Drowning: కామారెడ్డి జిల్లాలో విషాదం.. మంజీరా నదిలో నలుగురు గల్లంతు.. ముగ్గురు మృతి..
Manjira River - Kamareddy District: తెలంగాణలోని కామారెడ్డి జిల్లా బీర్కురులో విషాదకర ఘటన చోటు చేసుకుంది. నీటిలో మునిగి
Manjira River – Kamareddy District: తెలంగాణలోని కామారెడ్డి జిల్లా బీర్కురులో విషాదకర ఘటన చోటు చేసుకుంది. నీటిలో మునిగి ముగ్గురు మృతి చెందగా.. మరొకరు గల్లంతయ్యారు. నీటిలో మునిగిన వారంతా ఒకే కుటుంబానికి చెందిన వారని పోలీసులు వెల్లడించారు. మృతులంతా బిచ్కుంద మండలం చెట్లూరు గ్రామానికి చెందిన వారిగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. మంజీర పరీవాహక ప్రాంతంలోని చౌడమ్మ గుంత దాటుతుండగా.. శనివారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. మృతులు బీర్కూర్ నుంచి బిచ్కుంద మండటంతోని చెట్లూరు వెళ్తూ.. మంజీరా నది దాటుతుండగా.. ఈ ప్రమాదం జరిగింది. నీటి ప్రవాహం అధికంగా ఉండటం, దీంతోపాటు గుంతలు ఉండటంతో వారు నీటిలో మునిగినట్లు పోలీసులు వెల్లడించారు. ఇప్పటివరూ మూడు మృత దేహాలు మాత్రమే లభ్యమయ్యాయి. మరోకరి కోసం నదిలో గాలిస్తున్నారు. మృతుల్లో తల్లీ పిల్లలు ఉన్నారు.
కొద్ది నెలల కిందట మంజీరా నదిలో ఇసుక తవ్వకాలతో భారీగా గుంతలు ఏర్పడ్డాయి. వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు పైనుంచి వరద నీరు వస్తోంది. ఈ క్రమంలో కాలినడకన నది దాటుతుండగా.. గుంతల్లో పడి మునిగిపోయారు.
Also Read: