Telangana Schools: పాఠశాలల పునఃప్రారంభంపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. కొద్ది రోజులపాటు..
Schools In Telangana: కరోనా కేసులు తగ్గుతోన్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో లాక్‌డౌన్‌ను ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కరోనా కారణంగా మూతపడ్డ పాఠశాలలను జూలై 1 నుంచి పాఠశాలలను...
Schools In Telangana: కరోనా కేసులు తగ్గుతోన్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో లాక్‌డౌన్‌ను ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కరోనా కారణంగా మూతపడ్డ పాఠశాలలను జూలై 1 నుంచి పాఠశాలలను తిరిగి ప్రారంభించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అయితే కరోనా థార్డ్ వేవ్ ప్రమాదం పొంచి ఉందన్న వార్తలు వస్తోన్న క్రమంలో పాఠశాలల పునఃప్రారంభంపై తెలంగాణ ప్రభుత్వం మరోసారి పునరాలోచించింది. ఈ నేపథ్యంలో పాఠశాలను తిరిగి ప్రారంభించే విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. జూలై 1నుంచి తెలంగాణలోని అన్ని పాఠశాలలు ఆన్‌లైన్ క్లాసులతోనే ప్రారంభం కానున్నాయి. కొద్ది రోజులపాటు ప్రత్యక్ష తరగతులు వాయిదా వేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
కరోనా నేపథ్యంలో మరికొన్ని రోజుల పాటు విద్యార్థులు పాఠశాలలకు రాకపోవడమే ఉత్తమమనే ఆలోచనకు వచ్చిన ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. మరికాసేపట్లో ఈ విషయానికి సంబంధించి అధికారిక ప్రకటన విడుదల చేయనున్నారు.
Also Read: Usiri Avakaya: మంచి పోషకరమైన ఉసిరికాయతో నిల్వ పచ్చడి తయారీ విధానం తెలుసుకుందాం
CM KCR: పల్లె ప్రగతి, పట్టణ ప్రగతికి భారీగా నిధుల కేటాయింపు.. జిల్లాకు కోటి చొప్పున మంజూరు..