దారుణం..మూడుముళ్ళు పడ్డ మూడు రోజులకే..నవ వధువుపై భర్త.. మరుదుల సామూహిక అత్యాచారం!

Victimized: భవిష్యత్ మీద ఎన్నో కలలతో ఆ ఇంట అడుగుబెట్టింది. తన సంసార జీవితంపై ఎంతో ఆశతో మెట్టినిల్లు గడప తొక్కింది. తనను కట్టుకున్నవాడితో కాపురం కలకాలం చల్లగా సాగుతుందని భావించింది. కానీ, ఆమె ఆశలు ఆవిరి అయిపోయాయి.

దారుణం..మూడుముళ్ళు పడ్డ మూడు రోజులకే..నవ వధువుపై భర్త.. మరుదుల సామూహిక అత్యాచారం!
Victimized
Follow us
KVD Varma

|

Updated on: Jun 26, 2021 | 5:50 PM

Victimized: భవిష్యత్ మీద ఎన్నో కలలతో ఆ ఇంట అడుగుబెట్టింది. తన సంసార జీవితంపై ఎంతో ఆశతో మెట్టినిల్లు గడప తొక్కింది. తనను కట్టుకున్నవాడితో కాపురం కలకాలం చల్లగా సాగుతుందని భావించింది. కానీ, ఆమె ఆశలు ఆవిరి అయిపోయాయి. కలలు కల్లలు అయిపోయాయి. మెట్టినింట ఆమెకు ముళ్ళ బాట దొరికింది. పెళ్ళయి మూడు రోజులకే నమ్ముకున్న మొగుడు.. అతని సోదరులు ఆమెపై అత్యాచారం చేశారు. అదనపు కట్నం కోసం ఆమెను చిత్రహింసల పాలు చేశారు. ఆ అమానవీయ దాడిలో తీవ్రంగా గాయపడిన ఆమె ప్రస్తుతం ఆసుపత్రిలో బ్రతుకుకోసం పోరాడుతోంది. ఈ అమానుష సంఘటన ఉత్తరప్రదేశ్ లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

ఉత్తరప్రదేశ్ జరీఫ్ నగర్ ప్రాంతంలో ఉంటున్న ఉస్మాన్ పూర్ నివాసి తో కొత్వాలి సహస్వాన్ ప్రాంతానికి చెందిన 20 ఏళ్ల యువతికి జూన్ 22న వివాహం జరిగింది. వివాహ సమయంలో ఆమె పుట్టింటి వారు కట్నకానుకలు బాగానే ముట్టచెప్పి ఆమెను అత్తింటికి సాగనంపారు. అత్తవారింటిలో ఆమె కాలు పెట్టింది మొదలు వేధింపులు మొదలయ్యాయి. అదనపు కట్నం కోసం భర్త, ఇద్దరు మరుదులు, మామ గొడవ చేయడం మొదలు పెట్టారు. చిత్ర హింసలు పెట్టారు. ముందుగానే కట్నం ఇచ్చేశామనీ, ఇంకా ఎక్కడినుంచి తెస్తమనీ ఆమె తల్లిదండ్రులు చెప్పారు. అయినా, కొత్త పెళ్ళికూతురును దారుణంగా హింసించడం మొదలు పెట్టారు. ఇదిలా ఉండగా, శుక్రవారం ఆమె పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆమెతో కేక్ కట్ చేయిస్తానని ఆమె భర్త చెప్పాడు. దానికి ఆమె మురిసిపోయింది.

సాయంత్రం కేక్ తీసుకొచ్చారు. ఆమె భర్త, మరిది, మామ అందరూ కలిసి ఆమెతో కేక్ కట్ చేయించారు. కొవ్వొత్తులు ఊదించారు. తరువాత ఆమె జీవితాన్ని ఊదేయడానికి సిద్ధం అయిపోయారు. పుట్టినరోజు వేడుక ఘనంగా నిర్వహించిన వారు.. రాత్రి కాగానే నరరూప రాక్షసులుగా మారిపోయారు. ఆమె మీద సామూహికంగా అత్యాచారానికి పాల్పడ్డారు. తరువాత ఆమెకు విషం కలిపిన శీతల పానీయం తాగించడానికి ప్రయత్నించారు. అంతటితో ఆగలేదు. కొవ్వొత్తులతో ఆమెను కాల్చారు. ఈ సమయంలో ఆమె ప్రయివేట్ భాగాలు కాలిపోయాయి. కర్రతో దారుణంగా లైంగికంగా హింసించారు. ఈ సమాచారం అందుకున్న ఆమె తండ్రి పోలీసులకు సమాచారం ఇచ్చి వారితో కలిసి ఆమె ఇంటికి చేరుకున్నారు. అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను ఆసుపత్రికి తరలించారు. ప్రసుతం ఆమె తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో ప్రాణాల కోసం పోరాడుతోంది.

బాధితురాలు, ఆమె తండ్రి ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు.. ఆమె భర్తతో సహా ఏడుగురిని అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపించారు. బుడాన్ సీనియర్ పోలీస్ సూపరిండెంట్ సంకల్ప్ శర్మ విలేకరులతో మాట్లాడుతూ.. బాధితురాలు సామూహిక అత్యాచారానికి గురైందని వైద్య పరీక్షలలో తేలింది అన్నారు. ఈ కేసులో ఏడుగురిని అరెస్ట్ చేశామనీ, మరింత దర్యాప్తు అనంతరం అవసరమైన చర్యలు చేపదతామనీ చెప్పారు.

Also Read: భార్య పుట్టింటికి వెళ్లిందని భ‌ర్త‌కు ఆగ్రహం.. మామ, కూతురిపై దాడి.. విధి మాత్రం అత‌డితో ఆడుకుంది

Revenge: మాజీ ప్రియుడి బైక్‌కు నిప్పంటించిన మహిళ.. ఎందుకో తెలుసా..? షాకింగ్ వీడియో..