AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Revenge: మాజీ ప్రియుడి బైక్‌కు నిప్పంటించిన మహిళ.. ఎందుకో తెలుసా..? షాకింగ్ వీడియో..

Woman gets revenge on ex Boyfriend: వారిద్దరూ.. కొంతకాలం ప్రేమించుకున్నారు. మంచిగా ఉన్నప్పుడు యువతి యువకుడికి బైక్ కొనిచ్చింది. అనంతరం ప్రియుడు, ప్రియురాలి మధ్య మనస్పర్థలు..

Revenge: మాజీ ప్రియుడి బైక్‌కు నిప్పంటించిన మహిళ.. ఎందుకో తెలుసా..? షాకింగ్ వీడియో..
Woman Revenge On Ex Boyfriend
Shaik Madar Saheb
|

Updated on: Jun 26, 2021 | 2:49 PM

Share

Woman gets revenge on ex Boyfriend: వారిద్దరూ.. కొంతకాలం ప్రేమించుకున్నారు. మంచిగా ఉన్నప్పుడు యువతి యువకుడికి బైక్ కొనిచ్చింది. అనంతరం ప్రియుడు, ప్రియురాలి మధ్య మనస్పర్థలు తలెత్తడంతో.. ఇద్దరూ బ్రేకప్ చెప్పుకున్నారు. ఈ క్రమంలో యువతికి అప్పుడెప్పుడో కొనిచ్చిన బైక్ గుర్తుకువచ్చింది. ఇంకేముంది.. మాజీ బాయ్ ఫ్రెండ్‌పై ప్ర‌తీకారం తీర్చుకునేందుకు సిద్ధమైంది. గ‌తంలో తాను అత‌డికి బ‌హుమ‌తిగా ఇచ్చిన బైక్‌ను మ‌హిళ ద‌గ్ధం చేసింది. ఈ షాకింగ్ సంఘ‌ట‌న థాయ్‌లాండ్‌లో వెలుగుచూసింది. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ ప్రస్తుతం సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్‌ అవుతోంది. ఇది చూసిన వారంతా వామ్మో ఇలాంటి గర్ల్ ఫ్రెండ్ అస్సలు ఉండకూడదంటూ కామెంట్లు చేస్తున్నారు.

ఈ సంఘటన సోమ‌వారం బ్యాంకాక్‌లోని స్కూల్ పార్క్‌లో జరిగింది. పార్క్‌లో మాజీ ప్రియుడికిచ్చిన బైక్ వద్దకు వెళ్లిన మహిళ క‌నోక్ వాన్ (36) పెట్రోల్ పోసి నిప్పంటించింది. త‌న‌తో తిరిగి క‌లిసి ఉండేందుకు నిరాక‌రించ‌డంతో మాజీ బాయ్‌ఫ్రెండ్‌పై కోపంతో ఆమె ఈ ప‌నికి తెగ‌బ‌డినట్లు పేర్కొంటున్నారు. ఈ ఘ‌ట‌న‌లో అదృష్ట‌వ‌శాత్తూ ఎవ‌రికీ గాయాలు కాకపోవడంతో.. అందరూ ఊపిరిపీల్చుకున్నారు.

బైక్‌కు నిప్పంటించ‌డంతో ప‌క్క‌నే పార్క్ చేసి ఉన్న మరో ఆరు ద్విచ‌క్ర‌వాహ‌నాల‌కూ మంట‌లు వ్యాపించి దగ్ధమయ్యాయి. వెంటనే అప్రమత్తమైన పోలీసు సిబ్బంది.. అగ్నిమాప‌క యంత్రాల‌ను ర‌ప్పించి మంట‌ల‌ను అదుపులోకి తీసుకువ‌చ్చారు. స్కూల్ బిల్డింగ్‌లోనే పార్కింగ్ స్థలం ఉంది. అయితే.. విద్యార్ధులు క‌రోనా మ‌హ‌మ్మారితో ఆన్‌లైన్ క్లాసుల‌కు హాజ‌ర‌వుతుండ‌టంతో పెనుప్ర‌మాదం త‌ప్పిందని పోలీసులు తెలిపారు. సీసీటీవీ ఫుటేజ్‌ను ప‌రిశీలించ‌గా స్కూల్ ఉద్యోగి మాజీ గ‌ర్ల్‌ఫ్రెండ్‌గా మ‌హిళ‌ను గుర్తించారు. వెంటనే.. బాయ్‌ఫ్రెండ్ ద్విచక్రవాహనాన్ని ద‌గ్ధం చేసిన మ‌హిళ‌ను పోలీసులు అదుపులోకి తీసుకొని అరెస్టు చేశారు.

Also Read:

Pregnant Woman Suicide: పెళ్లై మూడేళ్లకే గ్రామ వాలంటీర్ ఆత్మహత్య.. చేతిలో ఓ బిడ్డ, కడపుల మరో బిడ్డతో బావిలో దూకి మృతి

Maoist Sharadakka: మావోయిస్టు అగ్రనేత హరిభూషణ్‌ భార్య శారదక్క కరోనా మృతి.. ఆయన చనిపోయిన 4రోజులకే మరో విషాదం!