Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భార్య పుట్టింటికి వెళ్లిందని భ‌ర్త‌కు ఆగ్రహం.. మామ, కూతురిపై దాడి.. విధి మాత్రం అత‌డితో ఆడుకుంది

వారిదో అందమైన కుటుంబం. జీవితాంతం కంటికి రెప్పలా చూసుకుంటానని మాటిచ్చాడు ఆమె భర్త. కొన్నాళ్లు సంతోషంగా గడిచింది. ఇద్ద‌రు పిల్లలు కూడా. అంత‌లోనే...

భార్య పుట్టింటికి వెళ్లిందని భ‌ర్త‌కు ఆగ్రహం.. మామ, కూతురిపై దాడి.. విధి మాత్రం అత‌డితో ఆడుకుంది
Rowdy Attacks Youth
Follow us
Ram Naramaneni

|

Updated on: Jun 26, 2021 | 2:53 PM

కడప జిల్లా పెద్దముడియం మండలం బలపన గూడూరు గ్రామంలో దారుణం జరిగింది. చిదిపిరాళ్లదిన్నే గ్రామానికి చెందిన షేక్ అక్బర్ బాషా తన భార్యతో రోజూ గొడ‌వ పెట్టుకుంటూ ఉండేవాడు. భరించలేక అతని భార్య తన ఇద్దరు కుమార్తెల‌తో కలిసి బలపన గూడూరు గ్రామంలోని పుట్టింటికి వెళ్లింది. భార్య పుట్టింటికి వెళ్లిన విషయాన్ని భరించలేని అక్బర్ బాషా.. ఆవేశంలో అక్కడికి వెళ్లి కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో అతని మామ ఇమామ్, తన నాలుగేళ్ల కూతురు రిహానా గాయపడ్డారు. వారిని మెరుగైన వైద్యం కోసం ప్రొద్దుటూరుకు తరలించారు. అయితే ఇక్క‌డే విధి అత‌డితో ఆడుకుంది. నిందితుడు బైక్‌పై పారిపోతుండగా అదుపుతప్పి కిందపడిపోవ‌డంతో.. గాయాల‌య్యాయి. గమనించిన స్థానికులు అతన్ని జమ్మలమడుగు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

జల్సాల కోసం ద్విచక్రవాహనాల దొంగతనాలు.. నిందితుడు అరెస్ట్

వివిధ రాష్ట్రాల్లో ద్విచక్ర వాహనాలను దొంగలించి, వాటిని తక్కువ ధరకే విక్రయిస్తున్న దొంగను కదిరి రూర‌ల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కదిరి మండలం కుమ్మరవాండ్లపల్లిలో నివాసం ఉంటున్న నూర్‌మహమ్మద్‌.. పాత నేరస్థులైన షేక్‌ ఇలియాజ్‌, అతడి మిత్రుడు సుబహాన్‌ జల్సాలకు అలవాటు పడ్డారు. వీరు ముగ్గురూ సులువుగా డబ్బు సంపాదించాలన్న ఉద్దేశంతో అనంతపురం, కడప జిల్లాలతో పాటు కర్ణాటక ప్రాంతంలో బైక్స్ అపహరించి సొమ్ము చేసుకున్నారు. శుక్రవారం పోలీసులు ప‌క్కా స‌మాచారంతో కుమ్మరవాండ్లపల్లికి చేరుకుని బైక్ అమ్ముతున్న నూర్‌మహమ్మద్‌ను అరెస్టు చేశారు. ఇంట్లో దాచి ఉన్న 18 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.

Also Read: కరోనా థర్డ్ వేవ్‌పై ఆందోళన చెందుతున్నారా? అయితే ఈ గుడ్ న్యూస్ చదవండి

 రోడ్డు ప్రమాదంలో కత్తి మహేష్‌కు స్వల్ప గాయాలు.. తప్పిన పెను ప్రమాదం!