుకు సాక్ష్యాలు. మెర్సల్, ఇరుంబుతిరై లాంటి స్టార్ మూవీస్ తో పాటు సూపర్ డీలక్స్, యూటర్న్ లాంటి యూనిక్ సినిమాల్లో ఛాలెంజింగ్ రోల్స్ చేసి తమిళ్ ఆడియెన్స్ మనసుకు దగ్గరయ్యారు సమంత. కానీ.. అప్పుడు ఎత్తి నెత్తిన పెట్టుకున్నవారే ఇప్పుడు నేలకేసి కొట్టడంతో హర్ట్ అవుతున్నారట సామ్స్. అటు.. కంగనా రనౌత్ నుంచి స్పెషల్ కాంప్లిమెంట్ వచ్చింది సమంతకు. నా మనసు దోచావ్.. అంటూ ఇన్ స్టా స్టోరీస్ లో సమంత బొమ్మను పోస్ట్ చేశారు కంగనా.

రీసెంట్ గా తలైవి ట్రైలర్ చూసి ఈ జెనరేషన్లో అత్యంత ధైర్యవంతురాలైన నటివి నువ్వే అని రియాక్ట్ అయ్యారు సమంత. నార్త్ లో నువ్వైతే సౌత్ లో నేను అంటూ.. ఆవిధంగా కంగనాతో పోటీకొస్తున్నారు రామలక్ష్మి. గతంలో ఒక సినిమా పోస్టర్ విషయంలో మహేష్ తోనే కయ్యానికి దిగారు సమంత. ఏదనిపిస్తే అది మొహం మీదే చెప్పే ఓ బేబీ.. ఇప్పుడు దాదాపుగా ఫైర్ బ్రాండ్ ఇమేజ్ కి దగ్గరవుతున్నారు. ఆమెను ఇంకాస్త స్ట్రాంగ్ అయ్యేలా హెల్ప్ చేస్తోంది ది ఫ్యామిలీమాన్ వెబ్ సిరీస్.

Also Read: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన సింగర్‌ శ్రేయా ఘోషల్.. సోష‌ల్ మీడియాలో పోస్ట్

ప్ర‌భాస్ అభిమానుల‌కు గుడ్ న్యూస్..! థియేట‌ర్లు ఓపెన్ అయితే ఆ రోజు రిలీజ్ ఫిక్స్ !

డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
వెలగ పండుతో అద్భుతాలే.. సంతానలేమి సమస్యలు మాయం!
వెలగ పండుతో అద్భుతాలే.. సంతానలేమి సమస్యలు మాయం!
ఐటీ చెల్లింపుదారులకు పండగే.. వచ్చే బడ్జెట్‌లో ట్యాక్స్ తగ్గింపు.?
ఐటీ చెల్లింపుదారులకు పండగే.. వచ్చే బడ్జెట్‌లో ట్యాక్స్ తగ్గింపు.?
ఇలాంటి వాళ్లను ఏం చేయాలి? రేణూ దేశాయ్ సంచలన పోస్ట్.. ఏమైందంటే?
ఇలాంటి వాళ్లను ఏం చేయాలి? రేణూ దేశాయ్ సంచలన పోస్ట్.. ఏమైందంటే?
17 ఏళ్లకే క్రేజీ హీరోయిన్.. రహస్యంగా పెళ్లి, 9 నెలలకే విడాకులు..
17 ఏళ్లకే క్రేజీ హీరోయిన్.. రహస్యంగా పెళ్లి, 9 నెలలకే విడాకులు..
ఐఆర్‌సీటీసీ సైట్‌ డౌన్‌ అయితే రైలు టికెట్లను బుక్‌ చేసుకోవడం ఎలా?
ఐఆర్‌సీటీసీ సైట్‌ డౌన్‌ అయితే రైలు టికెట్లను బుక్‌ చేసుకోవడం ఎలా?
కొత్త ఫీచర్లతో హోండా యూనికార్న్.. అప్‌డేట్ మోడల్ విడుదల
కొత్త ఫీచర్లతో హోండా యూనికార్న్.. అప్‌డేట్ మోడల్ విడుదల
బిచ్చగత్తె చేతిలో అనుమానాస్పద ప్లాస్టిక్ బ్యాగ్.. తెరిచి చూడగా
బిచ్చగత్తె చేతిలో అనుమానాస్పద ప్లాస్టిక్ బ్యాగ్.. తెరిచి చూడగా
హైడ్రాకు ఇప్పటివరకు ఎన్ని ఫిర్యాదులు వచ్చాయో తెలుసా..?
హైడ్రాకు ఇప్పటివరకు ఎన్ని ఫిర్యాదులు వచ్చాయో తెలుసా..?