no vaccine please: ’18-44 ఏళ్ళ మధ్య వయస్సువారికి వ్యాక్సిన్ ఆపేశాం,’..ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ , మళ్ళీ కేంద్రమే ఆదుకోవాలని విన్నపం
నగరంలో 18-44 ఏళ్ళ మధ్య వయస్సువారికి వ్యాక్సినేషన్ ప్రక్రియను నిలిపివేశామని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు.
నగరంలో 18-44 ఏళ్ళ మధ్య వయస్సువారికి వ్యాక్సినేషన్ ప్రక్రియను నిలిపివేశామని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. వ్యాక్సిన్ కొరత కారణంగా ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదన్నారు. శనివారం మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన.. తమ వద్ద స్టాక్ పూర్తిగా అయిపోయిందని, ఇక పరిస్థితిని అధిగమించేందుకు కేంద్రమే చొరవ తీసుకోవాలని కోరారు. ఢిల్లీలో ఈ వయస్కులందరికీ టీకా మందు ఇవ్వాలంటే తమకు 80 లక్షల డోసుల వ్యాక్సిన్ అవసరమవుతుందని ఆయన చెప్పారు.తమతో బాటు దేశంలోని వివిధ రాష్ట్రాలకు సరఫరా చేయాలంటే 24 గంటల్లోగా విదేశాల నుంచి వ్యాక్సిన్ ని కేంద్రం కొనుగోలు చేయాలని ఆయన సూచించారు. ఇది తక్షణమే జరగాలన్నారు. అనేక దేశాలు తమకు అవసరమైనదానికన్నా ఎక్కువగా టీకామందులను నిల్వ చేసుకున్నాయని, వాటిని ఇండియాకు ఇవ్వాలని ప్రభుత్వం కోరాలని అన్నారు. అలాగే ఇండియాలో వ్యాక్సిన్ ఉత్పత్తికి విదేశీ కంపెనీలను అనుమతించాలని ఆయన అన్నారు. ఇతర కంపెనీలకు తమ కోవాగ్జిన్ టీకామందు ఫార్ములాను షేర్ చేసేందుకు భారత్ బయోటెక్ అంగీకరించిన విషయాన్ని కేజ్రీవాల్ గుర్తు చేశారు. ఇదే సందర్బంలో విదేశీ సంస్థలను ప్రోత్సహించాలన్నారు.
వ్యాక్సిన్ కొరత కారణంగా 18 ఏళ్ళు అంతకన్నా పైబడినవారికి (44 ఏళ్ళ లోపువారికి) వ్యాక్సిన్ ఇవ్వలేకపోయామని, గత వారం రోజులుగా 235 వ్యాక్సిన్ సెంటర్లను మూసివేయాల్సి వచ్చిందని ఆప్ ఎమ్మెల్యే అతిషి తెలిపారు. మొత్తం 300 కి పైగా సెంటర్లు ఉన్నాయని, వీటిలో మరికొన్ని కూడా మూతపడబోతున్నాయని ఆ ఎమ్మెల్యే చెప్పారు. వ్యాక్సినేషన్ ఎంత త్వరగా చేపడితే అంత మంచిదన్నారు. ఇప్పుడిప్పుడే ఢిల్లీలో కోవిద్ కేసులు చాలావరకు తగ్గాయని, పాజిటివిటీ రేటు సైతం ఎంతగానో తగ్గిందని వెల్లడించారు.
మరిన్ని ఇక్కడ చూడండి: Covid-19 Vaccine: వ్యాక్సిన్ వేసుకున్న ఫొటో పంపండి.. 5 వేలు గెలుచుకోండి..! ( వీడియో )
Gold And Silver Price: బంగారం ధరలకు బ్రేక్.. ప్రధాన నగరాల్లో ఈ రోజు ధరలు… ( వీడియో )