Men’s Health Tips: వీర్య కణాల సమస్యా… పురుషులు ఇలా శనగలను తింటే సరి..!!

Men's Health Tips: నేటి తరానికి ఉరుకుల పరుగుల జీవితం. సమయానికి తినని తిండి.. సమయానికి పడుకోని నిద్ర.. పగలు రాత్రి అనే బేధం లేని పని... అసలు పగలు పని చేసి.. రాత్రి నిద్రపోవాలి...

Men's Health Tips: వీర్య కణాల సమస్యా... పురుషులు ఇలా శనగలను తింటే సరి..!!
Bengal Gram
Follow us
Surya Kala

|

Updated on: Jun 26, 2021 | 5:57 PM

Men’s Health Tips: నేటి తరానికి ఉరుకుల పరుగుల జీవితం. సమయానికి తినని తిండి.. సమయానికి పడుకోని నిద్ర.. పగలు రాత్రి అనే బేధం లేని పని… అసలు పగలు పని చేసి.. రాత్రి నిద్రపోవాలి అనే నియమం మార్చేస్తున్న ఉద్యోగాలు.. దీనికి తోడు.. తినే తిండి రసాయనాల మయం.. దీంతో ఆడ మగ , చిన్న పెద్ద అనే బేధం లేకుండా వ్యాధుల పాలవుతున్నారు. ఇక ముఖ్యంగా పురుషులు ఎక్కువగా వీర్య కణాల లోపాన్ని ఎదుర్కొంటున్నారు. దీంతో పిల్లలు కలగడం లేదు.. మానసికంగా వేధనకు గురి అవుతున్నారు.. అయితే వీర్య కణాల వృద్ధికి మనం తినే తిండిలో చిన్న పాటి మార్పులు చేసుకొంటే చాలు అని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.. మనం తినే శనగలు.. నిత్యం తినే పురుషులు వీర్య కణాల సమస్య నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు అని అంటున్నారు..

మరి ఈ శనగలను ఏ విధంగా తింటే వీర్య కణాల సమస్య తీరుతుందో తెలుసుకుందాం..!!

* ఒక కప్పు శనగలను తీసుకొని రాత్రి పూట వాటిని నానబెట్టి ఉదయాన్నే వాటిలో ఒక టీ స్పూన్ తేనె కలుపుకొని తినాలి. ఇలా రోజూ చేస్తే.. చాలా త్వరగా వీర్య కణాల వృధ్ధి జరుగుతుంది అట.. * ఒక గుప్పెడు శనగలు, 5 బాదం పప్పులను రాత్రి నీటిలో నాన బెట్టి.. ఉదయాన్నే పరగడుపున తినాలి. ఆ తర్వాత ఓ గ్లాసు గోరు వెచ్చని పాలు తాగాలి.. ఇలా క్రమం తప్పకుండా కొన్ని రోజులు చేస్తే వీర్య కణాల సంఖ్య బాగా పెరుగుతుంది. *రాత్రి పూట నానబెట్టిన శనగలను ఉదయాన్నే బెల్లంతో కలిపి తింటే.. శృంగార సామర్ధ్యం పెరుతుంది.. వీర్య కణాల వృధ్ధి చెందుతాయి… * రాత్రి నానబెట్టిన శనగలను ఉదయం నేతిలో వేయించి.. వాటిని తిని ఓ గ్లాసు వేడి పాలను తాగాలి.. ఇలా కొన్ని రోజులు రోజూ చేస్తే.. వీర్య కణాల సంఖ్య పెరుగుతుంది. మరి డాక్టర్ల దగ్గరకు వెళ్ళి.. వేలకు వేల డబ్బులను వదిలించుకొనే బదులు వంటిట్లో ఉన్న శనగలను నానబెట్టే పనిలో ఉంటే.. డబ్బుకి డబ్బుకి ఆదా..!! ఆరోగ్యానికి ఆరోగ్యం.. సింపుల్ చిట్కాలతో ప్రోబ్లెమ్ సాల్వ్..!!

Also Read : సెకండ్ వేవ్ తర్వాత భారతీయ ప్రయాణీకులను అనుమతిస్తున్న దేశాలు ఇవే.. కండిషన్స్ అప్లై