Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Usiri Avakaya: మంచి పోషకరమైన ఉసిరికాయతో నిల్వ పచ్చడి తయారీ విధానం తెలుసుకుందాం

Usiri Avakaya: ఉసిరికాయ మంచి పోషకాహారం ఆహారం. అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా కలిగి ఉంది. విటమిన్ సి అధికంగా ఉండే ఉసిరికాయతో పచ్చడి తయారీ విధానం తెలుసుకుందాం..

Usiri Avakaya: మంచి పోషకరమైన ఉసిరికాయతో నిల్వ పచ్చడి తయారీ విధానం తెలుసుకుందాం
Usirikaya Avakaya
Follow us
Surya Kala

|

Updated on: Jun 26, 2021 | 4:49 PM

Usiri Avakaya: ఉసిరికాయ మంచి పోషకాహారం ఆహారం. అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా కలిగి ఉంది. విటమిన్ సి అధికంగా ఉండే ఉసిరికాయతో పచ్చడి తయారీ విధానం తెలుసుకుందాం..

కావాల్సిన పదార్ధాలు..

ఉసిరి కాయలు – 1 కేజీ ( కొలత ) చింతపండు – 1/4 కేజీ నూనె – 1 కేజీ ( గానుగ నూనె లేదా వేరుశనగ నూనె ) మెంతులు – టీ స్పూన్ ఆవాలు – టీ స్పూన్ పసుపు – అర టీ స్పూన్ ఉప్పు – 150 గ్రామ్స్ కారం – 200 గ్రామ్స్ వెల్లుల్లిపాయ – రెబ్బలు వలిచినవి 100 గ్రామ్స్ ఎండు మిరపకాయలు – 5 నుండి 10 కరివేపాకు – 2 రెబ్బలు పోపుకోసం పచ్చి శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర ఇంగువ (ఇష్టమైనవారు వేసుకోవచ్చు)

పచ్చడి తయారీ విధానం:

ముందుగా ఉసిరి కాయలు కడిగి ఆరపెట్టాలి.. తడిలేకుండా శుభ్రం చేసుకోవాలి. చింతపండు గుజ్జు తీసి దానిలో పసుపు వేసి ఉడకపెట్టాలి.. అలా ఉడకపెట్టిన గుజ్జులో ఉప్పు, కారం కలిపి పక్కన పెట్టుకోవాలి.. వెల్లుల్లి రెబ్బల్ని కచ్చా పచ్చాగా దంచుకోవాలి.. మెంతుల్నివేయించి చల్లారిన తరవాత ఆవాలతో కలిపి మెత్తగా పొడిలా చేసుకొని పక్కన పెట్టుకోవాలి..

ఇపుడు స్టవ్ పై బాండీ పెట్టుకుని నూనెలో ఉసిరి కాయల్ని గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించి తీసి ఒక గిన్నెలో వేయాలి.. దానిలో ముందుగా రెడీ చేసుకున్న వెల్లుల్లి మిక్స్, మెంతి ఆవాల పొడి.. చింతగుజ్జు మిశ్రమం కలపాలి.. ఉసిరి కాయలు వేయించిన నూనెలోనే పోపు పెట్టి ఎండు మిరపకాయలు, పోపు గింజలు, కరివేపాకు వేసి అన్నీ కలిపిన మిక్స్ లో వేయాలి.. అంతే.. నోరూరించే ఉసిరి కాయ పచ్చడి రెడీ..

వెంటనే కూడా తినేయొచ్చు కానీ ముక్కకు ఉప్పు కారం పట్టదు.. కనుక ఈ ఉసిరికాయ పచ్చడిని ఒకటి రెండు రోజుల తర్వాత నుండి తినొచ్చు.

Also Read: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఔషధం ఎన్ని కోట్లో తెలుసా.. దానిని ఎందుకు వాడతారంటే..