AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

George Floyd Case: జార్జి ఫ్లాయిడ్ హత్య కేసులో తుది తీర్పు.. అమెరికాలో మాజీ పోలీసు అధికారికి 22 ఏళ్ల జైలు శిక్ష!

George Floyd Case: అమెరికాకు చెందిన జార్జ్ ఫ్లాయిడ్ కేసులో తీర్పు వచ్చింది. ఫ్లాయిడ్‌ను చంపినందుకు దోషిగా తేలిన పోలీసు డెరెక్ షావిన్‌కు 22 సంవత్సరాల 6 నెలల జైలు శిక్ష విధించారు.

George Floyd Case: జార్జి ఫ్లాయిడ్ హత్య కేసులో తుది తీర్పు.. అమెరికాలో మాజీ పోలీసు అధికారికి 22 ఏళ్ల జైలు శిక్ష!
George Floyd Case Derek Chauvin Senteced
KVD Varma
|

Updated on: Jun 26, 2021 | 4:18 PM

Share

George Floyd Case: అమెరికాకు చెందిన జార్జ్ ఫ్లాయిడ్ కేసులో తీర్పు వచ్చింది. ఫ్లాయిడ్‌ను చంపినందుకు దోషిగా తేలిన పోలీసు డెరెక్ షావిన్‌కు 22 సంవత్సరాల 6 నెలల జైలు శిక్ష విధించారు. ఈ హత్య 25 మే 2020 న జరిగింది. సరిగ్గా ఒక సంవత్సరం 32 రోజుల తరువాత తీర్పు వచ్చింది. తీర్పు వెలువడిన వెంటనే డెరెక్ షావిన్ బెయిల్ రద్దు చేశారు. అతన్ని అరెస్టు చేశారు. ఫ్లాయిడ్ హత్య కేసును ప్రత్యెక జ్యూరీ విచారించింది. ఈ జ్యూరీలో 6 మంది తెల్లవారు, 6 మంది నల్లజాతీయులు ఉన్నారు. విచారణ సందర్భంగా, ఫ్లాయిడ్ న్యాయవాది జ్యూరీ ముందు మాట్లాడుతూ, డెరెక్ షావిన్ జార్జ్ ఫ్లాయిడ్‌ను చంపిన విధానం గురించి పోలీసుల పద్ధతి తప్పు అని ఒక పిల్లవాడు కూడా చెప్పగలడని చెప్పారు. అయినప్పటికీ, డెరెక్ న్యాయవాది కూడా తన క్లయింట్ ను రక్షించడానికి తన వంతు ప్రయత్నం చేశాడు. డెరెక్ షావిన్ సరైన చర్య తీసుకున్నాడని, ఫ్లాయిడ్ మరణానికి గుండె జబ్బులు, మాదకద్రవ్యలే కారణమని న్యాయవాది వాదించారు,

గత సంవత్సరం మిన్నియాపాలిస్లో ఒక ప్రదర్శన సమయంలో చేతిలో హస్తకళల ప్యాకెట్లు పట్టుకున్న ఫ్లాయిడ్ ను పోలీస్ అధికారి డెరెక్ సోవిన్ అడ్డుకున్నారు. ఫ్లాయిడ్ మెడ పట్టుకున్న డెరెక్ మోకాళ్ళ వరకూ అతని మెడను వంచి పట్టుకున్నాడు. ఇలా ఎనిమిది నిమిషాలకు పైగా ఉంచారు. ఆ సమయంలో ఫ్లాయిడ్ తనని వదిలి పెట్టమని వేడుకున్నా పోలీస్ అధికారి డెరెక్ వినిపించుకోలేదు. ఈ సంఘటన వీడియో వైరల్ అయింది. ఫ్లాయిడ్ మెడను గట్టిగా నొక్కి అతని శ్వాస ఆగిపోయిన తరువాత డెరెక్ అతనిని వస్దిలి కారులో వెళ్ళిపోయాడు. ఈ సమయంలో అక్కడ చాలామంది గుమిగూడారు. ఫ్లాయిడ్ ను ఆసుపత్రికి తరలించారు. అక్కడ అతను మరణించినట్టు పోలీసులు ధ్రువీకరించారు. ఈ ఘటన తరువాత అమెరికాలో అల్లర్లు జరిగాయి. లక్షలాది మంది వీధుల్లోకి వచ్చారు. ఈ కేసులో మాజీ పోలీసు అధికారి డెరెక్ షావిన్ ను 2021 ఏప్రిల్‌లో దోషిగా నిర్ధారించారు. అదేవిధంగా జార్జ్ ఫ్లాయిడ్ మరణం విషయంలో, సిటీ కౌన్సిల్ ఆఫ్ మిన్నియాపాలిస్, ఫ్లాయిడ్ కుటుంబం మధ్య ఒప్పందం జరిగింది. దీని కింద, సిటీ కౌన్సిల్ ఫ్లాయిడ్ కుటుంబానికి 27 మిలియన్ డాలర్లు (సుమారు రూ .196 కోట్లు) ఇచ్చింది.

ఇప్పుడు డెరెక్ షావిన్‌కు వ్యతిరేకంగా 12 మంది జ్యూరీ తీర్పు ఇచ్చింది. ఈ తీర్పు ప్రకారం మాజీ పోలీసు అధికారి డెరెక్ షావిన్ 22 సంవత్సరాల, 6 నెలల జైలు శిక్ష అనుభవిన్చాల్సి ఉంటుంది.

Also Read: SI sexual Harassment : మైనర్ బాలికపై SI లైంగిక వేధింపులు.. తండ్రిని, అన్నని చంపేస్తానంటూ గన్ తో బెదిరింపులు

Revenge: మాజీ ప్రియుడి బైక్‌కు నిప్పంటించిన మహిళ.. ఎందుకో తెలుసా..? షాకింగ్ వీడియో..