Black Fungus: దేశవ్యాప్తంగా పెరుగుతున్న బ్లాక్ ఫంగస్.. ఇప్పటి వరకు 8,800 కేసులు.. గుజరాత్‌లోనే అధికం.. !

కరోనా నుంచి కోలుకున్న వారిలో కొత్త మరో మహమ్మారి బ్లాక్‌ ఫంగస్‌ వెలుగుచూస్తోంది. అన్ని ప్రాంతాల్లో కోవిడ్ కేసులతో పాటు బ్లాక్ ఫంగస్ కేసులు కూడా పెరుగుతుందడం మరింత ఆందోళన కలిగిస్తోంది.

Black Fungus: దేశవ్యాప్తంగా పెరుగుతున్న బ్లాక్ ఫంగస్.. ఇప్పటి వరకు 8,800  కేసులు.. గుజరాత్‌లోనే అధికం.. !
Black Fungus
Follow us

|

Updated on: May 22, 2021 | 7:37 PM

Black Fungus cases in India: దేశంలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. కరోనా కట్టడికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన ఆంక్షలు అమలు చేస్తూనే ఉన్నాయి. అయినప్పటికీ రోజురోజుకూ దేశంలో కోవిడ్ పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. కరోనా నుంచి కోలుకున్న వారిలో కొత్త మరో మహమ్మారి బ్లాక్‌ ఫంగస్‌ వెలుగుచూస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో కోవిడ్ కేసులతో పాటు బ్లాక్ ఫంగస్ కేసులు కూడా పెరుగుతుందడం మరింత ఆందోళన కలిగిస్తోంది.బ్లాక్ ఫంగస్ బారిన పడ్డవారు వెంటనే గుర్తించి వైద్యం పొందకపోతే..ఈ వ్యాధి ప్రాణాంతకంగా మారుతోందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

ఇక, కేంద్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారం మే21 నాటికి దేశవ్యాప్తంగా 8,848 బ్లాక్‌ ఫంగస్ కేసులు నమోదయ్యాయి. గుజరాత్‌లో అత్యధికంగా 2,281 మందికి ఈ వ్యాధి సోకినట్లు పేర్కొంది. అత్యధిక కరోనా కేసులు నమోదవుతున్న మహారాష్ట్రలో 2,000, ఆంధ్రప్రదేశ్‌లో 910 మంది దీని బారిన పడ్డారు. మొత్తం కేసుల్లో ఈ మూడు రాష్ట్రాల వాటా 58.66 శాతంగా ఉందని తెలిపింది.

పలు రాష్ట్రాల్లో వెలుగుచూస్తోన్న బ్లాక్‌ ఫంగస్‌ కేసుల ఆధారంగా ఆంఫోటెరిసిన్‌-బి ఔషధాన్ని కేటాయించామని కేంద్ర మంత్రి సదానంద గౌడ శనివారం ట్వీట్ చేశారు. ఇక ఇదేమీ కొత్త వ్యాధి కాకపోయినా.. దీని బారినపడిన వారికి రోజుల్లోనే పరిస్థితి విషమిస్తుందని వైద్యులు చెబుతున్నారు. సాధారణంగా మన శరీరంలోని రక్షణ వ్యవస్థ ఈ ఫంగల్ వ్యాధిని తిప్పికొడుతుంది. అయితే, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు, క్యాన్సర్ రోగులు, అవయవ మార్పిడి చికిత్సలు చేయించుకున్నవారు దీని బారిన పడే అవకాశం ఉందన్నారు. మరోవైపు ఇది అంటువ్యాధి కాదని అమెరికన్ సంస్థ సీడీసీ తేల్చి చెప్పింది.

Read Also….  SBI Report on Corona: కరోనా నియంత్రణకు టీకానే శరణ్యం.. కరోనా తీవ్రతపై ఎస్బీఐ అధ్యయనంలో వెల్లడైన ఆసక్తికర విషయాలు..