AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Fazli Mango : మామిడి పండ్ల రాజు ఫాజ్లీ..! ఒక్కటే కిలోన్నర ఉంటుంది.. విదేశాలకు సరఫరా..

Fazli Mango : ప్రస్తుతం మామిడి సీజన్ నడుస్తోంది. వివిధ రకాల మామిడి పండ్లను మార్కెట్లో విక్రయిస్తున్నారు.

Fazli Mango : మామిడి పండ్ల రాజు ఫాజ్లీ..! ఒక్కటే కిలోన్నర ఉంటుంది.. విదేశాలకు సరఫరా..
Fazli Mango
uppula Raju
|

Updated on: Jun 26, 2021 | 5:09 PM

Share

Fazli Mango : ప్రస్తుతం మామిడి సీజన్ నడుస్తోంది. వివిధ రకాల మామిడి పండ్లను మార్కెట్లో విక్రయిస్తున్నారు. ప్రజలు తమ ఇష్టానుసారం కొని తింటున్నారు. భారతదేశంలో ప్రధానంగా 24 రకాల మామిడి పండ్లు ఉన్నాయి. వీటిలో అల్ఫోన్సో, కేజర్, దస్సేరి, హిమ్సాగర్, కిషన్ భోగ్, చౌసా, బాదామి, సఫేడా, బొంబాయి గ్రీన్, లాంగ్రా, తోటపురి, నీలం, రాస్‌పురి, ముల్గోబా, లక్ష్మణ్‌బోగ్, అమ్రపాలి, ఇమామ్ పసంద్, ఫజ్లీ, మన్కురాబ్ వాన్రాజ్, కిల్లిచుందన్, రోమాని ప్రధానమైనవి.

ఫాజ్లీ మామిడి దాని పరిమాణం, బరువుకు సంబంధించి ప్రత్యేకమైనది. ఇది సాధారణంగా పశ్చిమ బెంగాల్ లోని మాల్డా జిల్లాలో పండిస్తారు. ఇది పరిమాణంలో పెద్దది, 700-1500 గ్రాముల బరువు ఉంటుంది. అంటే ఈ మామిడి పూర్తి పరిమాణంలో ఒకటిన్నర కిలోల వరకు ఉంటుంది. ఈ మామిడి తొక్క ఇతర మామిడి పండ్ల కంటే కఠినమైనది. కొద్దిగా మందంగా ఉంటుంది. మామిడి గుజ్జు లేత పసుపు, కొద్దిగా గట్టిగా, జ్యుసిగా ఉంటుంది. మామిడిలో ఫైబర్ చాలా తక్కువగా ఉంటుంది. ఈ మామిడి వాసన చాలా బాగుంటుంది. రుచి చాలా తీపిగా ఉంటుంది.

దేశంలో బెంగాల్‌తో పాటు బంగ్లాదేశ్‌లో కూడా ఈ మామిడిని పెద్ద ఎత్తున పండిస్తారు. ఫాజ్లీ మామిడిని ఊరగాయలు, జామ్-జెల్లీలను తయారు చేయడానికి విస్తృతంగా ఉపయోగిస్తారు. ఫాజ్లీ మామిడి వాణిజ్య రకంగా పరిగణించబడుతుంది. వీటిని ఎక్కువగా విదేశాలకు ఎగుమతి చేస్తారు. ఇది మామిడి రైతులకు మంచి ఆదాయాన్ని ఇస్తుంది. 2009 సంవత్సరంలో ఫాజ్లీ మామిడి జిఐ ట్యాగ్ కోసం భారతదేశం దరఖాస్తు చేసింది. కానీ అది బంగ్లాదేశ్‌తో వివాదంలో చిక్కుకుంది. WTO లో నమోదుకు సంబంధించి భారతదేశం నుంచి వివాదం కూడా కొనసాగుతోంది. వీటిని బెంగాల్‌లోనే కాకుండా బిహార్లో కూడా పండిస్తారు.

Schools: పాఠ‌శాల‌ల పునఃప్రారంభంపై కీల‌క నిర్ణ‌యం తీసుకున్న ప్ర‌భుత్వం.. కొద్ది రోజుల‌పాటు ప్ర‌త్య‌క్ష త‌ర‌గ‌తులను..

These Banks : కరోనా సమయంలో లాభాలు ఆర్జించిన బ్యాంకులు ఇవే..! ఎస్బీఐ నుంచి మొదలుపెడితే చాలా బ్యాంకులు..?

CM KCR: ప‌ల్లె ప్ర‌గ‌తి, పట్టణ ప్రగతికి భారీగా నిధుల కేటాయింపు.. జిల్లాకు కోటి చొప్పున మంజూరు..

ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్