AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SBI Report on Corona: కరోనా నియంత్రణకు టీకానే శరణ్యం.. కరోనా తీవ్రతపై ఎస్బీఐ అధ్యయనంలో వెల్లడైన ఆసక్తికర విషయాలు..

దేశంలో సెకెండ్ వేవ్ కారణంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు మరోసారి పెరుగుతున్నాయి. రెండో దశలో ఫిబ్రవరి 15 నుంచి పాజిటివ్ కేసులు అధికంగా నమోదవుతున్నాయి.

SBI Report on Corona: కరోనా నియంత్రణకు టీకానే శరణ్యం.. కరోనా తీవ్రతపై ఎస్బీఐ అధ్యయనంలో వెల్లడైన ఆసక్తికర విషయాలు..
Representative Image
Balaraju Goud
|

Updated on: May 22, 2021 | 7:20 PM

Share

SBI Report on Coronavirus: దేశంలో సెకెండ్ వేవ్ కారణంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు మరోసారి పెరుగుతున్నాయి. రెండో దశలో ఫిబ్రవరి 15 నుంచి పాజిటివ్ కేసులు అధికంగా నమోదవుతున్నాయి. కొత్తగా రికార్డు అవుతున్న కేసులే మహమ్మారి విరుచుకుపడుతుందనడానికి సంకేతమని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) అధ్యయనం స్పష్టం చేసింది. వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం చేయకుంటే కోవిడ్ కేసులు గరిష్ఠ స్థాయికి చేరుతాయని అంచనా వేసింది.

దేశంలో వ్యాప్తంగా కరోనా ఉద్ధృతి పెరగడం, ముఖ్యంగా రోజువారీ కేసుల్లో సగం గ్రామీణ ప్రాంతాల్లోనే నమోదవకావడం ఆందోళన కలిగించే విషయమని ఇప్పటికే ఆరోగ్యరంగ నిపుణులు పేర్కొంటున్నారు. ఈ సమయంలో మహమ్మారి ఉద్ధృతికి ముకుతాడు వేసేందుకు వ్యాక్సినేషన్‌ ప్రక్రియను వేగవంతం చేయడం ఒక్కటే పరిష్కారమని సూచిస్తున్నారు. గత కొంత కాలంగా గ్రామీణ ప్రాంతాలకు వైరస్‌ వ్యాపించిన తీరును ఎస్‌బీఐ నిపుణుల బృందం తాజా నివేదికలో విశ్లేషించింది.

ప్రపంచవ్యాప్తంగా నమోదవుతున్న మొత్తం కేసుల్లో దాదాపు 44శాతం భారత్‌లోనే ఉంటున్నాయి. ముఖ్యంగా సెకండ్‌ వేవ్‌ ప్రభావం గ్రామీణ ప్రాంతాలపై ఎక్కువగా చూపుతోంది. గత మార్చి నెలలో దేశవ్యాప్తంగా అధిక తీవ్రత ఉన్న 15జిల్లాల్లో (55శాతంగా) ఉండగా ప్రస్తుతం అది దేశవ్యాప్తంగా అన్ని జిల్లాలకూ పాకింది. మార్చి నెలలో గ్రామీణ జిల్లాల్లో 36శాతంగా ఉన్న కేసులు, మే నెల వచ్చేసరికి 48శాతానికి పెరగడం ఆందోళన కలిగిస్తోంది.

అంతేకాదు, ప్రస్తుత ట్రెండ్ ఇలాగే కొనసాగితే ఈ దశలో 25 లక్షల మందికిపైగా కరోనా బారిన పడే అవకాశం ఉందని అధ్యయనం వెల్లడించింది. మే నెలాఖరు వరకూ రెండో దశ కొనసాగుతుందని పేర్కొంది. ఎస్బీఐ చీఫ్‌ ఎకనమిక్‌ అడ్వైజర్‌ సౌమ్య కాంతి ఘోష్ ఆధ్వర్యంలో ‘సెకెండ్ వేవ్ ఆఫ్ ఇన్‌ఫెక్షన్: ది బిగినింగ్ ఆఫ్ ది ఎండ్’ పేరుతో నివేదికను రూపొందించారు. ఆంక్షలు, లాక్‌డౌన్‌ల వల్ల ఉపయోగం ఉండదని, పెద్ద ఎత్తున వ్యాక్సినేషన్ ద్వారా కరోనాను నిలువరించవచ్చని నివేదిక సూచించింది. ఈ సమయంలో వైరస్‌ను కట్టడి చేసేందుకు ప్రస్తుతం వ్యాక్సినేషన్‌ వేగవంతం చేయడం ఒక్కటే మార్గమని అభిప్రాయపడ్డారు. ఇది కూడా ఓ భారీ మిషన్‌ మాదిరిగా చేపడితేనే ఎక్కువ మందికి చేరే అవకాశం ఉంటుందని అన్నారు.

జిల్లాల వారీగా పరిశీలిస్తే వైరస్‌ వ్యాప్తి ఎలా ఉందో స్పష్టంగా తెలుస్తుందని ఎస్‌బీఐ నివేదిక పేర్కొంది. మార్చి నెలలో మహారాష్ట్రలో కేవలం 11 నుంచి 15 గ్రామీణ ప్రాంత జిల్లాల్లోనే కరోనా ఉద్ధృతి ఎక్కువగా ఉంది. కానీ, ప్రస్తుతం అక్కడ ఈ సంఖ్య 6కు తగ్గింది. కానీ, ఇతర రాష్ట్రాల్లో వీటి ప్రభావం ఎక్కువైంది. ఆంధ్రప్రదేశ్‌, కేరళ, కర్ణాటక, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో వైరస్‌ విలయాన్ని ఎదుర్కొంటున్నాయని తాజా నివేదిక తెలిపింది. ఇలా దాదాపు చాలా రాష్ట్రాల్లో గ్రామీణ ప్రాంతాల్లో వైరస్‌ విస్తృతి పెరిగిందని పేర్కొంది.

Covid Vaccine

Covid Vaccine

వైరస్‌ తీవ్రత పెరుగుతున్నప్పటికీ వ్యాక్సినేషన్‌ ప్రక్రియ అంత సంతృప్తికరంగా లేదని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నివేదిక పేర్కొంది. ఇక, ఇప్పటివరకు దేశ వ్యాప్తంగా రెండు కంపెనీల వ్యాక్సిన్లు మనకు అందుతున్నాయి. అందులో 16 కోట్ల 93 లక్షల 94 వేల 665 డోసుల కోవిషీల్డ్ వ్యాక్సిన్‌ అందగా.. 2 కోట్ల 3 లక్షల 77 వేల 254 మందికి కోవాగ్జిన్ డోసులు అందాయి. ఇక ఇప్పటి వరకు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారి వివరాలు చూస్తే.. 22 కోట్ల 82 లక్షల 29 వేల 777 మంది వ్యాక్సిన్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అందులో 8 కోట్ల 62 లక్షల 59 వేల 207 మంది.. 18 నుంచి 44 ఏళ్ల మధ్య గ్రూప్ వారు అయితే.. 14 కోట్ల 19 లక్షల 70 వేల 570 మంది 45 ఏళ్ల పై బడిన వారు. ఇక ప్రస్తుతం దేశవ్యాప్తంగా 20 రాష్ట్రాల్లో లాక్‌డౌన్‌, కర్ఫ్యూ ఆంక్షలు కొనసాగుతున్నాయి. దీంతో ఆర్థిక ఒడిదొడుకులు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయని ఎస్‌బీఐ రీసెర్చ్‌ నివేదిక వెల్లడించింది.

గత ఏడాది ఇదే సమయానికి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించినప్పుడు కేసుల సంఖ్య 500లోపే. అయితే, లాక్‌డౌన్లను పొడిగించుకుంటూ పోయిన కొద్దీ కేసుల సంఖ్య పెరుగుతూ పోయింది’అని ఆయన పేర్కొన్నారు. ‘1918–19లో సంభవించిన స్పానిష్‌ ఫ్లూ సమయంలో కూడా ఆయా దేశాల్లో లాక్‌డౌన్‌లు విధించి స్కూళ్లు, ప్రార్థనా మందిరాలు, థియేటర్లను మూసివేశారు. కానీ, లాక్‌డౌన్‌ ఆంక్షలను ఎత్తివేశాక పరిస్థితి మళ్లీ మొదటికే వచ్చింది’ అని విశ్లేషించారు.

Read Also….  no vaccine please: ’18-44 ఏళ్ళ మధ్య వయస్సువారికి వ్యాక్సిన్ ఆపేశాం,’..ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ , మళ్ళీ కేంద్రమే ఆదుకోవాలని విన్నపం