World Costly Medicine: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఔషధం ఎన్ని కోట్లో తెలుసా.. దానిని ఎందుకు వాడతారంటే..
World Costly Medicine: ప్రాణం పోయే సమయం వచ్చినప్పుడు.. ఆ ప్రాణాన్ని నిలబెట్టడానికి ఎంత ఖర్చు అయినా పెడతాం.. ఎంత ఖరీదైన మందులైనా వాడతాం అయితే..
World Costly Medicine: ప్రాణం పోయే సమయం వచ్చినప్పుడు.. ఆ ప్రాణాన్ని నిలబెట్టడానికి ఎంత ఖర్చు అయినా పెడతాం.. ఎంత ఖరీదైన మందులైనా వాడతాం అయితే ప్రపంచంలో అత్యంత ఖరీదైన మెడిసిన్ ఏమిటో తెలుసా.. దాని కాస్ట్ వేలల్లో, లక్షల్లో కాదు..ఏకంగా దాని విలువ కోట్లలో ఉంది. వివరాల్లోకి వెళ్తే..
ప్రపంచంలో అత్యంత ఖరీదైన మెడిసిన్ విలువ రూ 18 కోట్ల రూపాయలు. ఈ ఔషధాన్ని నోవార్టిస్ ఉత్పత్తి చేస్తుంది. దీనిపేరు జోల్జెన్‌స్మా . ఈ మెడిసిన్ ఒక్కో డోసు ఖరీదు 18.20 కోట్లంట. ఇంత ఖరీదైన మెడిసిన్ ను ఏ రోగానికి వాడతారో తెలుసా.. చిన్నారులకు వచ్చే అరుదైన వ్యాధి కోసమట. ఈ మెడిసిన్‌ను చిన్నారుల్లో అరుదుగా వచ్చే వ్యాధి ఎస్‌ఎంఏ(స్పైనల్ మస్కులార్ అట్రోపీ) టైప్ 1 చికిత్సకు కోసం వాడతారు. ఎస్‌ఎంఏ వ్యాధి సోకిన చిన్నారుల్లో కండరాలు బలహీనపడి.. కాళ్లూ చేతులు కదపలేక.. పక్షవాతం వచ్చి చ6చ్చుబడిపోయినవాటిలా అయిపోతాయి. అయితే ఈ వ్యాధి సోకిన చిన్నారులు దాదాపు 90 శాతం మంది మరణిస్తుంటారు. అలాంటి చిన్నారులకు ఈ మెడిసిన్ ఇస్తే..వెంటిలేటర్ అవసరం లేకుండా గాలిపీల్చుకుంటారు. ఈ మెడిసిన్ వలన వ్యాధి పూర్తిగా నయం కాకపోయినా వ్యాధి పెరగకుండా ఉంటుందట. అంతేకాక కండరాల్లో కదలికలు వచ్చి నెమ్మదిగా పాకడం, కూర్చోవడం, నడవడం కూడా చేయగలుగుతారు.
ప్రస్తుతం అత్యంత ఖరీదైన ఈ ఔషధ తయారీ.. విప్లవాత్మకమైన గొప్ప ముందడుగు అని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ ఔషధానికి ఇంగ్లాండ్‌కు చెందిన ఎన్‌హెచ్‌ఎస్ వాడుక అనుమతులిచ్చింది. ఈ మందును ఇప్పటికే భారత్ లోని ముంబై కు చెందిన దంపతులు వారి చిన్నారి కోసం ఈ మందును తెప్పించుకున్న సంగతి తెలిసిందే.